MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Andhra Pradesh
  • Cancer: ఒకే ఊరిలో 200 మందికి క్యాన్సర్.. 15 మంది మృతి.. అభివృద్ధే వారిని కాటేసిందా?

Cancer: ఒకే ఊరిలో 200 మందికి క్యాన్సర్.. 15 మంది మృతి.. అభివృద్ధే వారిని కాటేసిందా?

Cancer: అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రకృతి వినాశనం ఒక ఊరికి శాపంగా మారింది. తమ ఊరి పక్కనే కంపెనీలు వచ్చాయని.. ఉపాధి, ఉద్యోగాలు దొరుకుతాయని సంతోష పడ్డ ఆ ఊరి జనం ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారికి బలవుతున్నారు. ఆ ఊరు ఎక్కడుంది. ఇప్పుడు గ్రామంలో పరిస్థితిని తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 26 2025, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆ ఊరి పేరు బలభద్రపురం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి తూర్పుగోదావరి జిల్లాలో పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉండేది ఆ గ్రామం. బిక్కవోలు మండల పరిధిలో ఉండే ఈ ఊరిలో రైతులు సంవత్సరానికి మూడు పంటలతో ఆనందంగా జీవించేవారు. అయితే పలు ప్రఖ్యాత కంపెనీలు ఆ ఊరి చుట్టుపక్కల ప్రొడక్షన్ యూనిట్లు ప్రారంభించాయి. అప్పటి నుంచి వారికి కష్టాలు మొదలయ్యాయి. గ్రామంలోని చాలా మంది ఆ కంపెనీల్లోనే చిన్న ఉద్యోగస్థులుగా, కార్మికులుగా పనిచేస్తున్నారు. దీని వల్ల వారు అభివృద్ధి చెందకపోగా, రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కేవలం 10 వేల మంది జనాభా ఉన్న ఆ ఊరిలో ఇప్పుడు సుమారు 200 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారని గ్రామస్థులు, నాయకులు చెబుతున్నారు. దీన్నిబట్టి ఆ ఊరిలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత మందికి క్యాన్సర్ సోకడానికి కారణాలను విశ్లేషిస్తే అనేక కోణాలు వెలుగు చూశాయి. 

35

స్థానికులు చెబుతున్న విషయాలను బట్టి బలభద్రపురంలో కాలుష్యం కోరలు చాచింది. ఈ గ్రామానికి చుట్టుపక్కల అనేక ఫ్యాక్టరీలు వెలిశాయి. వాటి నుంచి వచ్చే వ్యర్థ జలాలు కాలువల్లో, భూగర్భంలో కలిసిపోవడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ వల్ల కూడా గాలి కలుషితమై శ్వాసకోస సంబంధ వ్యాధులు సోకాయని గ్రామస్థులు చెబుతున్నారు. 

45

స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బలభద్రపురంలో గత రెండేళ్లుగా ప్రజలు తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నారని, ఎక్కువ మంది  క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారని ఆయన తెలియజేశారు. రెండేళ్లలో ఎంతో మంది చనిపోయారని, గత ఏడాది కాలంలోనే సుమారు 21 మంది క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు. ఈ పరిస్థితికి కారణం బలభద్రపురానికి చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలే కారణమని ఆయన ఆరోపించారు. ప్రజలను రక్షించాలని ఆయన కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వైద్య, ఆరోగ్యశాఖ  అధికారులు గ్రామంలో అందరికీ క్యాన్సర నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

55

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. డాక్లర్లు, కేన్సర్ వ్యాధి నిపుణులు గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. 31 వైద్య బృందాలు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నాయి. ఆ గ్రామంలో ఇప్పటికే 23 మంది క్యాన్సర్‌ రోగులు చికిత్స పొందినట్టు కలెక్టర్‌ వెల్లడించారు. భూగర్భ జలాలు, వాయు కాలుష్యం వల్లే క్యాన్సర్‌ విజృంభిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

ఇది కూడా చదవండి 6-6-6 నడక అంటే ఏంటో తెలుసా? ఈ ఒక్క వాకింగ్ రూల్‌తో పూర్తి ఆరోగ్యం

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆరోగ్యం
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
Recommended image2
Now Playing
గన్నవరం ప్రజలకు బిగ్ రిలీఫ్ స్పాట్ లోనే పట్టాలు | Chandrababu Key Decision on 22A Lands
Recommended image3
Tirumala: తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఉచితంగా రూ. 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved