MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Roja Selvamani: చంద్రబాబుని సొంత అన్నలా భావించా.. ఓడించడానికి కుట్ర చేశారు.. టీడీపీని వీడటంపై రోజా కామెంట్‌

Roja Selvamani: చంద్రబాబుని సొంత అన్నలా భావించా.. ఓడించడానికి కుట్ర చేశారు.. టీడీపీని వీడటంపై రోజా కామెంట్‌

నటి, మాజీ మంత్రి రోజా.. పదిహేనేళ్ల క్రితమే టీడీపీని వీడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను ఎందుకు గుడ్‌ బై చెప్పాల్సి వచ్చిందో వెల్లడించింది రోజా. చంద్రబాబుపై హాట్‌ కామెంట్‌ చేసింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 11 2026, 08:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మళ్లీ బుల్లితెరపై ఫోకస్‌ పెట్టిన రోజా
Image Credit : youtube@zeecinemalu

మళ్లీ బుల్లితెరపై ఫోకస్‌ పెట్టిన రోజా

మాజీ మంత్రి, నటి రోజా ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తోంది. ఆమె జీ తెలుగులో పలు షోస్‌ చేస్తోంది. మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గానే ఉంది. వైఎస్‌ఆర్‌సీపీలో కీలక నాయకురాలిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆమె ఓడిపోవడంతో ఆ జోరు తగ్గించింది. ఇటు టీవీ, అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తుంది. అదే సమయంలో అధికార పక్షాన్ని విమర్శించే విషయంలోనూ కొంత మాట వేడి తగ్గించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి రోజా ఎంట్రీ
Image Credit : stockPhoto

టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి రోజా ఎంట్రీ

ఇదిలా ఉంటే రోజా వైసీపీలోకి రావడానికి ముందు టీడీపీలో చేరింది. హీరోయిన్‌గా కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే ఆమెకి రాజకీయాల్లో ఆఫర్స్ వచ్చాయి. అలా టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు ఆఫర్‌ చేయడంతో 1998లో ఆమె టీడీపీలో చేరింది. మహిళా వింగ్‌కి అధ్యక్షురాలిగా వర్క్ చేశారు. అనతి కాలంలోనే పార్టీలో కీలక నాయకురాలిగా మారిపోయింది రోజా. 2004లో ఆమె నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత 2009లోనూ చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత టీడీపీకి గుడ్‌ బై చెప్పింది. వైఎస్‌ జగన్‌ సారథ్యంలోని వైఎస్‌ఆర్‌సీపీలో చేరింది. ఆ తర్వాత నగరి నుంచే ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందింది. గత టర్మ్ లో మంత్రిగానూ పనిచేసింది.

34
చంద్రబాబుని సొంత అన్నలా భావించా
Image Credit : Instagram/Roja Selvamani

చంద్రబాబుని సొంత అన్నలా భావించా

ఇదిలా ఉంటే టీడీపీ గుడ్‌ బై చెప్పిన తర్వాత కొంత కాలం మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెట్టింది రోజా. ఆ సమయంలో మంచు లక్ష్మికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. టీడీపీకి ఎందుకు గుడ్‌ బై చెప్పాల్సి వచ్చిందో వెల్లడించింది. చంద్రబాబు నాయుడిని తాను అన్నగా భావించానని, ఆయన గెలుపుకోసం ఒక చెల్లిగా పనిచేశానని తెలిపింది. అయితే కొంత మంది లీడర్లు తన ఎదుగుదలని చూసి ఓర్వలేకపోయారని, తాను ఓడించేందుకు కుట్ర చేశారని, తనని డౌన్‌ చేసే ప్రయత్నం చేశారని తెలిపింది. తనపై ఇంత చేస్తున్నా, చంద్రబాబు నాయుడు వారిపై యాక్షన్‌ తీసుకోలేదు, ఎలాంటి రియాక్షన్‌ లేదు. దీంతో తన మనసుకు కష్టమైందని, తాను పార్టీలో ఉండలేకపోయానని, అందుకే వీడినట్టు తెలిపింది రోజా.

44
మళ్లీ టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు
Image Credit : Asianet News

మళ్లీ టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు

తాను సొంత బ్రదర్‌లా భావించానని, పార్టీని ఓన్‌ చేసుకొని పనిచేశాను, కానీ వాళ్లు తనని ఓన్‌ చేసుకోలేకపోయారని, దూరం పెట్టిన ఫీలింగే కలిగిందని, అందుకే తాను ఇమడలేకపోయానని చెప్పింది రోజా. తన ఎదుగుదలని ఓర్చుకోలేని కొందరు చేసిన కుట్రలకు తాను బలైనట్టు ఆమె వెల్లడించింది. మళ్లీ టీడీపీలోకి వెళ్తారా? అనే ప్రశ్నకి ఆమె రియాక్ట్ అవుతూ మళ్లీ వెళ్లేదు లేదని తెగేసి చెప్పింది రోజా. చంద్రబాబు మళ్లీ పిలిచే ఛాన్స్ లేదని, ఆయన చుట్టూ ఉన్నవాళ్లు అలాంటి వాతావరణం క్రియేట్‌ చేశారని చెప్పారు. దాదాపు పదిహేనేళ్ల క్రితం నాటి ఈ అరుదైన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తెలుగుదేశం పార్టీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Saree: బాబోయ్! సీఎం విజయ్‌ను కలిసినప్పుడు రష్మిక కట్టుకున్న చీర అంత ఖరీదా?
Recommended image2
ఋతురాగాలు రాజా ఎలా చనిపోయాడో తెలుసా? అసలేం జరిగిందో చెప్పేసిన నటి రూపాదేవి
Recommended image3
Abbayigaru Movie Review: కృష్ణ మనసుపడ్డ సినిమా.. వెంకటేష్ చేతికి ఎలా వెళ్లింది, అబ్బాయిగారు మూవీ రివ్యూ
Related Stories
Recommended image1
MS Raju: మళ్లీ పెళ్లి విషయంలో జరిగిన మిస్టేక్‌ ఇదే.. నరేష్‌, పవిత్రల సినిమా డిజాస్టర్‌పై ఎంఎస్‌ రాజు రియాక్షన్‌
Recommended image2
Ilaiyaraaja Magic: జోలపాట ట్యూన్ కాస్త మాస్ బీట్ గా.. ఇళయరాజా చేసిన మ్యాజిక్ తెలిస్తే మైండ్‌ బ్లాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved