MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Andhra Pradesh
  • Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ఆంధ్రా జిల్లాలకు రెడ్ అలర్ట్, రెండ్రోజులు కుండపోత వర్షాలే

Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ఆంధ్రా జిల్లాలకు రెడ్ అలర్ట్, రెండ్రోజులు కుండపోత వర్షాలే

Weather Update : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని.. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధ ప్రకటించింది.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 08 2026, 07:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇక ఏపీ వంతు... ఈ రెండ్రోజులు భారీ వర్షాలు
Image Credit : Gemini AI

ఇక ఏపీ వంతు... ఈ రెండ్రోజులు భారీ వర్షాలు

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మంచి వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు యాక్టివ్ గా మారడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో జూలై సెకండాఫ్ లో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఆగస్ట్ లో కూడా ఈ వర్షాలు కొనసాగాయి. అయితే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ వంతు వచ్చింది... రాబోయే రెండ్రోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బంగాళాఖాతంలో అల్పపీడనం...
Image Credit : Gemini AI

బంగాళాఖాతంలో అల్పపీడనం...

ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని APSDMA అంచనా వేస్తోంది. రానున్న 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. రుతుపవనాలను ఈ అల్పపీడనం మరింత యాక్టివ్ గా మార్చనుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు సంస్థ తెలిపింది... ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల కుండపోత వర్షాలు ఉంటాయని హెచ్చరించింది.

Related Articles

Related image1
IMD Rain Alert : ఆకాశంలో నల్లని మేఘాలు లోడింగ్... తెలంగాణలో 10, ఏపీలో 7 జిల్లాల్లో భారీ వర్షాలు
Related image2
Frog Rain : కప్పల వర్షం నిజమేనా? అవి ఆకాశంలోంచి పడతాయా? సైన్స్ ఏం చెబుతోంది
34
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు
Image Credit : Gemini AI

ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని విపత్తు సంస్థ తెలిపింది. రెండ్రోజులు (ఆగస్ట్ 8,9 తేదీల్లో) అంటే శని, ఆదివారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని... ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుందట... అందుకే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. అంటే ఈ జిల్లాల ప్రజలు ఈ రెండ్రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.

ఇక కోస్తాంధ్ర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై చల్లని వాతావరణం ఉంటుందని... అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. కాబట్టి ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, ఐరన్ పోల్స్, హోర్డింగ్స్ కింద నిలబడరాదని విపత్తు సంస్థ ప్రజలకు సూచించింది. మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

44
నేడు తెలంగాణలో వర్షాలు..
Image Credit : Gemini AI

నేడు తెలంగాణలో వర్షాలు..

నేడు (ఆగస్ట్ 8, శనివారం) తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయట. అలాగే రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

pic.twitter.com/k7QNqrhG8s

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) August 7, 2026

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
Recommended image2
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Recommended image3
Now Playing
APకి బ్రాండ్ అంబాసిడర్ CBN స్పీచ్ అదరగొట్టిన నిమ్మల| Nimmala Ramanaidu Speech | NTR Bharosa Pensions
Related Stories
Recommended image1
IMD Rain Alert : ఆకాశంలో నల్లని మేఘాలు లోడింగ్... తెలంగాణలో 10, ఏపీలో 7 జిల్లాల్లో భారీ వర్షాలు
Recommended image2
Frog Rain : కప్పల వర్షం నిజమేనా? అవి ఆకాశంలోంచి పడతాయా? సైన్స్ ఏం చెబుతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved