MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • 7 నెలల గర్భిణీ.. 145 కిలోల బరువు ఎత్తి మెడల్ గెలిచింది !

7 నెలల గర్భిణీ.. 145 కిలోల బరువు ఎత్తి మెడల్ గెలిచింది !

Police Constable Sonika Yadav : 7 నెలల గర్భిణీగా ఉన్న ఢిల్లీ కానిస్టేబుల్ సోనికా యాదవ్, 145 కిలోల బరువు ఎత్తి ఆల్ ఇండియా పోలీస్ వెయిట్‌లిఫ్టింగ్ క్లస్టర్‌లో కాంస్యం గెలిచింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 27 2025, 11:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వెయిట్‌లిఫ్టింగ్ లో అదరగొట్టిన గర్భిణీ
Image Credit : X/DelhiPolice

వెయిట్‌లిఫ్టింగ్ లో అదరగొట్టిన గర్భిణీ

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ వెయిట్‌లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26 పోటీలో ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ సోనికా యాదవ్ (31) అందరినీ ఆశ్చర్యపరిచింది. 65 కిలోల విభాగంలో పోటీ పడే ఆమె, ఈసారి 84 కిలోల విభాగంలో పాల్గొంది. స్టేజ్‌పైకి వచ్చిన వెంటనే ఆమె 145 కిలోల డెడ్‌లిఫ్ట్‌కు సిద్ధమై బార్‌బెల్ పట్టుకోగానే ప్రేక్షకులు నిశ్శబ్దం అయ్యారు. అప్పుడే అందరికీ తెలిసింది… ఆమె ఏడు నెలల గర్భిణి అని. ఆ తర్వాత ఆమె బరువు ఎత్తడం చూసి చప్పట్లతో హోరెత్తించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గర్భం అడ్డే కాదు.. సంకల్పం ఉంటే అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి
Image Credit : X/DelhiPolice

గర్భం అడ్డే కాదు.. సంకల్పం ఉంటే అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి

సోనికా యాదవ్ 2023 లో పవర్‌లిఫ్టింగ్ ప్రారంభించింది. 2024 మేలో ఆమె గర్భవతి అయ్యింది. భర్త అంకుర్ బనా ఆమె శిక్షణ ఆపుతుందేమో అనుకున్నాడు. కానీ సోనికాకు వెనక్కి తగ్గే ఆలోచనే లేదు.

“గర్భం ఒక అడ్డంకి కాదు. స్త్రీలు చేయలేరన్న భావన తప్పు. నేను కూడా అలాగే ప్రాక్టీస్‌ కొనసాగించాను” అని ఆమె చెప్పారు.

35
పోటీలో మూడు విభాగాల్లో గెలుపు లక్ష్యంగా బరిలోకి దిగిన సోనికా
Image Credit : X/DelhiPolice

పోటీలో మూడు విభాగాల్లో గెలుపు లక్ష్యంగా బరిలోకి దిగిన సోనికా

పవర్‌లిఫ్టింగ్‌లో ఆమె ప్రదర్శన గమనిస్తే..

• స్క్వాట్స్: 125 కిలోలు

• బెంచ్ ప్రెస్: 80 కిలోలు

• డెడ్‌లిఫ్ట్: 145 కిలోలు

మొదట 135 కిలోల డెడ్‌లిఫ్ట్ చేయాలని నిర్ణయించినా, మెడల్ సాధించాలంటే ఎక్కువ బరువు ఎత్తాల్సి ఉంటుందని భావించి 145 కిలోలకు ప్రయత్నించింది. ఫలితంగా ఆమె కాంస్య పతకం గెలిచింది.

45
సోనికా యాదవ్ : ప్రపంచంలోనూ అరుదైన విజయమే
Image Credit : X/DelhiPolice

సోనికా యాదవ్ : ప్రపంచంలోనూ అరుదైన విజయమే

పోటీకి ముందుగానే ఇంటర్నెట్‌లో శోధించిన సోనికా, ఇలాంటి కృషి గర్భధారణ సమయంలో చేసిన మహిళలు చాలా తక్కువగా ఉన్నారని గుర్తించింది. పవర్‌లిఫ్టింగ్‌లో లూసీ మార్టిన్స్ అనే మహిళ ఇదే సమయంలో విజయం సాధించిందని తెలుసుకుని, ఆమెను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి సూచనలు తీసుకుంది.

“కడుపును లోపలికి సెట్ చేసుకుని లిఫ్టింగ్ చేయాలి అని ఆమె చెప్పింది. నేను అదే పాటించాను” అని సోనికా చెప్పింది.

55
పోలీస్ సేవలో టాప్ లో సోనికా యాదవ్
Image Credit : X/DelhiPolice

పోలీస్ సేవలో టాప్ లో సోనికా యాదవ్

2014 బ్యాచ్‌లో ఎంపికైన సోనికా యాదవ్, ప్రస్తుతం కమ్యూనిటీ పోలీసింగ్ సెల్‌లో పనిచేస్తోంది. తన అద్భుతమైన పనితీరు, సేవలతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. మజ్నూకా తిల్లా ప్రాంతంలో మాదక ద్రవ్యాల నియంత్రణలో కృషి చేశారు. 2022లో ఢిల్లీ పోలీస్ చీఫ్ ప్రశంసలు అందుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా స్మృతి ఇరానీ చేతుల మీదుగా సత్కారం కూడా అందుకున్నారు. ఆమె భర్త ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ట్రైనింగ్ సమయంలో ఆమె తరచూ గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తూ భద్రతా అంశాలను పరిశీలించింది.

సోనికా యాదవ్ : కబడ్డీ నుండి వెయిట్‌లిఫ్టింగ్ వరకు

సోనికా యాదవ్ ముందుగా కబడ్డీ ఆడేది. శరీర దృఢత్వం కోసం జిమ్‌కి వెళ్లడం మొదలుపెట్టింది. అక్కడే వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెరిగింది. 2023 ఆగస్టులో, ఢిల్లీ స్టేట్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి బంగారు పతకం అందుకుంది. అప్పటి నుంచి ఆమె ప్రయాణం కొనసాగుతోంది. సోనికా యాదవ్ కథ, స్త్రీ ధైర్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
పోలీసు భద్రత
అమరావతి
భారత దేశం
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Related Stories
Recommended image1
ఆధార్ అప్‌డేట్: డాక్యుమెంటేషన్ లేకుండానే పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ల మార్పు
Recommended image2
మొంథా తుపాను: పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు, 25 కేజీల బియ్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved