MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Sai Krishna: దృశ్యం సినిమా మించిన ట్విస్టులు.. సాయికృష్ణ బ‌తుకున్నాడా.? లేదంటే శవం ఏది.?

Sai Krishna: దృశ్యం సినిమా మించిన ట్విస్టులు.. సాయికృష్ణ బ‌తుకున్నాడా.? లేదంటే శవం ఏది.?

Sai Krishna: విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దృశ్యం సినిమాను త‌ల‌పిస్తోంది. పోలీస్ కస్టడీలో హింసకు గురై మరణించాడనే ఆరోపణలు, అతడి ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో ఈ కేసు హాట్ టాపిక్‌గా మారింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 21 2026, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సాయికృష్ణ ఎవరు? అసలు ఏం జరిగింది?
Image Credit : Asianet News

సాయికృష్ణ ఎవరు? అసలు ఏం జరిగింది?

గాదె సాయికృష్ణ విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన యువకుడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, మే 9న పోలీసులు విచారణ నిమిత్తం అతడిని తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత నుంచి అతడు ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తల్లి గాదె విజయలక్ష్మి ఆరోపణల ప్రకారం, సాయికృష్ణను పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి తీవ్ర హింసకు గురి చేశారని, అనంతరం అతడు మరణించాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడి ఆచూకీ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సిట్ దర్యాప్తు ఎలా కొనసాగుతోంది?
Image Credit : Revathi/X

సిట్ దర్యాప్తు ఎలా కొనసాగుతోంది?

కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. శాంతిభద్రతల విభాగం ఐజీ ఎం. రవి ప్రకాశ్ సిట్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సభ్యులుగా ఉన్నారు. బాపట్ల అదనపు ఎస్పీ ఎల్. సుధాకర్‌ను దర్యాప్తు అధికారిగా నియమించారు.

దర్యాప్తులో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ కంప్యూటర్ల హార్డ్ డిస్కులను పరిశీలిస్తున్నారు. కాల్ డేటా రికార్డులను సేకరిస్తున్నారు. శ్మశానవాటికల్లో గుర్తుతెలియని మృతదేహాల రికార్డులను తనిఖీ చేస్తున్నారు. పలువురు పోలీసు అధికారుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.

సీఐ నాగరాజుపై కేసు.. అరెస్టుకు రంగం సిద్ధమా?

ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన సస్పెండ్ అయిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు. సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అక్రమ నిర్బంధం, హత్య, సాక్ష్యాల ధ్వంసం వంటి ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. దర్యాప్తు బృందాలు ఆయనను పలుమార్లు ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో లభించే ఆధారాల ఆధారంగా అరెస్టు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Related Articles

Related image1
కోటి రూపాయలతో ఇల్లు క‌ట్టే బ‌దులు, ఇలా చేయండి.. లైఫంతా కాలు మీద కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Related image2
భార‌త్‌లో ప‌గ‌టిపూట కూడా బైక్ లైట్లు ఎందుకు వెలుగుతున్నాయి.? ఈ నిబంధ‌న ఎందుకో తెలుసా.?
35
జగన్ డిమాండ్.. సీబీఐ విచారణ జరపాలన్న వైసీపీ
Image Credit : Asianet News

జగన్ డిమాండ్.. సీబీఐ విచారణ జరపాలన్న వైసీపీ

మరోవైపు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎలాంటి తప్పు జరగకపోతే సంబంధిత సీఐపై సస్పెన్షన్ ఎందుకు విధించారని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నిలవాలంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. సాయికృష్ణ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, న్యాయపోరాటంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

45
చంద్రబాబు స్పందన.. కుటుంబానికి భరోసా
Image Credit : Asianet News

చంద్రబాబు స్పందన.. కుటుంబానికి భరోసా

సాయికృష్ణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కలిసి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించామని, సీఐ నాగరాజుపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తప్పు చేసిన వారు ఎంతటి హోదాలో ఉన్నా వదిలిపెట్టబోమని, నిజాలు వెలుగులోకి వచ్చేలా పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

55
ప్రస్తుతం కేసు పరిస్థితి ఏంటి.?
Image Credit : Asianet News

ప్రస్తుతం కేసు పరిస్థితి ఏంటి.?

ప్రస్తుతం సాయికృష్ణ ఆచూకీపై స్పష్టత రాలేదు. హైకోర్టు కూడా కేసును పర్యవేక్షిస్తోంది. సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలని ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో పోలీసులు, సిట్ బృందం దర్యాప్తును మరింత వేగవంతం చేశాయి. ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ రికార్డులు, పోలీసు సిబ్బంది వాంగ్మూలాలు వంటి అన్ని అంశాలను పరిశీలిస్తూ నిజానిజాలు వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. ఈ కేసు తుది ఫలితం కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
నేరాలు, మోసాలు
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Annadata Sukhibhava-PM Kisan Funds | రైతులకు ఎగిరి గంతేసే వార్త స్పాట్ లో నే అకౌంట్ లోకి డబ్బులు
Recommended image2
Now Playing
Yogandhra 2026: సీఎం చంద్రబాబుని ఆకట్టుకున్న ధూమపానం హానికరం వినూత్న ప్రమోషన్| Asianet News Telugu
Recommended image3
Now Playing
Yogandhra 2026: యోగాడేలో చంద్రబాబు క్రేజ్ చూసి రామ్ దేవ్ బాబా షాక్ | Asianet News Telugu
Related Stories
Recommended image1
కోటి రూపాయలతో ఇల్లు క‌ట్టే బ‌దులు, ఇలా చేయండి.. లైఫంతా కాలు మీద కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Recommended image2
భార‌త్‌లో ప‌గ‌టిపూట కూడా బైక్ లైట్లు ఎందుకు వెలుగుతున్నాయి.? ఈ నిబంధ‌న ఎందుకో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved