MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • స్లీప‌ర్ బ‌స్సులో ప‌క్క‌ప‌క్క సీట్లు టికెట్ బుక్ చేసుకున్న ప్రేమికులు.. పోలీసుల వ‌ర‌కు చేరిన వ్య‌వ‌హారం

స్లీప‌ర్ బ‌స్సులో ప‌క్క‌ప‌క్క సీట్లు టికెట్ బుక్ చేసుకున్న ప్రేమికులు.. పోలీసుల వ‌ర‌కు చేరిన వ్య‌వ‌హారం

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చోటుచేసుకున్న సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. చిన్న సీటింగ్ వివాదం చివరకు గొడవకు, ఆ తర్వాత దాడికి దారితీసింది. ఈ ఘటనలో బస్ డ్రైవర్ గాయపడగా, యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Feb 17 2026, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్ నుంచి మచిలీపట్నం ప్రయాణం
Image Credit : Gemini AI

హైదరాబాద్ నుంచి మచిలీపట్నం ప్రయాణం

హైదరాబాద్‌లో నివసిస్తున్న ఓ ప్రేమజంట మచిలీపట్నం వెళ్లేందుకు ప్రైవేట్ స్లీపర్ బస్సులో రెండు బెర్తులు ముందుగానే బుక్ చేసుకున్నారు. ప్రయాణం సాఫీగా సాగుతుందని భావించారు. అయితే బుకింగ్ వివరాల్లో ఉన్న పేర్లు తర్వాత సమస్యకు కారణమయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బుకింగ్ పేర్లలో గందరగోళం
Image Credit : Gemini AI

బుకింగ్ పేర్లలో గందరగోళం

బస్ టికెట్లలో రెండు సీట్లు కూడా యువతుల పేర్లతోనే నమోదు అయినట్లు డ్రైవ‌ర్ గుర్గించాడు. ప్రయాణం ప్రారంభమైన తర్వాత సిబ్బంది ఐడి వివరాలు పరిశీలించే సమయంలో ఈ విషయం బయటపడింది. కంపెనీ నిబంధనల ప్రకారం టికెట్‌పై ఉన్న పేరుకు భిన్నంగా ప్రయాణించడం అనుమతించలేమని డ్రైవర్ స్పష్టం చేశాడు. దీంతో ప్రేమజంట అభ్యంతరం వ్యక్తం చేసింది.

35
బస్సులో వాగ్వాదం.. ప్రయాణికుల జోక్యం
Image Credit : Gemini AI

బస్సులో వాగ్వాదం.. ప్రయాణికుల జోక్యం

డ్రైవర్, యువకుడి మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరూ పక్కపక్కనే స్లీపర్ బెర్త్‌లో ఉండాలని యువతి పట్టుబట్టినట్లు సమాచారం. అయితే నిబంధనలను కారణంగా చూపుతూ డ్రైవర్ నిరాకరించాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని గొడవను ఆపారు. కొంతసేపటికి బస్సు మళ్లీ ప్రయాణం కొనసాగించింది.

45
బస్టాండ్ వద్ద మళ్లీ ఉద్రిక్తత
Image Credit : Gemini AI

బస్టాండ్ వద్ద మళ్లీ ఉద్రిక్తత

మచిలీపట్నం చేరుకున్న తర్వాత పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఇద్దరినీ కలిసి కూర్చోనివ్వలేదని యువతి ఆగ్రహం వ్యక్తం చేయ‌డంతో.. యువకుడు డ్రైవర్‌పై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

55
పోలీసుల కేసు నమోదు, దర్యాప్తు
Image Credit : Gemini AI

పోలీసుల కేసు నమోదు, దర్యాప్తు

డ్రైవర్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నపాటి సీటింగ్ వివాదం ఇలా దాడికి దారి తీసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ ట్రావెల్స్‌లో టికెట్ బుకింగ్ సమయంలో సరైన వివరాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
నేరాలు, మోసాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కుప్పంలో రైతు బజార్ ప్రారంభించిన CM Chandrababu | Asianet News Telugu
Recommended image2
Pawan Kalyan : వైసిపి బిగ్ షాకిచ్చి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ వరుపుల సుబ్బారావు?
Recommended image3
Now Playing
పవన్ రాకతో ఉప్పొంగిన పిఠాపురం | Deputy CM Pawan Kalyan Craze In Pithapuram | Asianet News Telugu
Related Stories
Recommended image1
Alcohol: నిమ్మ‌కాయ చ‌ప్ప‌రిస్తే తాగిన మ‌త్తు దిగుతుందా.? అస‌లేంటీ లాజిక్
Recommended image2
Viral Video: టీచ‌ర‌మ్మ స్టెప్పులు చూస్తే పిచ్చెక్కాల్సిందే.. ముక్కాబులా పాట‌కు డ్యాన్స్ ఫ్లోర్ షేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved