MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Andhra Pradesh
  • Heatwave Alert : బయటకు రావద్దు! దంచికొడుతున్న ఎండలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్

Heatwave Alert : బయటకు రావద్దు! దంచికొడుతున్న ఎండలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్

Heatwave Alert : ఆంధ్రప్రదేశ్‌లో భానుడి భగభగలు మొదలయ్యాయి. శనివారం 73 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండల తీవ్రత పెరుగుతోందనీ, జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 04 2026, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏపీలో నిప్పుల కొలిమి.. విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక
Image Credit : Gemini

ఏపీలో నిప్పుల కొలిమి.. విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం (ఏప్రిల్ 4) రాష్ట్రవ్యాప్తంగా 73 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆదివారం కూడా 32 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జిల్లాల వారీగా వడగాళ్ల ప్రభావం
Image Credit : Gemini

జిల్లాల వారీగా వడగాళ్ల ప్రభావం

శనివారం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. శ్రీకాకుళం జిల్లాలో 16 మండలాలు, విజయనగరంలో 24, పార్వతీపురం మన్యంలో 15, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, పోలవరం (ఏలూరు/పశ్చిమ గోదావరి పరిధి) 9, అనకాపల్లిలో 2, కాకినాడలో 3, తూర్పుగోదావరిలో 1 మండలంలో తీవ్ర వడగాలులు వీయనున్నాయి. ఇవే కాకుండా శ్రీకాకుళం (2), పోలవరం (2), అనకాపల్లి (1), కాకినాడ (2), తూర్పుగోదావరి (3), ఏలూరు (4), ఎన్టీఆర్ (1), పల్నాడు (2) మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

Related Articles

Related image1
Gratuity : ఉద్యోగులకు పండగే.. ఇక ఐదేళ్లు అక్కర్లేదు, ఏడాదికే గ్రాట్యుటీ.. కొత్త రూల్స్ ఇవే
Related image2
8th Pay Commission : ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘం లేఖలో ఏముంది?
34
రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు
Image Credit : Gemini

రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు

శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటాయి. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో అత్యధికంగా 41.8°C ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4°C, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.9°C, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో 40.5°C గా నమోదైంది. నంద్యాల జిల్లా ఆలమూరు, కడప జిల్లా బద్వేల్ ప్రాంతాల్లో 40.4°C ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం, తిరుపతి జిల్లా రేణిగుంట, విజయనగరం జిల్లా రాజాంలో 40.3°C మేర ఎండ తీవ్రత కనిపించింది. కృష్ణా జిల్లా కంకిపాడులో 40.1°C, కర్నూలు జిల్లా తోవిలో 40°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

44
మండుతున్న ఎండలు.. ప్రజలకు కీలక సూచనలు
Image Credit : Gemini

మండుతున్న ఎండలు.. ప్రజలకు కీలక సూచనలు

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మహిళలు, చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి ప్రజలు ఎక్కువగా మంచినీరు తీసుకోవాలని కోరారు. దాహంగా లేకపోయినా నీరు త్రాగాలని, ఓఆర్ఎస్ తో పాటు ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఎండలో ప్రయాణించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
వాతావరణం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
Recommended image2
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Recommended image3
Now Playing
APకి బ్రాండ్ అంబాసిడర్ CBN స్పీచ్ అదరగొట్టిన నిమ్మల| Nimmala Ramanaidu Speech | NTR Bharosa Pensions
Related Stories
Recommended image1
Gratuity : ఉద్యోగులకు పండగే.. ఇక ఐదేళ్లు అక్కర్లేదు, ఏడాదికే గ్రాట్యుటీ.. కొత్త రూల్స్ ఇవే
Recommended image2
8th Pay Commission : ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘం లేఖలో ఏముంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved