MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Thalliki Vandanam: తల్లికి వందనం నిధులు రాలేదా? టెన్షన్ పడకండి.. మీకో గుడ్ న్యూస్ !

Thalliki Vandanam: తల్లికి వందనం నిధులు రాలేదా? టెన్షన్ పడకండి.. మీకో గుడ్ న్యూస్ !

Thalliki Vandanam : తల్లికి వందనం డబ్బులు రానివారికి గుడ్‌న్యూస్.. అభ్యంతరాలు, కొత్త దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ఈ నెల 30న తల్లుల ఖాతాల్లో రూ.13వేలు జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు సర్కారు తెలిపిన వివరాలు ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 09 2026, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తల్లికి వందనం పడనివారి అకౌంట్లలో రూ.13,000 ఆరోజే
Image Credit : Gemini

తల్లికి వందనం పడనివారి అకౌంట్లలో రూ.13,000 ఆరోజే

ఆంధ్రప్రదేశ్ లో బడి పిల్లల తల్లులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. 'తల్లికి వందనం' పథకంలో మొదటి విడత కింద డబ్బులు రాని అర్హులైన తల్లుల కోసం మరో గోల్డెన్ ఆప్షన్ ఇచ్చింది. ఫస్ట్ ఫేజ్ లో ఎన్పీసీఐ లింక్ కాకపోవడం, ఆధార్ మ్యాపింగ్ ఇష్యూస్ లేదా ఇతర టెక్నికల్ రీజన్స్ వల్ల ఖాతాల్లో డబ్బులు పడకపోతే అస్సలు కంగారు పడాల్సిన పనిలేదు. అలాంటి వారితో పాటు ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా స్కూళ్లు, ఇంటర్ కాలేజీల్లో జాయిన్ అయిన స్టూడెంట్లకు గుడ్ న్యూస్ అందిస్తూ, నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 30వ తేదీన ఎలిజిబుల్ అయిన తల్లుల బ్యాంక్ అకౌంట్లలో రూ.13,000 క్రెడిట్ చేయబోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అప్లికేషన్లు క్లోజ్.. 30న ఆఖరి లిస్ట్
Image Credit : Asianet News

అప్లికేషన్లు క్లోజ్.. 30న ఆఖరి లిస్ట్

మొదటి విడతలో ఎలిజిబిలిటీ ఉండి కూడా డబ్బులు అందని లబ్ధిదారుల లిస్ట్‌ను ముందే సచివాలయాల్లో డిస్‌ప్లే చేశారు. అభ్యంతరాలు ఉంటే వినతులు ఇవ్వడానికి ఆగస్టు 7 వరకు గడువు ఇచ్చారు. ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారం మొత్తం 4,470 రీ-వెరిఫికేషన్ అప్లికేషన్లు వచ్చాయి. ఇకపోతే ఈ ఇయర్ కొత్తగా బడి బాట పట్టిన పిల్లలు, ఇంటర్ లో చేరిన స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 25 వరకు టైమ్ ఉంది. వచ్చిన ఆప్లికేషన్లన్నీ ఆఫీసర్లు కంప్లీట్‌గా వెరిఫై చేసి, ఈ నెల 30న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. సరిగ్గా అదే రోజు కన్ఫర్మ్ అయిన లబ్ధిదారుల అకౌంట్లలో ప్రభుత్వం రూ.13వేలు నేరుగా జమ చేస్తుంది.

34
అకౌంట్‌లో డబ్బులు పడాలంటే ఇవి కరెక్ట్‌గా ఉండాలి
Image Credit : Getty

అకౌంట్‌లో డబ్బులు పడాలంటే ఇవి కరెక్ట్‌గా ఉండాలి

పైసలు రావాలంటే కేవలం అప్లై చేసుకుంటే సరిపోదు, మీ బ్యాంక్ అకౌంట్ కండిషన్ కరెక్ట్‌గా ఉండాలి. ఫస్ట్ విడతలో చాలామందికి డబ్బులు రాకపోవడానికి మెయిన్ రీజన్ బ్యాంక్ అకౌంట్‌కి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింక్ లేకపోవడమే. అందుకే మీ బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి ఆధార్ సీడింగ్, ఎన్పీసీఐ లింకింగ్ పక్కాగా ఉందో లేదో చెక్ చేయించుకోండి. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్‌ప్లే చేసిన అర్హుల, అనర్హుల జాబితాలో మీ స్టేటస్ ఎలా ఉందో చూసుకుని, ఏమైనా ఇష్యూస్ ఉంటే వెంటనే సచివాలయం సిబ్బందిని సంప్రదించండి.

44
ఈ రూల్స్ ఉన్నాయా? అయితే మీకే 'తల్లికి వందనం'
Image Credit : Getty

ఈ రూల్స్ ఉన్నాయా? అయితే మీకే 'తల్లికి వందనం'

ఈ స్కీమ్ కింద ఒక్కో స్టూడెంట్‌కి రూ.15,000 ఆమోదించినప్పటికీ, రూ.13,000 తల్లుల ఖాతాలో పడతాయి. పథకం పూర్తి ప్రయోజనం పొందాలంటే ఈ కింది ఎలిజిబిలిటీ క్రైటీరియా తప్పకుండా ఉండాలి..

• కుటుంబానికి 10 ఎకరాలకు మించి అగ్రికల్చర్ ల్యాండ్ ఉండకూడదు.

• వైట్ రేషన్ కార్డ్ ఉండాలి.

• ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఎలాంటి ఫోర్ వీలర్ ఉండకూడదు.

• కరెంట్ బిల్లు నెలకు 300 యూనిట్లు దాటకుండా ఉండాలి.

• ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపుదారులు అయి ఉండకూడదు.

• టౌన్స్‌లో 1,000 స్క్వేర్ ఫీట్ కంటే పెద్ద ఇల్లు కానీ, స్థలం కానీ ఉండకూడదు.

• మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి Scheme Eligibility Check అధికారిక పోర్టల్ ద్వారా మీ ఆధార్ నంబర్ నమోదు చేసి వివరాలు పరిశీలించుకోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ప్రభుత్వ పథకాలు
నారా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
Recommended image2
Now Playing
ఒకే వేదికపై ఇద్దరు సీఎంలు | Chief Ministers Chandrababu Vijay Joseph meeting at Vijayawada | Asianet
Recommended image3
ఏపీ సీఎం చంద్ర‌బాబుతో త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ భేటీ.. ఏం చ‌ర్చించారంటే.?
Related Stories
Recommended image1
Ohh My Dog: క్లైమాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు.. మస్ట్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓ మై డాగ్ సినిమా రివ్యూ
Recommended image2
Rainy Season Diet Tips: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? జాగ్రత్త !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved