MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • Cyclone Alert : ముంచుకొస్తున్న వాయుగుండం .. ఈ ప్రాంతాలకు పొంచివున్న కుండపోత వర్ష గండం

Cyclone Alert : ముంచుకొస్తున్న వాయుగుండం .. ఈ ప్రాంతాలకు పొంచివున్న కుండపోత వర్ష గండం

Cyclone Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఇప్పటికే వాయుగుండంగా మారింది. ఇది తీరంవైపు దూసుకువస్తోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు తప్పేలా లేవు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 02 2025, 08:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏపీలో కుండపోత వర్షాలు
Image Credit : Freepik

ఏపీలో కుండపోత వర్షాలు

Cyclone Alert : వర్షాకాలం ముగింపుకు చేరుకుంది... అయినా తెలుగు రాష్ట్రాలను వర్షాలు విడిచిపెట్టడంలేదు. ఆలస్యంగా మొదలైన వర్షాలు ఆలస్యంగానే ముగిసేలా ఉన్నాయి. ఆగస్ట్, సెప్టెంబర్ రెండునెలలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వర్షాలు అక్టోబర్ లో కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అనేక అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో వర్షాలు దంచికొట్టగా మరో వాయుగుండం తీరంవైపు దూసుకొస్తున్నట్లు APSDMA (ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధ) హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో దసరా పండగ సమయంలో కూడా వర్షాలు తప్పడంలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బంగాళాఖాతంలో వాయుగుండం
Image Credit : Gemini ai

బంగాళాఖాతంలో వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఇప్పటికే వాయుగుండంగా మారింది... ఇది ముందుకు సాగుతూ మరింత తీవ్రరూపం దాలుస్తోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని ... ఇది గంటకు 10 కి.మీ వేగంతో కదులుతోందని తెలిపింది. ఇలా ఈ వాయుగుండం ప్రస్తుతం ఏపీలోని విశాఖపట్నంకి 300 కిలోమీటర్లు, ఒడిషాలోని గోపాల్‌పూర్ 300 కి.మీ, పారాదీప్ కి 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇవాళ (అక్టోబర్ 2, గురువారం) రాత్రి ఈ వాయుగుండం ఒడిశా-ఆంధ్రప్రదేశ్ (గోపాల్ పూర్-పారాదీప్) మధ్య తీరందాటే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

36
అల్లకల్లోలంగా మారిన బంగాళాఖాతం
Image Credit : X

అల్లకల్లోలంగా మారిన బంగాళాఖాతం

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు జోరందుకున్నాయి. ఇక బంగాళాఖాతం కూడా ఈ వాయుగుండం కారణంగా అల్లకల్లోలంగా మారింది... కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విపత్తు సంస్థ హెచ్చరించింది. ఇవాళ రాత్రి వాయుగుండం తీరందాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి... కాబట్టి తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్ధ సూచిస్తోంది.

46
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు
Image Credit : X-@rushikesh_agre_

ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలా ఇవాళ (అక్టోబర్ 02, గురువారం) కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధ ప్రకటించింది.

56
ఈ జిల్లాల్లో కూడా వర్షాలు
Image Credit : X-@Brezzy_Drive

ఈ జిల్లాల్లో కూడా వర్షాలు

ఇక కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల చిరుజల్లులు కురుస్తాయట. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు, ఈదురుగాలులు తోడయి ప్రమాదకంగా మారవచ్చు... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

66
తెలంగాణలో భారీ వర్షాలు
Image Credit : X/Hyderabad Traffic Police

తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం రాజధాని హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది.. కొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు ఇవాళ (అక్టోబర్ 02) దసరా పండగ పూట కూడా కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రెండ్రోజులపాటు తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుపాను.. జిల్లాల్లో కుండపోత వర్షాలు
Recommended image2
Now Playing
కుప్పంలో రైతు బజార్ ప్రారంభించిన CM Chandrababu | Asianet News Telugu
Recommended image3
Pawan Kalyan : వైసిపి బిగ్ షాకిచ్చి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ వరుపుల సుబ్బారావు?
Related Stories
Recommended image1
Rain Alert : బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే, ప్రజలు బిఅలర్ట్
Recommended image2
Rain Alert: ద‌స‌రా రోజు బ‌య‌ట అడుగు పెట్ట‌డం క‌ష్ట‌మేనా? వ‌చ్చే రెండు రోజులు అత్యంత భారీ వ‌ర్షం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved