MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ప్రైవేట్ కోచింగ్ సెంట‌ర్ల‌పై ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి.. సీఎం కీల‌క ఆదేశాలు

ప్రైవేట్ కోచింగ్ సెంట‌ర్ల‌పై ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి.. సీఎం కీల‌క ఆదేశాలు

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ కోచింగ్ సంస్థల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పోటీ పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేయాల్సిన శిక్షణా కేంద్రాలు రాజకీయ కార్యకలాపాలకు అడ్డాగా మారకూడదని స్పష్టం చేసింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 15 2026, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొన్ని కోచింగ్ సంస్థల తీరుపై ప్రభుత్వానికి సమాచారం
Image Credit : Asianet News

కొన్ని కోచింగ్ సంస్థల తీరుపై ప్రభుత్వానికి సమాచారం

రాష్ట్రంలో పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్న కొన్ని ప్రైవేట్ సంస్థల వ్యవహారశైలిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు, సమాచారం అందినట్లు తెలుస్తోంది. అభ్యర్థులను విద్య, పరీక్షల సన్నద్ధతకు పరిమితం చేయకుండా కొన్ని సందర్భాల్లో రాజకీయ అంశాలకు సంబంధించిన నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారన్న అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ పరిణామాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. శిక్షణ కోసం తమ వద్ద చేరిన విద్యార్థులను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం సరికాదని ప్రభుత్వం భావిస్తోంది. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కోచింగ్ కేంద్రాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అభ్యర్థులపై ఒత్తిడి తెస్తే సహించేది లేదు
Image Credit : Social Media

అభ్యర్థులపై ఒత్తిడి తెస్తే సహించేది లేదు

పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు విద్యార్థులు నెలల తరబడి శ్రమిస్తుంటారు. ఇలాంటి సమయంలో వారిని రాజకీయ కార్యక్రమాలు, నిరసనలు, ఆందోళనల వైపు మళ్లించడం వల్ల వారి చదువుపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. కొందరు నిర్వాహకులు తమ స్వప్రయోజనాల కోసం అభ్యర్థులపై ఒత్తిడి తీసుకొచ్చి నిరసనల్లో పాల్గొనేలా చేస్తున్నారన్న ఆరోపణలపైనా అధికారులు దృష్టి సారించారు. ఈ తరహా చర్యలకు పాల్పడే సంస్థలపై క్షేత్రస్థాయిలో అధికారులు నిఘా ఉంచాలని సీఎం సూచించారు. అభ్యర్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

35
జీవో నంబర్‌ 9 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
Image Credit : Social Media

జీవో నంబర్‌ 9 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నియంత్రణా నిబంధనలు 2026 ప్రకారం ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలు ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీవో నంబర్‌ 9లో పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా సంస్థల నిర్వహణ ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. శిక్షణా సంస్థలు తమ పరిధిని దాటి వ్యవహరించడం, అభ్యర్థులను ఇతర కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వంటి అంశాలపై అధికారులు పరిశీలన చేపట్టాలని ఆదేశించింది. మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

45
క్షేత్రస్థాయిలో తనిఖీలు.. నిబంధనల అమలుపై దృష్టి
Image Credit : Nara Chandrababu Naidu Official/Youtube

క్షేత్రస్థాయిలో తనిఖీలు.. నిబంధనల అమలుపై దృష్టి

ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలు నిబంధనలను సక్రమంగా పాటిస్తున్నాయా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం సూచించింది. శిక్షణా కేంద్రాల నిర్వహణలో ఎలాంటి ఉల్లంఘనలు ఉన్నా వాటిని గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలకు కోచింగ్ సంస్థలు కేంద్రాలుగా మారకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేలా మొత్తం వ్యవస్థ పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

55
చదువుపైనే దృష్టి పెట్టాలని అభ్యర్థులకు సూచన
Image Credit : social media

చదువుపైనే దృష్టి పెట్టాలని అభ్యర్థులకు సూచన

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎలాంటి బాహ్య ఒత్తిళ్లకు లోనుకాకుండా తమ లక్ష్యంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచించింది. భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే ముందు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కోచింగ్ కేంద్రాల నిర్వాహకుల నుంచి ఏదైనా ఒత్తిడి, ఇబ్బంది లేదా నిబంధనలకు విరుద్ధమైన చర్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించింది. విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించడం, వారి సమయాన్ని పరీక్షల సన్నద్ధతకు వినియోగించేలా చూడడం కోచింగ్ సంస్థల ప్రధాన బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
Recommended image2
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Recommended image3
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు
Related Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved