MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • IMD Weather Update : ఈ ప్రాంతాల్లో 200-300 మి.మీ వర్షపాతమా..! ప్రమాద హెచ్చరికలు జారీచేసే స్థాయిలో వానలే..!

IMD Weather Update : ఈ ప్రాంతాల్లో 200-300 మి.మీ వర్షపాతమా..! ప్రమాద హెచ్చరికలు జారీచేసే స్థాయిలో వానలే..!

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండం మారింది, ఇది అల్పపీడనంగా మారనుందట. అయినా తెలుగు రాష్ట్రాల్లో మరో రెండుమూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

4 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 26 2026, 08:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
Image Credit : Gemini AI

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కొద్దిరోజులుగా వణికించిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందట.

అయితే ప్రస్తుతం కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు అంటే ఈ మూడ్రోజులు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఉపరితల గాలులు కొనసాగే అవకాశం ఉందని IMD హెచ్చరికలు సూచిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందట. సెప్టెంబర్ 30 తర్వాత ఈ ప్రభావం మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉత్తరాంధ్రలో రికార్డు వర్షపాతం
Image Credit : Gemini AI

ఉత్తరాంధ్రలో రికార్డు వర్షపాతం

సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు అంటే ఈ మూడ్రోజులు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఉపరితల గాలులు కొనసాగే అవకాశం ఉందని IMD తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందట. సెప్టెంబర్ 30 తర్వాత ఈ ప్రభావం మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

సెప్టెంబర్ 23, 24 (గత బుధ, గురువారం) రెండ్రోజుల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ రెండు రోజుల్లో దాదాపు 80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు విపత్తు నిర్వహణ (APSDMA) అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా విశాఖపట్నం పరిధిలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి.

విశాఖ రూరల్ తులసీనగర్‌లో 236 మిల్లీమీటర్లు, మధురవాడలో 218 మిల్లీమీటర్లు, ఎండాడలో 210 మిల్లీమీటర్లు, సీతమ్మధారలో 205 మిల్లీమీటర్లు, కాపులుప్పాడలో 202 మిల్లీమీటర్లు, మహరాణిపేటలో 199 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా కొత్తవలసలో 188 మిల్లీమీటర్లు, విశాఖలోని పెందుర్తిలో 179 మిల్లీమీటర్లు, బుచ్చిరాజుపాలెంలో 171 మిల్లీమీటర్లు, పెదగంట్యాడలో 165 మిల్లీమీటర్లు, కొత్తపాలెంలో 163 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేటలో 158 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఉత్తరాంధ్రలోని అనేక వాగులు, వంకలు, నదుల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది.

35
ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు.. ప్రమాద హెచ్చరికలు జారీ
Image Credit : x/apsdma

ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు.. ప్రమాద హెచ్చరికలు జారీ

వంశధార, నాగావళి నదుల్లో పెరిగిన వరద ఉధృతి

భారీ వర్షాల ప్రభావంతో వంశధార, నాగావళి నదులకు వరద నీరు పోటెత్తింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నారాయణపురం ఆనకట్ట వద్ద వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 76 వేల క్యూసెక్కులకు చేరిన నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరిస్థితిని బట్టి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి కూడా చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నాగావళి నదిలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. తోటపల్లి వద్ద ఇన్‌ఫ్లో 24,639 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 23,250 క్యూసెక్కులుగా నమోదైంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాబోయే రోజుల్లో వరద ప్రవాహం క్రమంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలపై పరిస్థితి ఆధారపడి ఉంటుంది.

గోదావరి, కృష్ణా నదులకూ వరద

భారీ వర్షాల ప్రభావం ఉత్తరాంధ్రకే పరిమితం కాలేదు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో వాటి ప్రభావం నదీ ప్రవాహాలపై పడుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నదికి భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సుమారు 4.11 లక్షల క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. వరద కొనసాగితే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి గోదావరి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

పోలవరం వద్ద కూడా గోదావరి నదిలో వరదనీరు ప్రమాదకర స్థాయికి చేరింది. పోలవరం ప్రాజెక్ట్ 48 గేట్ల నుంచి 5,36,938 క్యూసెక్కుల వరద ప్రవాహం దిగువకు వదులుతున్నారు. స్పిల్ వే వద్ద 30.720 మీటర్లకు నీటిమట్టం చేరింది. ఎగువన భారీ వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజి వద్ద కూడా నీటి విడుదల కొనసాగుతోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

45
తెలంగాణలో వర్షాలు
Image Credit : Gemini AI

తెలంగాణలో వర్షాలు

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి... ఇవాళ (సెప్టెంబర్ 26, శనివారం) కూడా వర్షాలు కొనసాగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా కొమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందంటోంది.

ఇక రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే సెప్టెంబర్ 27 నుంచి రాష్ట్రంలో పెద్దగా వాతావరణ హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ సూచిస్తోంది.

అక్టోబర్‌లో దక్షిణ తెలంగాణకు మళ్లీ వర్షాలు..

అక్టోబర్ మొదటి వారంలో వాతావరణంలో మరోసారి మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. తూర్పు గాలుల ప్రభావం పెరిగితే అక్టోబర్ 3 నుంచి 10 మధ్య దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇవి విస్తృతంగా కురిసే వర్షాలు కాకుండా అక్కడక్కడా నమోదయ్యే వర్షాలుగా ఉండే అవకాశం ఉంది.

మరోవైపు ఉత్తర తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రధాన వర్షకాల ప్రభావం సెప్టెంబర్ చివరి నాటికి తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడక్కడా వర్షాలు కురిసినా, చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు.

55
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Image Credit : Gemini AI

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా నదులు, వాగులు, ఆనకట్టల పరిసరాల్లో నివాసముండే ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. భారీ వర్షాల తర్వాత నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతున్నందున వాగులు, నదులు దాటే ప్రయత్నం చేయకపోవడం మంచిది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో అధికారుల సూచనలు పాటించాలి.

తెలంగాణలో మాత్రం భారీ వర్షాల ప్రభావం క్రమంగా తగ్గుతున్నప్పటికీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మొత్తంగా చూస్తే.. ఏపీలో మరో రెండు మూడు రోజులు వర్షాల ప్రభావం కనిపించనుండగా, తెలంగాణలో మాత్రం సెప్టెంబర్ చివరి నుంచి వర్షాలు తగ్గి వేడి, ఉక్కపోత పెరిగే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. తిరిగి అక్టోబర్ లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. మరో 2 రోజులు దంచికొట్టనున్న భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Recommended image2
Now Playing
అమరావతిని ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేస్తా..!| Chandrababu Powerful Speech | Asianet News Telugu
Recommended image3
Now Playing
ఒకటే ఈలలు అరుపులు | Chandrababu Crazy Fans | Asianet Telugu
Related Stories
Recommended image1
Weather Update: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. మరో 2 రోజులు దంచికొట్టనున్న భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Recommended image2
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved