తెలుగు రైతుల అకౌంట్లో రూ.7,000 పడేదెప్పుడు? దీపావళికి ముందా, తర్వాతా?
PM Kisan and Annadatha Sukhibhava : 21 విడత పీఎం కిసాన్ పై కేంద్ర ప్రభుత్వ ప్రకటన కోసం తెలుగు రైతులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ నిధులు విడుదలైతేనే అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చేది.

పీఎం కిసాన్ ఎప్పుడు?
Annadatha Sukhibhava PM kisan : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుచేస్తున్నాయి... ఇలా రైతు సంక్షేమం కోసం వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) కింద ఏడాదికి మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున మొత్తం ఆరువేలు అందిస్తోంది... దీనికి ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మరో రూ.5 వేలు జోడించి ఎకరాకు రూ.7 వేలు రైతుల ఖాతాలో జమచేస్తోంది. ఇలా గత ఆగస్ట్ లో పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ డబ్బులు రైతులకు అందాయి. ఇప్పుడు మరో విడత ఎప్పుడా అని తెలుగు రైతులు ఎదురుచూస్తున్నారు.
పీఎం కిసాన్ దీపావళికి ముందా, తర్వాతా?
అయితే ఈ దీపావళి వేళ కేంద్రం పీఎం కిసాన్ 21వ విడత విడుదల చేసే అవకాశాలున్నట్లు సమాచారం... దీంతో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు వేస్తుందని రైతులు ఆశతో ఉన్నారు. ఈ రెండు కలిపి ఏపీ రైతుల బ్యాంక్ అకౌంట్లో రూ.7 వేలు పెట్టుబడి సాయం డబ్బులు పడనున్నాయి. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు దీపావళి కానుక అందివ్వనున్నాయి.
మొదట ఈ విడత పెట్టుబడి సాయం దీపావళికి ముందే రైతుల ఖాతాల్లో జమ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుండిగానీ, వ్యవసాయ శాఖ నుండిగానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి 21 విడత డబ్బులు దీపావళికి ముందు విడుదలయ్యే అవకాశాలు కనిపించడంలేదు… పండగ తర్వాతే అందవచ్చు. దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
పీఎం కిసాన్ కోసం ఇది తప్పనిసరి..
ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రయోజనం పొందడానికి రెండు విషయాలు తప్పనిసరి.
ఇ-కెవైసి పూర్తి చేయడం
భూమి ధృవీకరణ (Land Verification)
ఈ రెండు ప్రక్రియలను ఇంకా పూర్తి చేయని వారికి ఈ విడతలో డబ్బులు ఆగిపోవచ్చు లేదా ఆలస్యం కావచ్చు. కాబట్టి రైతులు ఈ ప్రక్రియలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి, అప్పుడే 21 విడత డబ్బులు సకాలంలో ఖాతాలో జమ అవుతాయి.
రైతులు ముందే జాగ్రత్తపడండి...
దీపావళి తర్వాత 21వ విడత పీఎం కిసాన్ తో పాటు ఏపీ రైతులకు అన్నదాత సుఖీభవ అందే అవకాశం బలంగా ఉంది. అయితే దీనికి అవసరమైన పత్రాలు, ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం రైతులకు చాలా ముఖ్యం. దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు క్రమం తప్పకుండా అందుతాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి పెట్టుబడి సాయం డబ్బులు విడుదలయ్యే ముందు సమస్యలేమైనా ఉంటే రైతులు పరిష్కరించుకోవడం మంచిది.