MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Andhra Pradesh
  • Business Ideas : తెలుగు మహిళలకు ఫ్రీగా రూ.50,000 .. పెట్టుబడి, సరుకులు ఉచితమే..!

Business Ideas : తెలుగు మహిళలకు ఫ్రీగా రూ.50,000 .. పెట్టుబడి, సరుకులు ఉచితమే..!

Egg Mart Scheme for Womens : ఏ వ్యాపారం చేయాలన్నా పెట్టుబడికి డబ్బులు అవసరం. కానీ పైసా పెట్టుబడిలేకుండా మంచి లాభధాయకమైన వ్యాపారం చేసే అవకాశం తెలుగు మహిళలకు వచ్చింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 11 2026, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు మహిళల కోసం ఎగ్ మార్ట్ స్కీమ్..?  అంటే ఏమిటి..?
Image Credit : Gemini AI

తెలుగు మహిళల కోసం ఎగ్ మార్ట్ స్కీమ్..? అంటే ఏమిటి..?

Women Empowerment Scheme : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం అనేక పథకాలు అమలుచేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో మహిళల ఖర్చులు తగ్గించి డబ్బులు ఆదా చేస్తోంది... మరోవైపు సొంతంగా ఆదాయాన్ని పొంది ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకరిస్తోంది. ఇలా గ్రామీణ ప్రాంతాల మహిళలకు వ్యవసాయం, పాడి రంగాల్లో ఆదాయంపొందేలా వడ్డీలేని రుణాలు, డ్రోన్ స్ప్రేయర్లు వంటివి అందిస్తోంది. ఇదే తరహాలో పట్టణప్రాంత మహిళల కోసం మరో సరికొత్త పథకాన్ని అమలుచేసేందుకు సిద్దమయ్యింది కూటమి ప్రభుత్వం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మహిళలకు ఉచితంగా రూ.50000...
Image Credit : Gemini AI

మహిళలకు ఉచితంగా రూ.50000...

గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోని పేదలే ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. గ్రామాల్లో జీవనవ్యయం చాలా తక్కువ.. కానీ పట్టణాల్లో ఇంటి అద్దె నుండి కుటుంబ పోషణ వరకు ప్రతిదీ ఖర్చే. సరైన ఆదాయం లేక ఎన్నో కుటుంబాలు ఆకలితో అలమిటుస్తున్నాయి... పేదరికంలో మగ్గిపోతున్నాయి. ఇలాంటి పట్టణ ప్రాంతాల్లోని పేదింటి మహిళలకు అండగా నిలిచేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా రూ.50,000 సాయం చేస్తోంది. 

36
పేద మహిళలకు బిజినెస్...
Image Credit : Getty

పేద మహిళలకు బిజినెస్...

పట్టణాలు, నగరాల్లో నివాసముండే పేదింటి మహిళలకు ప్రభుత్వమే వ్యాపారం పెట్టివ్వనుంది. ఇందుకోసం ఇప్పటికే నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. జిల్లాకు 10 చొప్పున మొత్తం 260 ఎగ్ మార్ట్ లను ఏర్పాటు చేయనున్నారు... ఇందుకయ్యే ఖర్చు రూ.50,000 ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ఎగ్ మార్ట్ లను దక్కించుకున్న మహిళలు రూపాయి తిరిగి కట్టాల్సిన అవసరం లేదు.

అయితే ప్రభుత్వ నేరుగా డబ్బులివ్వడం కాకుండా వ్యాపారాన్ని ఏర్పాటుచేసి ఇస్తుంది. పట్టణాలు, నగరాల్లో ఎంపికచేసిన రద్దీ ప్రాంతాల్లో ఈ ఎగ్ మార్టులను పెట్టనున్నారు. రూ.35 వేలతో చిన్న స్టోర్ ఏర్పాటుచేసివ్వడంతో పాటు రూ.15 వేల విలువైన గుడ్లు అందించనున్నారు. ఇలా రూ.50 వేల ఖర్చుతో వ్యాపార అవకాశం కల్పిస్తూ మహిళలు మంచి ఆదాయాన్ని పొందుతూ ఆత్మగౌరవంతో జీవించేలా సరికొత్త పథకం అమలుచేస్తోంది ప్రభుత్వం.

46
ఎవరు అర్హులు..?
Image Credit : Getty

ఎవరు అర్హులు..?

ఎగ్ మార్ట్ ల నిర్వహణ బాధ్యత ఎవరికి అప్పగించాలన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయం సంఘాల్లో అత్యంత పేదరికంతో బాధపడేవారు, ఒంటరిగా ఉండే మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. అర్హుల ఎంపిక బాధ్యత మెప్మా (Mission for Elimination of Poverty in Municipal Areas) కు అప్పగించింది చంద్రబాబు సర్కార్.

56
ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
Image Credit : Getty

ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

ఎగ్ మార్ట్ వ్యాపారంపై ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెప్మా కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మహిళల నుండి వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులను అధికారులే నిర్ణయిస్తారు. ఇలా ఎగ్ మార్ట్ లను పొందిన మహిళలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో గుడ్లకు మంచి గిరాకీ ఉంది... కాబట్టి ఎగ్ మార్ట్ ల నిర్వహణ ద్వారా మహిళలు మంచి ఆదాయం పొందవచ్చు.

66
పెట్టుబడి లేకుండానే వ్యాపారి అయిపోవచ్చు..
Image Credit : Gemini AI

పెట్టుబడి లేకుండానే వ్యాపారి అయిపోవచ్చు..

రాష్ట్ర ప్రభుత్వం, NECC సాయంతో పైసా ఖర్చులేకుండా ఎగ్ మార్ట్ బిజినెస్ ప్రారంభించవచ్చు. అంతేకాదు ఇందులో వివిధ రకాల అహార పదార్థాలు కూడా అమ్ముకోవచ్చు. ఇలా మహిళలు మంచి ఉపాధిని పొందవచ్చు... ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. కాబట్టి పట్టణ ప్రాంతాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
మహిళలు
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar
Recommended image2
ఆ ఇంజ‌క్ష‌న్ల వాడ‌కంపై ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్‌.. 100 మెడికల్ షాపుల్లో తనిఖీలు
Recommended image3
ప్రైవేట్ కోచింగ్ సెంట‌ర్ల‌పై ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి.. సీఎం కీల‌క ఆదేశాలు
Related Stories
Recommended image1
Business Ideas: రూ. ల‌క్ష‌ పెట్టుబ‌డితో రోజుకు రూ. 2 వేల ఆదాయం.. 6 నెల‌ల్లో ల‌క్షాధికారుల‌వ్వ‌డం ఖాయం
Recommended image2
Egg Business: కోడి గుడ్ల‌తో కోట్లు కురుస్తాయి.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved