MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh లో వారందరికి అదిరిపోయే శుభవార్త.. ఉచితంగా విద్యుత్..!

Andhra Pradesh లో వారందరికి అదిరిపోయే శుభవార్త.. ఉచితంగా విద్యుత్..!

ఆగస్టు 7 నుంచి చేనేతలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అందించనున్నట్టు మంత్రి సవిత ప్రకటించారు.

1 Min read
Author : Bhavana Thota
Published : Jul 14 2025, 09:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చేనేత వృత్తి
Image Credit : Getty

చేనేత వృత్తి

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత వృత్తిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రంగానికి ఉచిత విద్యుత్‌ అందజేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొమ్మరసాని సవిత వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉచిత విద్యుత్‌
Image Credit : social media

ఉచిత విద్యుత్‌

ఆగస్టు 7వ తేదీ నుంచి రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఇదే విధంగా పవర్‌ లూమ్ యంత్రాలను నడిపే వారికైతే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ లభించనుంది. ఈ అవకాశంతో చేనేత రంగానికి గణనీయమైన ఉపశమనం లభించనుంది.

35
నేతన్నల ఆరోగ్యం
Image Credit : iSTOCK

నేతన్నల ఆరోగ్యం

అంతేకాకుండా, చేనేత కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేకమైన ఆరోగ్య భీమా పథకాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ పథకం ద్వారా వారికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌ను బలోపేతం చేయడంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (ఆప్కో) కేంద్రాలను మరింతగా విస్తరించనున్నారు.

45
అవార్డులు
Image Credit : social media

అవార్డులు

ఇటీవల చేనేత రంగానికి వివిధ విభాగాల నుంచి వచ్చిన అవార్డుల విషయాన్ని కూడా మంత్రి వెల్లడించారు. ఏడే ఏళ్ల కాలంలో చేనేత రంగానికి ఏడూ జాతీయ స్థాయి అవార్డులు లభించాయని గర్వంగా తెలిపారు. ఇది ఈ రంగానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పారు.

55
ఉచిత విద్యుత్‌
Image Credit : freepik

ఉచిత విద్యుత్‌

చేనేత కార్మికులు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్‌, ఆరోగ్య పథకం, మార్కెటింగ్ మద్దతు వంటి అవకాశాలు వారికి మేలు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
తెలుగుదేశం పార్టీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కుప్పంలో రైతు బజార్ ప్రారంభించిన CM Chandrababu | Asianet News Telugu
Recommended image2
Pawan Kalyan : వైసిపి బిగ్ షాకిచ్చి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ వరుపుల సుబ్బారావు?
Recommended image3
Now Playing
పవన్ రాకతో ఉప్పొంగిన పిఠాపురం | Deputy CM Pawan Kalyan Craze In Pithapuram | Asianet News Telugu
Related Stories
Recommended image1
Andhra Pradesh: ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే బంపరాఫర్.. భారీగా తగ్గిన బస్ ఛార్జీలు ..
Recommended image2
Andhra Pradesh విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌..ఒక్కొక్కరికి 15 లక్షల నుంచి 25 లక్షలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved