MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • మొంథా తుపానుతో అతలాకుతలమే .. సాయం కోసం ఏ జిల్లా ప్రజలు ఎవరికి ఫోన్ చేయాలి? ఈ నెంబర్లు సేవ్ చేసి పెట్టుకొండి

మొంథా తుపానుతో అతలాకుతలమే .. సాయం కోసం ఏ జిల్లా ప్రజలు ఎవరికి ఫోన్ చేయాలి? ఈ నెంబర్లు సేవ్ చేసి పెట్టుకొండి

Montha Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ప్రభావంతో ఏపీలో కుండపోత వర్షాలు తప్పవని ఐఎండి హెచ్చరిస్తోంది. దీంతో  ప్రజలకు అత్యవసర సాయం కోసం ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లు ప్రకటించింది.. వీటిని సేవ్ చేసి పెట్టుకొండి. 

3 Min read
Arun Kumar P
Published : Oct 27 2025, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మొంథా తుపానుతో ముంతపోత వానలు
Image Credit : X/APSDMA

మొంథా తుపానుతో ముంతపోత వానలు

Cyclone Montha : వర్షాకాలం ముగిసింది... కానీ తెలుగురాష్ట్రాలను మాత్రం వానలు వదల బొమ్మాళి అంటూ వెంటపడుతున్నాయి. ఆగస్ట్, సెప్టెంబర్ లో కేవలం బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడితేనే ఎలాంటి వర్షాలు కురిశాయో చూశాం... మరి ఇప్పుడు ఏకంగా తుపాను ఏర్పడింది... ఇంకే స్థాయితో వర్షాలుంటాయో ఊహించవచ్చు. భారత వాతావరణ శాఖ (IMD) కూడా మొంథా తుపాను ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై గట్టిగానే ఉంటుందని హెచ్చరిస్తోంది. ఈ సోమవారం నుండి వారంరోజులపాటు కుండపోత వానలు తప్పవని ప్రకటించింది. ముఖ్యంగా అక్టోబర్ 27,28,29 భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

27
ఏపీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు
Image Credit : X/@Indiametdept

ఏపీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు

ప్రస్తుతం మొంథా తుపాను ఆంధ్ర ప్రదేశ్ దిశగా దూసుకువస్తోంది... నిన్న(ఆదివారం) తీవ్ర వాయుగుండం, ఇవాళ (సోమవరం) తుపాను కొనసాగగా... రేపు (మంగళవారం) తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. మొంథా సముద్రం నుండి భూమికి దగ్గరయ్యేకొద్ది ప్రభావం పెరుగుతుందని... తీరందాటే సమయంలో కుండపోత వానలతో పాటు గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదముందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Related Articles

Related image1
Cyclone Alert : ముంచుకొస్తున్న వాయుగుండం .. ఈ ప్రాంతాలకు పొంచివున్న కుండపోత వర్ష గండం
Related image2
బంగాళాఖాతంలో మొంథా తుపాను రెడీ .. ఈ జిల్లాల్లో అల్లకల్లోలమే
37
కూటమి ప్రభుత్వం అప్రమత్తం
Image Credit : X/APSDMA

కూటమి ప్రభుత్వం అప్రమత్తం

రాష్ట్రానికి భారి వర్షాలు, వరదలు, ఈదురుగాలుల ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు, తుపాను ప్రభావిత జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వీరి ఆదేశాల మేరకు తుపాను ప్రభావిత జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకునేందకు ప్రత్యేక అధికారులను నియమించారు... అలాగే టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటుచేశారు.

47
జిల్లాల వారిగా ప్రత్యేక అధికారులు
Image Credit : social media

జిల్లాల వారిగా ప్రత్యేక అధికారులు

  •  శ్రీకాకుళం - కెవిఎన్ చక్రధర్ బాబు
  • విజయనగరం - పట్టన్ షెట్టి రవి సుభాష్
  • విశాఖపట్నం - అజయ్ జైన్
  • అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు - వినయ్ చంద్
  • కాకినాడ - విఆర్ కృష్ణతేజ
  • కోనసీమ - విజయ రామరాజు
  • పశ్చిమ గోదావరి - ప్రసన్న వెంకటేశ్
  • తూర్పు గోదావరి - కన్నబాబు
  • కృష్ణా జిల్లా - అమ్రపాలి
  • బాపట్ల - వేణుగోపాల్ రెడ్డి
  • ప్రకాశం కోనా శశిధర్
  • నెల్లూరు ఎన్ యువరాజ్
  • తిరుపతి - అరుణ్ బాబు
  • పార్వతీపురం మన్యం - నారాయణ భరత్ గుప్తాం
  • ఏలూరు - కాంతిలాల్ దండే
  • ఎన్టీఆర్ జిల్లా - శశిభూషణ్ కుమార్
  • చిత్తూరు - పిఎస్ గిరీష
  • గుంటూరు - ఆర్పి సిసోడియా
57
జిల్లాల వారిగా ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లు :
Image Credit : Asianet News

