- Home
- Andhra Pradesh
- Surrogacy scam: సరోగసి పేరుతో ఇంత పెద్ద స్కామ్ జరుగుతోందా.? సస్పెన్స్ థ్రిల్లర్‌కి ఏమాత్రం తగ్గని " సృష్టి" కథ.
Surrogacy scam: సరోగసి పేరుతో ఇంత పెద్ద స్కామ్ జరుగుతోందా.? సస్పెన్స్ థ్రిల్లర్‌కి ఏమాత్రం తగ్గని " సృష్టి" కథ.
పిల్లలు పుట్టని దంపతులే వారికి పెట్టుబడి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై జరుగుతోన్న దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

షాకింగ్ విషయాలు
విశాఖపట్నంలోని యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై దర్యాప్తు కొనసాగుతున్నకొద్దీ పలు షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపిన వివరాల ప్రకారం.. సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతోందని, ఫెర్టిలిటీ సెంటర్‌లో జరిగే లావాదేవీలు పూర్తిగా మోసపూరితమైనవని చెప్పారు.
సంతానం కోసమని ఆశ్రయిస్తే..
2024 ఆగస్టులో సంతానం కోసం వచ్చిన ఓ దంపతులకు క్లినిక్ యజమాని డాక్టర్ నమ్రత సరోగసి ద్వారా బిడ్డ కల్పిస్తానని చెప్పింది. ఈ ప్రక్రియ కోసం తొమ్మిది నెలలపాటు లక్షల రూపాయలు వసూలు చేశారు. 2025 జూన్‌లో ఓ మగ శిశువు పుట్టిన తర్వాత, తప్పుడు జనన సర్టిఫికెట్, నకిలీ డీఎన్ఏ రిపోర్ట్ ఇచ్చి ఆ బిడ్డను అప్పగించారు.
డీఎన్ఏ టెస్ట్‌తో అసలు నిజం
అనుమానం వచ్చిన దంపతులు డీఎన్ఏ పరీక్ష చేయించగా, బిడ్డ వారిదని నిరూపణ కాలేదు. మోసపోయినట్టు గ్రహించిన వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో డాక్టర్ నమ్రత చిన్న పిల్లలను కొనుగోలు చేసి సరోగసి బిడ్డలుగా చూపుతూ విక్రయించిందని బయటపడింది.
రూ. 90 వేలకు కొనుగోలు, రూ. 40 లక్షలకు విక్రయం
దర్యాప్తులో భాగంగా.. నమ్రత ఢిల్లీకి చెందిన గర్భిణి నుంచి శిశువును రూ. 90,000కు కొనుగోలు చేసి, సరోగసి బిడ్డగా చెప్పి ఆంధ్రప్రదేశ్‌లోని దంపతులకు రూ. 40 లక్షలకు విక్రయించినట్లు తేలింది. ప్రతి క్లయింట్ నుంచి రూ. 20– రూ. 30 లక్షలు వసూలు చేస్తూ బిడ్డలను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
8 మంది అరెస్టు
ఇప్పటికే నమ్రతపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10కి పైగా కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం, గుంటూరు పోలీస్ స్టేషన్‌లో కూడా పాత కేసులు ఉన్నాయి. ఫెర్టిలిటీ సెంటర్ రిజిస్ట్రేషన్ రద్దయినా, ఆమె మరో డాక్టర్ పేరుతో మోసాన్ని కొనసాగించిందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఇప్పటివరకు 8 మంది కీలక నిందితులను అరెస్టు చేశారు.