Pulivendula: పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీకి చెందిన‌ లతారెడ్డి 5 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జ‌గ‌న్ అడ్డాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.

Pulivendula: పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జెండా ఎగరేసింది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 5 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 6,735 ఓట్లు సాధించిన లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని ఘోరంగా ఓడించారు. హేమంత్ రెడ్డి కేవలం 683 ఓట్లకే పరిమితమవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి జగన్ స్వస్థలమైన పులివెందులలో ఈ ఓటమి వైసీపీకి పెద్ద షాక్‌గా మారింది.

Scroll to load tweet…

పులివెందులలో 74 శాతం, ఒంటిమిట్టలో 86 శాతం ఓటింగ్ నమోదైంది. మంగళవారం జరిగిన పోలింగ్‌లో అవకతవకల ఆరోపణలతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 3, 14వ పోలింగ్ కేంద్రాల్లో బుధవారం రీ పోలింగ్ జరిగింది. అచ్చవెల్లి పోలింగ్ కేంద్రంలో 68.50 శాతం ఓటింగ్ కాగా, కొత్తపల్లెలో 54.28 శాతం ఓటింగ్ నమోదైంది.

వైసీపీ బహిష్కరణ నిర్ణయం

పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ రీ పోలింగ్‌ను బహిష్కరించింది. కౌంటింగ్‌కి హాజరుకావద్దని కూడా పలు నేతలు వ్యాఖ్యానించినప్పటికీ, అధికారికంగా పార్టీ ప్రకటించలేదు. ఒంటిమిట్టలో వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కౌంటింగ్‌ను బహిష్కరించారు.

Scroll to load tweet…

కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ ఎన్నికలను ప్రజాస్వామ్య విరుద్ధంగా నడిపిందని ఆరోపించారు. తాము 15 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ డిమాండ్ చేసినప్పటికీ, కేవలం 2 కేంద్రాల్లోనే రీ పోలింగ్ జరిపారని విమర్శించారు. అందువల్ల వైసీపీ బహిష్కరణ నిర్ణ‌యం తీసుకుందన్నారు.

గురువారం ఉదయం 8 గంటల నుంచి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీలో కౌంటింగ్ ప్రారంభమైంది. పులివెందుల, ఒంటిమిట్ట ఉపఎన్నికలకు కలిపి 22 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేసీ అదితిసింగ్‌లు కేంద్రాన్ని పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. మైక్రో అబ్జర్వర్లు, ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా సజావుగా లెక్కింపు జరిగేలా చర్యలు చేపట్టారు.