జిల్లాల వారిగా ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లు :

తుఫాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసింది. ప్రజలు అత్యవసర సహాయ చర్యలు, తుఫాను సమాచారం కోసం ఈ నంబర్లలో సంప్రదించగలరు.

  • APSDMA కంట్రోల్ రూం నెంబర్లు 112 లేదా 1070 లేదా 18004250101 కు ఫోన్ చేయవచ్చు.
  • శ్రీకాకుళం - 08942-240557
  • విజయనగరం - 08922-236947
  • విశాఖపట్నం - 0891-2590102 లేదా డయల్ 100
  • అనకాపల్లి - 08924-222888
  • కాకినాడ - 0884-2356801
  • కోనసీమ - 08856-293104
  • పశ్చిమ గోదావరి - 08816299181
  • కృష్ణా జిల్లా -08672252572
  • బాపట్ల : 08643-220226
  • ప్రకాశం - 98497 64896
  • నెల్లూరు - 08612331261 లేదా 7995576699
  • తిరుపతి - 0877-2236007

తుఫాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా,ఆస్తి నష్టం వీలైనంత మేరకు తగ్గించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.ప్రజలు వదంతులు నమ్మకుండా వాస్తవ సమాచారం తెలుసుకునేందుకు... అలాగే అవసరమైన సాయం కోసం ప్రభుత్వం కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్లు#CycloneMontha#AndhraPradesh#APSDMApic.twitter.com/rOnuZ53mb0

— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 27, 2025

67
ప్రస్తుతం మొంథా తుపాను ఎక్కడుంది?
Image Credit : X/APSDMA

ప్రస్తుతం మొంథా తుపాను ఎక్కడుంది?

బంగాళాఖాతంలో అల్లకల్లోలం సృష్టిస్తూ మొంతా తుపాను ముందుగు సాగుతోందని... ఇది ప్రస్తుతం నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతోందని.. ప్రస్తుతానికి చెన్నైకి 520కి.మీ, కాకినాడకి 570కి.మీ., విశాఖపట్నంకి 650కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు(మంగళవారం) ఉదయానికి తీవ్ర తుపానుగా మారుతుందని... ఇదేరోజు సాయంత్రానికి తీరందాటే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

77
తుపాను నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు
Image Credit : Gemini ai

తుపాను నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు

మొంథా తుఫాన్ ప్రభావం, తీవ్రతపై చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావంగురించి సోషల్‌ మీడియా, ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు ముందస్తుగానే సమాచారం అందించాలని... తద్వారా వాళ్లు ముందుగానే అప్రమత్తం అయ్యేందుకు వీలుంటుందని అన్నారు.

తీరప్రాంతాల్లో SDRF, NDRF బృందాలు మోహరించాలని సీఎం సూచించారు. ఈదురుగాలులు, వర్షాల కారణంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ కు అంతరాయం ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు... ఇందుకోసం ఇప్పటికే 27 వేల సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. తుఫాన్‌ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి రప్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

  • తుపాను ప్రభావిత జిల్లాలకు శాటిలైట్ ఫోన్
  • బీచ్ లకు పర్యాటకుల ప్రవేశం నిషేధం
  • సహాయక శిబిరాలు ఏర్పాట్లు... సౌకర్యాల ఏర్పాట్లకు ఆదేశాలు
  • పట్టణాల్లో ప్రమాదకర హోర్డింగ్ ల తొలగింపు
  • హోంశాఖతో పాటు ఇరిగేషన్, సివిల్ సప్లై, మెడికల్, విద్యుత్ శాఖ అధికారులు అందుబాటులో ఉండనున్నారు.

తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు pic.twitter.com/SXcs2nMkm4

— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 25, 2025

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
విశాఖపట్నం
విజయవాడ
తిరుపతి
హైదరాబాద్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved