- Home
- Andhra Pradesh
- Andhra Pradesh: రూ.3,32,205 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్.. ఏయే రంగానికి ఎంత కేటాయించారంటే.?
Andhra Pradesh: రూ.3,32,205 కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్.. ఏయే రంగానికి ఎంత కేటాయించారంటే.?
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండనుందని మంత్రి పయ్యావుల తెలిపారు. ఈ బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత కేటాయించారో తెలుసుకుందాం.

మొత్తం బడ్జెట్ ఎంతంటే.?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,32,205 కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ విషయానికొస్తే..
రెవెన్యూ వ్యయం: రూ. 2,56,143 కోట్లు
మూలధన వ్యయం: రూ. 53,915 కోట్లు
రెవెన్యూ లోటు: రూ. 22,002 కోట్లు
ద్రవ్య లోటు: రూ. 75,868 కోట్లు
ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి తెలిపారు.
ఆర్థిక వృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ దృక్పథం
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో 11.75% వృద్ధి రేటు నమోదైందని, 2026–27లో సుమారు 10.75% వృద్ధి సాధించాలనే అంచనాతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని రెండంకెల వృద్ధి దిశగా తీసుకెళ్తామని మంత్రి చెప్పుకొచ్చారు.
మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులు
రాష్ట్ర అభివృద్ధికి కీలక రంగాలకు గణనీయ కేటాయింపులు చేశారు:
అమరావతి రాజధాని నిర్మాణం: రూ. 6,000 కోట్లు
పోలవరం ప్రాజెక్టు: రూ. 6,105 కోట్లు
విద్యుత్ రంగం: రూ. 13,934 కోట్లు
రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు: రూ. 13,546 కోట్లు
పరిశ్రమల అభివృద్ధి: రూ. 3,161 కోట్లు
గృహ నిర్మాణం: రూ. 5,451 కోట్లు
విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను రాష్ట్ర వృద్ధి ఇంజిన్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ. 28,000 కోట్లు కేటాయించగా, రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు.
వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
వ్యవసాయ రంగానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు:
మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు: రూ. 9,906 కోట్లు
అన్నదాత సుఖీభవ: రూ. 6,600 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన: రూ. 1,927 కోట్లు
పంటల భీమా: రూ. 250 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి: రూ. 500 కోట్లు
మత్స్యకారుల సేవలో: రూ. 260 కోట్లు
2030 నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
సంక్షేమం, విద్య, సామాజిక రంగం
సామాజిక సంక్షేమ పథకాల కోసం భారీ కేటాయింపులు చేశారు:
ఎన్టీఆర్ భరోసా: రూ. 27,719 కోట్లు
తల్లికి వందనం: రూ. 9,668 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమం: రూ. 4,581 కోట్లు
ఉపకారవేతనాలు: రూ. 3,836 కోట్లు
సమగ్ర శిక్ష: రూ. 2,946 కోట్లు
ఉన్నత విద్య: రూ. 2,566 కోట్లు
మధ్యాహ్న భోజన పథకం: రూ. 2,161 కోట్లు
నైపుణ్యాభివృద్ధి: రూ. 1,232 కోట్లు
యువత, క్రీడలు: రూ. 438 కోట్లు
అదనంగా, ఆరోగ్య రంగంలో ఎన్టీఆర్ వైద్య సేవకు రూ. 4,000 కోట్లు, తాగునీటి కోసం జల్ జీవన్ మిషన్‌కు రూ. 4,000 కోట్లు కేటాయించారు.

