MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: ఒకవైపు నిప్పుల కొలిమి.. ఇంకోవైపు పిడుగుల వాన ! వాతావరణంలో వింత మార్పులు.. అలర్ట్ జారీ

Weather Update: ఒకవైపు నిప్పుల కొలిమి.. ఇంకోవైపు పిడుగుల వాన ! వాతావరణంలో వింత మార్పులు.. అలర్ట్ జారీ

Weather Update : ఆంధ్రప్రదేశ్ లో ఎండలు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఒకేసారి వణికిస్తున్నాయి. 40-50 కిమీ వేగంతో వీచే ఈదురుగాలుల వల్ల ప్రజలు, రైతులు సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 01 2026, 10:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఒకేసారి ఎండలు, భారీ వర్షాలు
Image Credit : chatgpt

తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఒకేసారి ఎండలు, భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రూట్ మార్చింది. ఒకే టైమ్‌లో ఎండలు దంచికొడుతూ, మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వణికిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులు (మంగళవారం, బుధవారం) వాతావరణం చాలా విచిత్రంగా మారబోతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. ఒక పక్కన భానుడు నిప్పుల కురిపిస్తుంటే.. మరోపక్కన పిడుగులతో వర్షం విరుచుకుపడే ఛాన్స్ ఉందని ఆయన హెచ్చరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రుతుపవనాల ప్రభావం.. ద్రోణితో వానలు
Image Credit : Asianet News

రుతుపవనాల ప్రభావం.. ద్రోణితో వానలు

వాతావరణంలో ఏర్పడిన ఒక భారీ ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం వానలు పడుతున్నాయి. దీనికి రుతుపవనాల ప్రభావం కూడా తోడవుతోందని సమాచారం. తూర్పు విదర్భ నుంచి ప్రారంభమై తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా దక్షిణ కేరళ వరకు ఈ ద్రోణి విస్తరించి ఉంది. 

దీని ఎఫెక్ట్ వల్ల ఏపీలో మంగళవారం, బుధవారం పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల స్పీడ్‌తో ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు.

34
ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
Image Credit : Gemini AI

ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్

మంగళవారం ఏపీలోని పలు జిల్లాల్లో వానలు బీభత్సం సృష్టించే ఛాన్స్ ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడొచ్చు. శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉంది.

అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

44
ఇంకోవైపు మండే ఎండలు
Image Credit : Gemini

ఇంకోవైపు మండే ఎండలు

వర్షాల అలర్ట్ ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో ఎండలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 42 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు వంటి జిల్లాల్లో 40-42 డిగ్రీల ఎండలు ఉంటాయి.

సోమవారం నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 43.6 డిగ్రీలు, మార్కాపురం నందనమారెళ్లలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వింత వాతావరణ పరిస్థితుల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు బయట తిరగొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వాన పడేటప్పుడు పొరపాటున కూడా చెట్ల కింద, కరెంట్ స్తంభాల దగ్గర, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద ఉండొద్దని అధికారులు తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Recommended image2
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
Marakata Shiva Lingam: ఈ ఒక్క శివలింగాన్ని దర్శిస్తే చాలు.. మీ బాడీలోని రోగాలన్నీ సెట్ ! తెలంగాణ వైద్యనాథుడు
Recommended image2
SIP Investment: రూ.2,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో లఖ్‌పతి అయ్యే ఛాన్స్.. ఈ సింపుల్ ట్రిక్ అస్సలు మిస్ అవ్వకండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved