MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Srikakulam Stampede : ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కాశీబుగ్గ ఆలయం .. ఎవరు నిర్మించారో తెలుసా?

Srikakulam Stampede : ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కాశీబుగ్గ ఆలయం .. ఎవరు నిర్మించారో తెలుసా?

Srikakulam Stampede : శ్రీకాకుళంలో తొక్కిసలాట జరిగిన వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి కీలక విషయాలు బైటికి వస్తున్నాయి. ఇది ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉందట.. దీన్ని ఎవరు నిర్మించారో తెలుసా? 

2 Min read
Arun Kumar P
Published : Nov 01 2025, 02:10 PM IST| Updated : Nov 01 2025, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శ్రీకాకుళంలో తొక్కిసలాట
Image Credit : Screenshot to PTI

శ్రీకాకుళంలో తొక్కిసలాట

Srikulam Stampede : శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కార్తీక మాస వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్తీక ఏకాదశి... అందులోనూ శనివారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి... ఇలాగే పలాస కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. అయితే ఈ ఆలయ సామర్థ్యం కేవలం రెండుమూడు వేలు మాత్రమేనట... కానీ ఏకంగా 20 నుండి 25 వేలమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.

తొక్కిసలాటపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఇతర అధికారులు ఆలయానికి చేరుకున్నారు. ముందుగా భక్తులను కంట్రోల్ చేసి అక్కడినుండి పంపించేశారు... అనంతరం గాయపడినవారిని రక్షించి హాస్పిటల్ కు తరలించారు. తొక్కిసలాటలో మరణించినవారి మృతదేహాలను కూడా అక్కడినుండి తరలించారు. 

24
ఘటనాస్థలికి చేరుకున్న అచ్చెన్నాయుడు
Image Credit : Asianet News

ఘటనాస్థలికి చేరుకున్న అచ్చెన్నాయుడు

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్నవెంటనే జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు ఇతక నాయకులు, ఉన్నతాధికారులు కూడా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

Related Articles

Related image1
శ్రీకాకుళంలో ఘోర ప్రమాదం.. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమిదేనా?
Related image2
Vijay : విజయ్ కరూరు సభలో తొక్కిసలాట ఎందుకు జరిగింది? కారణం ఇదే
34
కాశీబుగ్గలో ఆలయ నిర్వహకులెవరు?
Image Credit : X

కాశీబుగ్గలో ఆలయ నిర్వహకులెవరు?

ప్రస్తుతం కాశీబుగ్గలోని ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 12 ఎకరాల్లో ఆలయ ప్రాంగణం ఉండగా... 5 ఎకరాల్లో ప్రధాన ఆలయాన్ని హరిముకుంద్ పండా అనే వ్యక్తి సొంత డబ్బుతో నిర్మించారట. ఇందుకోసం దాదాపు రూ.10 నుండి రూ.20 కోట్లవరకు ఖర్చుచేసినట్లుగా తెలుస్తోంది. గతేడాదే ఈ ఆలయాన్ని ప్రారంభించారు.

 ఈ ఆలయానికి ప్రతి శనివారం 1000 మందివరకు భక్తులు వస్తారట... కార్తీకమాసం సందర్భంగా ఈ శనివారం రెండుమూడు వేలమంది వస్తారని ఆలయ నిర్వహకులు భావించి అందుకు తగినట్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఒక్కసారిగా దాదాపు 20 వేలకు పైగా భక్తులు పోటెత్తడంతో ఏం చేయలేకపోయారని... వారిని కంట్రోల్ చేయడం సాధ్యంకాలేదు... దీంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.

44
శ్రీకాకుళం తొక్కిసలాటపై పవన్ కల్యాణ్
Image Credit : Pawan Kalyan Twitter

శ్రీకాకుళం తొక్కిసలాటపై పవన్ కల్యాణ్

శ్రీకాకుళం తొక్కిసలాటపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని... భక్తుల మరణం గురించి తెలిసి ఆవేదనకు గురయ్యానని అన్నారు. మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను... క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని... విచారణ చేపట్టి తొక్కిసలాటకు గల కారణాలేంటో తెలుసుకుంటామని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.

కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది... కాబట్టి క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు పవన్ కల్యాణ్. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తుతోపాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లా, పలాస - కాశీబుగ్గ పట్టణం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మరణించడం అత్యంత దురదృష్టకరం. వారిలో చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనలో గాయపడిన…

— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 1, 2025

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
పవన్ కళ్యాణ్
నేరాలు, మోసాలు
విశాఖపట్నం
Latest Videos
Recommended Stories
Recommended image1
2026 సెలవుల లిస్ట్ ఇదే... ఏ నెలలో ఎన్నిరోజులు హాలిడేస్ వస్తున్నాయో తెలుసా?
Recommended image2
విజయవాడకు మకాం మార్చిన మావోయిస్టులు.. ఒకేసారి 27 మంది అరెస్ట్
Recommended image3
అమ్మ‌కానికి MRO ఆఫీస్‌.. జ‌స్ట్ రూ. 20 వేల‌కే.. అస‌లు ట్విస్ట్ తెలిస్తే ఫ్యూజుల్ అవుట్
Related Stories
Recommended image1
శ్రీకాకుళంలో ఘోర ప్రమాదం.. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమిదేనా?
Recommended image2
Vijay : విజయ్ కరూరు సభలో తొక్కిసలాట ఎందుకు జరిగింది? కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved