MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Pulivendula: జగన్ కంచుకోట బద్దలు.. పులివెందులలో టీడీపీ ఎలా చ‌క్రం తిప్పింది

Pulivendula: జగన్ కంచుకోట బద్దలు.. పులివెందులలో టీడీపీ ఎలా చ‌క్రం తిప్పింది

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించి, జగన్ కంచుకోటను బద్దలు కొట్టింది. లతారెడ్డి 6,050 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే, జగన్ కుటుంబ కంచుకోటను టీడీపీ ఎలా బద్దలు కొట్టింది?  

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 14 2025, 12:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పులివెందులలో టీడీపీ సంచలనం
Image Credit : X/TDP, YSRCP

పులివెందులలో టీడీపీ సంచలనం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చారిత్రాత్మక సంఘటనగా నిలిచే విధంగా పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఘన విజయం సాధించింది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ ఆధిపత్యం కొనసాగుతున్న ఈ ప్రాంతంలో టీడీపీ అభ్యర్థి మా రెడ్డి లతారెడ్డి 6,050 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కేవలం 685 ఓట్లు మాత్రమే సాధించి, డిపాజిట్‌ను కోల్పోయారు.

30 ఏళ్ళ తరువాత, పులివెందులలో గెలిచిన ప్రజాస్వామ్యం.. స్వేచ్ఛగా ఓటు వేసి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన పులివెందుల ప్రజలు.#FreedomAfter30Years#Pulivendula#AndhraPradeshpic.twitter.com/NjSDZxoh1f

— Telugu Desam Party (@JaiTDP) August 14, 2025

DID YOU
KNOW
?
పులివెందుల రికార్డు
పులివెందుల చరిత్రలో 30 ఏళ్ల తర్వాత వైఎస్ కుటుంబ మద్దతు లేని పార్టీ జడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోవడం ఇదే మొద‌టిసారి. ఈ ఎన్నికల ఫలితం, వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలో చారిత్రాత్మక రాజకీయ మార్పుకు సంకేతంగా నిలిచింది.
25
పులివెందుల వైఎస్ ఫ్యామిలీ కంచుకోట
Image Credit : YSR Congress Party/X

పులివెందుల వైఎస్ ఫ్యామిలీ కంచుకోట

1978 నుండి పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచింది. 1995, 2001, 2006, 2021లో జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్ కుటుంబ మద్దతుతో ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. ప్రత్యర్థులు నామినేషన్ వేయడానికి కూడా భయపడ్డ పరిస్థితి. 

2016లో టీడీపీ మొదటిసారి అభ్యర్థిని బరిలోకి దించగా, చివరి నిమిషంలో ఆ అభ్యర్థి వైసీపీలో చేరిపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.

Related Articles

Related image1
Pulivendula: జగన్ అడ్డాలో వైసీపీకి షాక్.. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ గెలుపు
Related image2
School Holiday: ఏపీలో అతిభారీ వర్షాలు.. ప‌లు జిల్లాల్లో స్కూల్స్‌కు సెలవులు
35
టీడీపీ ప్రత్యేక వ్యూహంతో గెలుపు
Image Credit : Getty

టీడీపీ ప్రత్యేక వ్యూహంతో గెలుపు

ఈసారి పులివెందులలో గెలవాలనే స్పష్టమైన లక్ష్యంతో టీడీపీ పక్కా ప్రణాళిక వేసింది. బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం, కడప, జమ్మలమడుగు కీలక నేతలతో ప్రచారం నిర్వహించడం విజయానికి కారణమయ్యాయి.

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాధవిరెడ్డి, మంత్రి సవిత, సీం రమేశ్, బైరెడ్డి శబరి వంటి నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రతి గ్రామంలో సమస్యలను గుర్తించి పరిష్కార హామీలు ఇవ్వడం, వైసీపీ నుండి ముఖ్య నేతలను టీడీపీలోకి రప్పించడం ప్రధాన వ్యూహాలుగా నిలిచాయి.

45
వైసీపీ లోపాలే ఆ పార్టీ ఓటమి కారణాలు
Image Credit : X/YSR Congress Party

వైసీపీ లోపాలే ఆ పార్టీ ఓటమి కారణాలు

వైసీపీ ఈ ఎన్నికను మొదట్లో సీరియస్‌గా తీసుకోకపోవడం, సానుభూతి ఓట్లు వస్తాయని భావించి మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని బరిలోకి దించడం పెద్ద పొరపాటుగా మారింది.

అవినాష్ రెడ్డి, రవీంద్రనాద్ రెడ్డి, మేయర్ సురేశ్ బాబు వంటి నేతలు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, ప్రజా వ్యతిరేకతను తగ్గించలేకపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసు, కుటుంబ విభేదాలు కూడా ఓటర్ల మనసును ప్రభావితం చేశాయి.

55
కుప్పం vs పులివెందుల: రాజకీయ ప్రభావం
Image Credit : stockphoto

కుప్పం vs పులివెందుల: రాజకీయ ప్రభావం

2021లో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని సాధించి చంద్రబాబును బలహీనపరిచే ప్రయత్నం చేసింది. ఇప్పుడు టీడీపీ పులివెందులలో గెలిచి ప్రతీకారం తీర్చుకుందని చెప్ప‌వ‌చ్చు.

ఈ విజయంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఉత్సాహం రెట్టింపు కానుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, జగన్ కంచుకోట బద్దలు కావడం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై గణనీయ ప్రభావం చూపనుంది. టీడీపీ జోరును అడ్డుకునేందుకు జ‌గ‌న్ ఎలాంటి వ్యూహ ర‌చ‌న‌తో ముందుకు సాగుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
అమరావతి
తెలుగుదేశం పార్టీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved