MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Cyclone Murasu: మురసు అంటే ఏమిటి? ఈ తుపాను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను వదులుతుంది

Cyclone Murasu: మురసు అంటే ఏమిటి? ఈ తుపాను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను వదులుతుంది

Cyclone Murasu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుస తుపానులు అతలాకుతలం చేస్తున్నాయి. సైక్లోన్ అర్నబ్ ఇలా వదలగానే సైక్లోన్ మురసు వచ్చేసింది. ఈ తుపాను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ను విడిచిపెడుతుంది? ఎప్పుడు తీరం దాటుతుంది?

2 Min read
Author : Haritha Chappa
Published : Nov 02 2026, 05:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సైక్లోన్ మురసు.. ఈ పదానికి అర్థం ఏమిటి?
Image Credit : Gemini AI

సైక్లోన్ మురసు.. ఈ పదానికి అర్థం ఏమిటి?

ఏపీలో వచ్చిన తుపానుకు మురసు అని పేరు పెట్టారు. దీనికి అర్థం ఏమిటి అనే ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. మురసు అం్టే ఒక పురాతన సంప్రదాయ డ్రమ్ లేదా వాయిద్యం పేరు. ప్రాచీన తమిళ సంస్కృతిలో, ముఖ్యంగా సంగం యుగం నాటి కాలంలో, సమాచార మార్పిడికి ఈ వాయిద్యం అత్యంత కీలకమైన సాధనంగా ఉండేది. యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయాలన్నా, రాజు ఇచ్చే ఆజ్ఞలను ప్రజలకు చాటాలన్నా లేదా ఉత్సవాలు, వేడుకలను ప్రకటించాలన్నా ఈ భారీ డప్పును మోగించి అందరినీ అప్రమత్తం చేసేవారు. ద్రావిడ సంస్కృతి, చరిత్రలో ప్రజలను అప్రమత్తం చేసే సాధనంగా మురసు శబ్దానికి విశిష్ట స్థానం ఉంది. తుఫాను వంటి ప్రకృతి విపత్తు కూడా ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి కాబట్టి ఈ పేరు పెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఏ దేశం పెట్టింది పేరు?
Image Credit : Pixabay

ఏ దేశం పెట్టింది పేరు?

హిందూ మహాసముద్ర పరిధిలో ఏర్పడే తుఫానులకు పేర్లు పెట్టేందుకు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (ESCAP) ఆధ్వర్యంలో ఒక పద్ధతి ఉంది. బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీర ప్రాంతాలకు చెందిన భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఎఇ, యెమెన్ అనే 13 దేశాలు కలిసి 169 పేర్లతో కూడిన అధికారిక జాబితాను రూపొందించాయి. జాబితా ప్రకారం మాల్దీవులు ఈ తుఫానుకు ‘మురసు’ అనే పేరును ఖరారు చేసింది. సముద్ర ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే విపత్తుల సమయంలో గందరగోళం లేకుండా హెచ్చరికలు జారీ చేయడానికి ఈ నామకరణ విధానం ఉపయోగపడుతుంది.

33
తుపాను ఎప్పుడు వదులుతుంది?
Image Credit : Pixabay

తుపాను ఎప్పుడు వదులుతుంది?

ఇక తుపాను గమనం విషయానికి వస్తే, వాతావరణ పరిస్థితులు, ప్రస్తుత దిశ ఆధారంగా ఇది ప్రధానంగా పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ బలపడుతోంది. సాధారణంగా ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానులు ఎక్కువగా భారత తూర్పు తీరమైన ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు లేదా ఒడిశా వైపు దూసుకువస్తాయి. అయితే సముద్రంలో గాలి దిశ, తేమ, ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులను బట్టి తుపాను కదలిక మారుతుంటుంది.ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం నవంబర్ 2 అర్థరాత్రి దాటాక తెల్లవారుజామున నెల్లూరు - నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. లేదా ఒంగోలు పరిసరాల్లో కూడా తీరం దాటవచ్చు. తీరం దాటుతున్నప్పుడు గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తాయి. అందుకే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆంధ్ర ప్రదేశ్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Recommended image2
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
Recommended image3
Weather Update: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న మురసు తుపాను.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Related Stories
Recommended image1
కంప్యూటర్ కీబోర్డుపై A B C Dలు వరుసగా ఎందుకు ఉండవు? అసలు కారణం ఇదే
Recommended image2
ఆసియాలోనే అతిపెద్ద మసాలా మార్కెట్ మనదేశంలోనే ఉంది.. ఇక్కడ నుంచే అన్ని రాష్ట్రాలకు మసాలా దినుసులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved