- Home
- Business
- Credit card: క్రెడిట్ కార్డు ఉన్న వారికి పండగలాంటి వార్త.. ఇకపై బిల్లు ఆలస్యంగా చెల్లించిన ఏం కాదు
Credit card: క్రెడిట్ కార్డు ఉన్న వారికి పండగలాంటి వార్త.. ఇకపై బిల్లు ఆలస్యంగా చెల్లించిన ఏం కాదు
Credit card: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఉపశమనం కలిగించే విధంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆలస్యంగా చెల్లింపులు చేసే సందర్భాల్లో వెంటనే జరిమానాలు విధించకుండా, మూడు రోజుల గడువు ఇవ్వాలని నిర్ణయించింది.

మూడు రోజుల గడువు.. ఎలా పని చేస్తుంది?
క్రెడిట్ కార్డు విధానంలో కొత్త మార్పులు క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్: ఇష్యూస్ అండ్ కండక్ట్ డైరెక్షన్స్ 2026లో భాగంగా తీసుకువచ్చారు. ఈ కొత్త రూల్స్ 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, క్రెడిట్ కార్డ్ బిల్లు డ్యూ డేట్ మిస్ అయిన వెంటనే “పాస్ట్ డ్యూ”గా పరిగణించరు. డ్యూ డేట్ తర్వాత మూడు రోజులు గడిచిన తర్వాత కూడా చెల్లింపు చేయకపోతేనే అది ఆలస్యంగా పరిగణిస్తారు. అలాగే లేట్ ఫీజులు, ఇతర జరిమానాలు కూడా ఈ మూడు రోజుల తర్వాతే వర్తిస్తాయి. దీంతో వినియోగదారులకు చిన్న ఉపశమనం లభించనుంది.
లేట్ ఫీజుల లెక్కింపు విధానం మార్పు
ఇప్పటి వరకు కొన్ని బ్యాంకులు మొత్తం బిల్లుపై లేట్ ఫీజులు విధించేవి. కానీ కొత్త రూల్స్ ప్రకారం, డ్యూ డేట్ తర్వాత మిగిలిన బకాయిపై మాత్రమే జరిమానాలు విధించాలి. అంటే వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తం ఆధారంగా ఫీజులు ఉంటాయి.
డ్యూ డేట్ మాత్రం మారదు
ఈ మార్పులతో డ్యూ డేట్‌లో ఎలాంటి మార్పు ఉండదు. బిల్లు చెల్లించాల్సిన తేదీ అదే ఉంటుంది. మూడు రోజుల గడువు ఉన్నా, ఆలస్యంగా చెల్లించినట్టు బ్యాంకుల అంతర్గత రికార్డుల్లో నమోదు అవుతుంది. అలాగే వడ్డీ చార్జీలు కూడా డ్యూ డేట్ నుంచి వర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఇది పూర్తిగా సడలింపు కాదు, కేవలం జరిమానాల విషయంలో మాత్రమే ఉపశమనం.
క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం
మూడు రోజులలోపు బిల్లు చెల్లిస్తే, వెంటనే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడకపోవచ్చు. కానీ మూడు రోజులకు మించి ఆలస్యం చేస్తే, అది “పాస్ట్ డ్యూ”గా పరిగణించి క్రెడిట్ రిపోర్ట్‌లో చూపించే అవకాశం ఉంది. అందువల్ల వినియోగదారులు సమయానికి చెల్లింపులు చేయడం ఇంకా చాలా ముఖ్యమే.
కొత్త రూల్స్ ఉద్దేశ్యం
బ్యాంకులు, కార్డ్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాల్లో ఒకే విధమైన ప్రమాణాలు తీసుకురావడమే ఆర్బీఐ లక్ష్యం. ఆలస్య చార్జీలు విధించే విధానం స్పష్టంగా ఉండేలా చేయడం, వినియోగదారులకు గందరగోళం లేకుండా చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నిజంగా బకాయి ఉన్న మొత్తంపైనే ఫీజులు విధించడం ద్వారా పారదర్శకత పెంచాలని ప్రయత్నిస్తోంది.

