MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • AP SSC Results: కాసేప‌ట్లో ఏపీ పదో తరగతి పరీక్షా ఫ‌లితాలు.. అంద‌రికంటే ముందు ఇలా తెలుసుకోండి

AP SSC Results: కాసేప‌ట్లో ఏపీ పదో తరగతి పరీక్షా ఫ‌లితాలు.. అంద‌రికంటే ముందు ఇలా తెలుసుకోండి

AP SSC Results: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఎదురు చూపులకు ఇక ముగింపు రానుంది. ఈ ఏడాది SSC ఫలితాలను ఏప్రిల్ 30 ఉదయం 11 గంటలకు విడుదల చేయడానికి విద్యాశాఖ సిద్ధమైంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Apr 30 2026, 08:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎంతమంది హాజరయ్యారు?
Image Credit : Gemini AI

ఎంతమంది హాజరయ్యారు?

ఈసారి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వ‌హించారు. ఈ పరీక్షల్లో సుమారు 6.3 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షలు పూర్తయినప్పటి నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపుల‌కు చెక్ పెడుతూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాల విడుదలకు అవసరమైన సాంకేతిక ప్రక్రియలను ఇప్పటికే పూర్తి చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలు ఎలా చూడాలి?
Image Credit : Getty

అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలు ఎలా చూడాలి?

ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ మార్కులు తెలుసుకోవచ్చు. ఇందుకోసం వెబ్‌సైట్ https://results.bse.ap.gov.in/ తో పాటు https://telugu.abplive.com/ ఓపెన్ చేసి, తమ హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఫలితాల సమయంలో సర్వర్లు బిజీగా ఉండే అవకాశం ఉన్నందున కొంత ఆలస్యంగా లేదా పలుమార్లు ప్రయత్నించడం అవసరం కావచ్చు.

Related Articles

Related image1
Credit card: క్రెడిట్ కార్డు ఉన్న వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై బిల్లు ఆల‌స్యంగా చెల్లించిన ఏం కాదు
Related image2
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో సిలికాన్ వ్యాలీ.. ఈ ప్రాంతాలకు మ‌హ‌ర్ధ‌శ‌. శంకుస్థాప‌న‌కు స‌ర్వం సిద్ధం
35
వాట్సాప్ ద్వారా కూడా
Image Credit : Gemini AI

వాట్సాప్ ద్వారా కూడా

ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ సేవను కూడా అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ మొబైల్‌లో 9552300009 నంబర్ సేవ్ చేసి, వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపితే అక్కడ సూచనలు కనిపిస్తాయి. ఆ సూచనలను అనుసరించి హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే వెంటనే మార్కుల మెమో మొబైల్‌లో కనిపిస్తుంది. ఈ విధానం వేగంగా ఫలితాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

45
మొబైల్ యాప్‌ల ద్వారా కూడా రిజల్ట్స్
Image Credit : Getty

మొబైల్ యాప్‌ల ద్వారా కూడా రిజల్ట్స్

ఫలితాలను తెలుసుకోవడానికి మొబైల్ యాప్‌లను కూడా ఉపయోగించవచ్చు. LEAP వంటి యాప్‌ల ద్వారా విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసి మార్కులు సులభంగా పొందవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యే సౌకర్యం ఉండటం వల్ల ఈ ప్రక్రియ మరింత సులభంగా ఉంటుంది.

55
మూల్యాంకనంలో తీసుకున్న కొత్త చర్యలు
Image Credit : Getty

మూల్యాంకనంలో తీసుకున్న కొత్త చర్యలు

ఈ ఏడాది ఫలితాల ఖచ్చితత్వాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఆన్సర్ షీట్ల మూల్యాంకనం పూర్తయ్యాక మార్కులను కేవలం రికార్డుల్లో మాత్రమే కాకుండా ట్యాబ్‌లలో కూడా వెంటనే నమోదు చేశారు. దీంతో పొరపాట్లు తగ్గి, ఫలితాలు మరింత నమ్మకంగా ఉండ‌నున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
విద్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ఎవరైనా మావిగన్ మాటెత్తితే బాబు గుండె ఆగిపోయే పరిస్థితి : YS Jagan Pressmeet
Recommended image2
Now Playing
అభివృద్ధి పేరుతో చంద్రబాబు దోపిడీ: జగన్ | YS Jagan Pressmeet
Recommended image3
Now Playing
బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ చంద్రబాబు పై జగన్ పంచ్ లు: YS Jagan Pressmeet
Related Stories
Recommended image1
Credit card: క్రెడిట్ కార్డు ఉన్న వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై బిల్లు ఆల‌స్యంగా చెల్లించిన ఏం కాదు
Recommended image2
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో సిలికాన్ వ్యాలీ.. ఈ ప్రాంతాలకు మ‌హ‌ర్ధ‌శ‌. శంకుస్థాప‌న‌కు స‌ర్వం సిద్ధం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved