- Home
- Andhra Pradesh
- Andhra pradesh: విజన్ 2047 అంటే ఏంటి.? చంద్రబాబు కల నిజమైతే జరిగే మార్పులు ఏంటి.?
Andhra pradesh: విజన్ 2047 అంటే ఏంటి.? చంద్రబాబు కల నిజమైతే జరిగే మార్పులు ఏంటి.?
విజన్ 2047 విజన్ ఇటీవల ఇది ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఈ విజన్‌కు ఆద్యుడు చంద్రబాబు నాయుడు అనడంలో ఎలాంటి సందేహం. పాతికేళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందన్న ఆలోచనతో ముందుకు సాగుతారు చంద్రబాబు. ఇది ఆయన ప్రత్యర్థులు కూడా ఒప్పుకోవాల్సిందే.

భావితరానికి నీడ
తీరప్రాంత గ్రామంలో ఒక తాత చెట్టును నాటాడు. అయితే ఆ చెట్టు పెరిగి, పండ్లు కాయడానికి పాతికేళ్లు పడుతుంది. పాతికేళ్ల తర్వాత నువ్వు ఉంటావో, లేదో తెలియదు అంతదానికి ఈ మొక్క నాటడం ఎందుకు తాతా.? అని కొందరు పిల్లలు ప్రశ్నిస్తారు. దానికి ఆ తాత నవ్వుతూ.. "నేను తినకపోవచ్చు కానీ, మన మనవళ్లు ఈ చెట్టు నీడలో కూర్చుంటారు, పండ్లను తింటారు అని సమాధానం ఇస్తాడు.
చంద్రబాబు నాయుడు తాజాగా న్యూఢిల్లీలో ప్రకటించిన ‘స్వర్ణ ఆంధ్రప్రదేశ్@2047’ నినాదం వింటే అచ్చంగా పైన చెప్పిన కథే గుర్తొస్తుంది. ఇది కేవలం పాలసీ కాదు, అది తరాల ఆలోచన. రాజకీయాల్లో సాధారణంగా వచ్చే ఎన్నికల దాకా మాత్రమే ఆలోచించే నాయకుల మధ్య, ఇది ఒక అద్భుతమైన దీర్ఘకాలిక దృష్టి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాజకీయాల్లో అరుదైన దూరదృష్టి
2047 నాటికి చంద్రబాబు వయస్సు 102కి చేరుతుంది. ఆయన స్వయంగా ఈ లక్ష్యాలను చూడలేకపోయే అవకాశం ఉంది. కానీ ఆయన ఈ దృష్టిని ఎందుకు పెట్టారు? పదవికోసం కాదు – పురోగతికోసం. ఇది ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రపంచస్థాయి ఆర్థిక, విద్యా, టెక్నాలజీ కేంద్రంగా మార్చే ప్రయత్నం. ఇంకా భూమిపైకి రాని వారి భవిష్యత్తును కూడా భద్రపరిచే గొప్ప విజన్. అయితే బాబు విజన్‌ను విమర్శిస్తూ.. గ్రాఫిక్స్ బాబూ అంటూ వ్యంగ్యంగా మాట్లాడే వారు కూడా ఉంటారు. కానీ లెగసీ గురించి ఆలోచించే వ్యక్తిని, కాలం తర్వాతే గౌరవిస్తుంది.
అసలు విజన్ 2047 లక్ష్యాలు ఏంటి.?
* రూ. 200 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ (USD 2.4 ట్రిలియన్)
* వ్యక్తిగత ఆదాయం: రూ. 35 లక్షలు (USD 42,000)
* 60 శాతం పట్టణీకరణ, సగటు జీవితకాలం 85 ఏళ్లు
* విశాఖ, అమరావతి, తిరుపతిలో గ్లోబల్ యూనివర్సిటీలు
* అమరావతిలో సిలికాన్ వ్యాలీకి పోటీగా క్వాంటం వ్యాలీ ఏర్పాటు.
* AI ఆధారిత పాలన, వాట్సాప్ ద్వారా ప్రజా సేవలు (ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి), జీరో పేదరికం
గతం చూసినవాడు భవిష్యత్తు ఊహించగలడు
చంద్రబాబు అనగానే గుర్తొచ్చేది సైబరాబాద్, బిల్ గేట్స్ ఇండియాలోకి రావడం, ఈ-గవర్నెన్స్ ప్రవేశపెట్టడం, ఇంటర్నెట్ రాకముందే డిజిటల్ మూడ్. ఇప్పుడు చంద్రబాబు ఆలోచన మరో పాతికేళ్ల తర్వాత అనేలా ఉంది. ఇందులో భాగంగానే క్వాంటమ్ వ్యాలీ, ఏఐ పాలన, ప్రపంచ స్థాయి జీవన నాణ్యత కలిగిన నగరంగా అమరావతి నిర్మాణం లాంటి లక్ష్యాలను చంద్రబాబు పెట్టుకున్నారు.
మార్గం దూరం కావొచ్చు, దిశ మాత్రం ఉంది
స్వర్ణ ఆంధ్రా 2047 ప్రణాళిక దీర్ఘకాలం అయ్యుండొచ్చు పాలనా వ్యవస్థ, రాజకీయ వ్యతిరేకత, ఆర్థిక ప్రతికూలతలు ఉండి ఉండొచ్చు. కానీ ఆ దిశగా మాత్రం అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి చంద్రబాబు ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, ఏఐ ఆధారిత యూనివర్సిటీలకు ఆమోదం ఇవ్వడం ఇవన్నీ ఆ విజన్ సాధనలో భాగమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.