MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Andhra Pradesh
  • ఆంధ్ర ప్రదేశ్ లో ఈ బ్యాంకులు శాశ్వతంగా క్లోజ్ ... ఇందులో మీకు అకౌంట్ ఉందా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ బ్యాంకులు శాశ్వతంగా క్లోజ్ ... ఇందులో మీకు అకౌంట్ ఉందా?

ఆంధ్ర ప్రదేశ్ లో మే 1 అంటే ఇవాళ్టి నుండి పలు గ్రామీణ బ్యాంకులు మూతపడనున్నాయి. ఇలా క్లోజ్ అయ్యే బ్యాంకులేవో తెలుసా?   

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 01 2025, 09:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Banks Closed

Banks Closed

Banks Closed : దేశంలోని పలు గ్రామీణ బ్యాంకులు నేటినుండి పనిచేయవు. కేంద్ర ప్రభుత్వం 'ఒకే రాష్ట్రం-ఒకే గ్రామీణ బ్యాంక్' విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో ఓ రాష్ట్రంలో వివిధ గ్రామీణ బ్యాంకులన్ని కలిసిపోయి ఒకే బ్యాంకుగా మారనున్నాయి.  ఇలా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 43 గ్రామీణ బ్యాంకులుండగా అవికాస్త 28 కి తగ్గాయి... అంటే 15 బ్యాంకులు కనుమరుగు కానున్నాయి.  

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా చాలా గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి... ఇవన్ని మే 1 అంటే నేటినుండి శాశ్వతంగా మూతపడనున్నాయి.  కేవలం ఒకేఒక్క గ్రామీణ బ్యాంకు పనిచేయనుంది. అయితే మూతపడే బ్యాంకుల ఖాతాదారులు భయపడాల్సిన పనిలేదు... మీ అకౌంట్స్ లో డబ్బులు సేఫ్ గానే ఉంటాయి. మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఈజీగా ట్రాన్స్ ఫర్ అవుతుంది... కొత్త ఖాతా నంబర్, పాస్ బుక్, చెక్ బుక్ తో పాటు అన్ని బ్యాంకింగ్ సౌకర్యాలు అందిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Banks Closed

Banks Closed

ఆంధ్ర ప్రదేశ్ లో మూతపడే బ్యాంకులివే :  

ఆంధ్ర ప్రదేశ్ లో చాలా గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. వాటన్నింటిని ఇప్పుడు ఒకేచోటికి చేరుస్తున్నారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లు ఇకపై కనిపించవు.  వీటిస్థానంలో కేవలం ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఒక్కటే పనిచేస్తుంది. అన్ని గ్రామీణ బ్యాంకుల్లోని ఖాతాలను ఈ బ్యాంకుకు బదిలీ చేయబడతాయి.  

Related Articles

Related image1
Weather : మే ఫస్ట్ వీక్ లో వానలే వానలు... తెలుగు రాష్ట్రాల్లోని ఏఏ జిల్లాలకు వర్షసూచన?
34
Banks Closed

Banks Closed

దేశవ్యాప్తంగా మూతపడే బ్యాంకులివే :  

ఆంధ్ర ప్రదేశ్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ , పశ్చిమబెంగాల్, బిహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో గ్రామీణ బ్యాంకులు మూతపడనున్నాయి. వీటిస్థానంలో రాష్ట్రంలో కేవలం ఒకే గ్రామీణ బ్యాంక్ పనిచేయనుంది. 

పశ్చిమ బెంగాల్ లో బంగియా గ్రామీణ వికాస్ బ్యాంక్, పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంక్, ఉత్తర బెంగాల్ బ్యాంకులు విలీనం కానున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లోబ బరోడా యూపీ బ్యాంక్, ఆర్యావర్త్ భ్యాంక్, ప్రథమ యూపీ గ్రామీణ బ్యాంకులు.... బిహార్ లో దక్షిణ బిహార్ గ్రామీణ బ్యాంక్, ఉత్తర బిహార్ గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్నారు. 

ఇక కర్ణాటక లో కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంకు (KGVB),కర్ణాటక గ్రామీణ బ్యాంక్ (KRB)విలీనం కానున్నాయి.  మహారాష్ట్రలో కూడా మహారాష్ట్ర గ్రామీణ బ్యాంక్,  విదర్భ కొంకన్ గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్నాయి. ఇవిరెండు కలిసి మహారాష్ట్ర గ్రామీణ బ్యాంకుగా మారనున్నాయి.  

44
Banks Closed

Banks Closed

బ్యాంకుల విలీనంతో కలిగే ప్రయోజనాలివే : 

గ్రామీణ బ్యాంకుల విలీనంతో ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. గ్రామీణ బ్యాంకుల్లో సాంకేతికతను పెంచేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. ఖాతాదారులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు వీలుంటుంది.  మిగతా బ్యాంకుల మాదిరిగానే ఈ గ్రామీణ బ్యాంకులు కూడా మరింత మెరుగ్గా పనిచేయనున్నాయి. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
భారత దేశం
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక ఉద్యోగాల కోసం హైద‌రాబాద్ వెళ్లాల్సిన ప‌నిలేదు.. ఏపీలోని ఈ జిల్లాలో భారీ స్టార్ట‌ప్ హ‌బ్
Recommended image2
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
Recommended image3
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Related Stories
Recommended image1
Weather : మే ఫస్ట్ వీక్ లో వానలే వానలు... తెలుగు రాష్ట్రాల్లోని ఏఏ జిల్లాలకు వర్షసూచన?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved