MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • IRCTC Tirupati Tour: ఒక్క క్లిక్‌తో తిరుమల శ్రీవారి దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ మిస్ కావద్దు !

IRCTC Tirupati Tour: ఒక్క క్లిక్‌తో తిరుమల శ్రీవారి దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ మిస్ కావద్దు !

IRCTC Tirupati Tour Package: ఐఆర్‌సీటీసీ తిరుమల వీకెండ్ ప్యాకేజీ ప్రకటించింది. తక్కువ బడ్జెట్ నుంచే ప్రత్యేక దర్శనం, వసతి, రవాణా సౌకర్యాలతో కూడిన ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 17 2026, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరలో శ్రీవారి ప్రత్యేక దర్శనం
Image Credit : Gemini

ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరలో శ్రీవారి ప్రత్యేక దర్శనం

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) ఒక క్రేజీ వీకెండ్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కొండపైన వెలసిన ఆ ఏడుకొండల స్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారిని జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకుంటారు.

భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ఒడిశా రాజధాని భువనేశ్వర్, విశాఖపట్నం మీదుగా తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ గురించిన పూర్తి వివరాలు, టికెట్ ధరలు, ప్రయాణ షెడ్యూల్ వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వీకెండ్ తిరుమల యాత్ర: ప్యాకేజీ వివరాలివే
Image Credit : our own

వీకెండ్ తిరుమల యాత్ర: ప్యాకేజీ వివరాలివే

ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ స్పెషల్ ప్యాకేజీ పేరు వీకెంట్ ట్రిప్ టూ తిరుమల దర్శన్. దీని ప్యాకేజీ కోడ్ వచ్చేసి SCBR05. ఈ టూర్ మొత్తం 3 రాత్రులు, 4 రోజుల పాటు సాగుతుంది. ప్రతి శనివారం ఈ టూర్ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ఆంధ్రలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడి ప్రయాణికులు పలు స్టాప్ లలో రైలు ఎక్కవచ్చు.

ఈ ప్యాకేజీలో మీకు రైలు ప్రయాణం, హోటల్ వసతితో పాటు తిరుమల శీఘ్రదర్శన టికెట్ కూడా లభిస్తుంది. అయితే, ఈ ప్యాకేజీ ఆపరేట్ కావాలంటే కనీసం ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇద్దరి కంటే తక్కువ బుకింగ్స్ ఉంటే టూర్ క్యాన్సిల్ అవుతుంది.

36
ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ షెడ్యూల్ సాగుతుందిలా..
Image Credit : Asianet News

ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ షెడ్యూల్ సాగుతుందిలా..

• డే 01 (శనివారం): భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:00 గంటలకు రైలు నంబర్ 22879 లో ప్రయాణం మొదలవుతుంది. మొదటి రోజు మొత్తం రైలు ప్రయాణమే ఉంటుంది.

• డే 02 (ఆదివారం): ఉదయం 08:45 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ నుంచి హోటల్ సిందూరి పార్క్ లేదా దానికి సమానమైన హోటల్ కు పికప్ చేసుకుంటారు. కాసేపు ఫ్రెష్ అప్ అయిన తర్వాత, కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ సందర్శన ఉంటుంది. రాత్రి తిరుపతిలోనే డిన్నర్ చేసి స్టే చేస్తారు.

• డే 03 (సోమవారం): ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసిన తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి, ఉదయం 07:00 గంటలకు తిరుమల కొండకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. ఆ రోజు ఉండే రద్దీని బట్టి దర్శన సమయం మారవచ్చు. దర్శనం ముగిశాక కిందకు వచ్చి, హోటల్‌లో లంచ్ చేస్తారు. ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీకాళహస్తి దేవాలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 7:00 గంటలకు ప్యాక్డ్ డిన్నర్‌తో తిరుపతి రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. రాత్రి 7:50 గంటలకు రైలు నంబర్ 22856 లో తిరుపతి నుంచి ప్రయాణం మొదలవుతుంది.

• డే 04 (మంగళవారం): మధ్యాహ్నం 3:37 గంటలకు తిరిగి భువనేశ్వర్ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో మీ టూర్ సక్సెస్‌ఫుల్‌గా ముగుస్తుంది.

46
ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ టికెట్ ధరల వివరాలు ఇవే
Image Credit : instagram

ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ టికెట్ ధరల వివరాలు ఇవే

ఈ ప్యాకేజీ కింద కంఫర్ట్ (3A), స్టాండర్డ్ (SL) క్లాసులలో ప్రయాణించే భక్తుల కోసం ప్రత్యేక ధరలు అందుబాటులో ఉన్నాయి. కంఫర్ట్ (3A) క్లాస్‌లో ప్రయాణించాలనుకునే వారు సింగిల్ షేరింగ్‌కు రూ. 17,415, డబుల్ షేరింగ్‌కు రూ. 11,265, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 9,405 చెల్లించాల్సి ఉంటుంది. అదే క్లాస్‌లో పిల్లల కోసం బెడ్‌తో కూడిన టికెట్ ధర రూ. 7,830 కాగా, బెడ్ లేని టికెట్ ధర రూ. 7,345 గా నిర్ణయించారు.

మరోవైపు స్టాండర్డ్ (SL) క్లాస్ ప్రయాణికులకు సింగిల్ షేరింగ్‌కు రూ. 14,900, డబుల్ షేరింగ్‌కు రూ. 8,750, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 6,895 ఛార్జీలు ఉంటాయి. ఈ క్లాస్‌లో బెడ్‌తో వచ్చే పిల్లల టికెట్ ధర రూ. 5,315 కాగా, బెడ్ అవసరం లేని పిల్లలకు రూ. 4,830 గా ఉంది. రైల్వే ఛార్జీల మార్పులకు లోబడి ఈ ధరలలో మార్పులు ఉండవచ్చు.

56
ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీలో ఏమేమి లభిస్తాయి? ఏం లభించవు?
Image Credit : Gemini

ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీలో ఏమేమి లభిస్తాయి? ఏం లభించవు?

ప్యాకేజీలో ఉండేవి..

• రైలు ప్రయాణం (3A లేదా SL క్లాస్).

• తిరుపతిలో ఏసీ హోటల్ వసతి (సింధూరి పార్క్ లేదా దానికి సమానమైన హోటల్).

• తిరుపతిలో ఏసీ వాహనం ద్వారా సైట్ సీయింగ్.

• తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూరు దర్శన టికెట్లు.

• భోజన సదుపాయం: 1 బ్రేక్‌ఫాస్ట్, 1 లంచ్, 2 డిన్నర్లు

• గైడ్ సర్వీస్, ట్రావెల్ ఇన్సూరెన్స్.

• టోల్, పార్కింగ్ ఛార్జీలు, జీఎస్టీ.

ప్యాకేజీలో లేనివి

• లాండ్రీ, టిప్స్, మినరల్ వాటర్, టెలిఫోన్ బిల్లులు వంటి వ్యక్తిగత ఖర్చులు.

• కెమెరా ఫీజులు, ఎంట్రీ ఫీజులు.

• తలనీలాలు సమర్పించే ప్రత్యేక ఏర్పాట్లు.

66
ప్రయాణికులు పాటించాల్సిన నియమాలు, క్యాన్సిలేషన్ పాలసీ
Image Credit : Gemini AI

ప్రయాణికులు పాటించాల్సిన నియమాలు, క్యాన్సిలేషన్ పాలసీ

శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులను ధరించాలి.

• పురుషులు: తెల్లటి ధోతి-కుర్తా లేదా పైజామా ధరించాలి.

• మహిళలు: చీర లేదా పంజాబీ డ్రెస్ ధరించాలి.

• టీ షర్టులు, జీన్స్ వంటి దుస్తులు ఏ వయస్సు వారికైనా కచ్చితంగా నిషేధించారు.

• దర్శనం సమయంలో ఒరిజినల్ ఐడీ కార్డులను చూపించాలి.

• పేరు, వయస్సు, లింగం వంటి వివరాలను జర్నీకి 5 రోజుల ముందు ఒకసారి మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. రైలు టిక్కెట్లు జనరేట్ అయిన తర్వాత ఎలాంటి మార్పులు కుదరవు.

క్యాన్సిలేషన్ ఛార్జీల వివరాలు

• ప్రయాణ తేదీకి 15 రోజుల కంటే ముందు క్యాన్సిల్ చేసుకుంటే: రూ. 250/- (ఒక్కో ప్రయాణికుడికి) కట్ అవుతుంది. 8 నుంచి 14 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే ప్యాకేజీ ధరలో 25% కట్ అవుతుంది. 4 నుంచి 7 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే ప్యాకేజీ ధరలో 50% కట్ అవుతుంది. 4 రోజుల కంటే తక్కువ సమయంలో క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి రీఫండ్ లభించదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Recommended image2
Now Playing
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Recommended image3
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?
Related Stories
Recommended image1
USA: అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఉండే టాప్ 5 నగరాలు ఇవే.. ఈ ప్రాంతాలే ఎందుకు? వాటి ప్రత్యేకత ఏంటి?
Recommended image2
South Kashmir of Andhra: దక్షిణ కాశ్మీరం.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.. పాపికొండలు ఎందుకు అంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved