- Home
- Andhra Pradesh
- ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ ప్రాంతంలో రూ. 1264 కోట్లతో రైల్వే లైన్లకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ ప్రాంతంలో రూ. 1264 కోట్లతో రైల్వే లైన్లకు ఆమోదం
Andhra pradesh: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్–కర్ణాటక మధ్య రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకు కేంద్రం రూ. 1264 కోట్లు ఖర్చు చేయనుంది

బళ్లారి–గుంతకల్లు మధ్య 3, 4వ రైల్వే లైన్లకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య రైల్వే రవాణాను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో బళ్లారి–గుంతకల్లు మార్గంలో మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.1,264 కోట్లు కేటాయించారు. సుమారు 46 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లను నిర్మించనుండగా, ఈ పనులను 2028–29 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు అమలుతో దాదాపు 99 గ్రామాలకు మెరుగైన రైల్వే అనుసంధానం లభించనుంది. అలాగే సుమారు 7 లక్షల మందికి ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. వేదవతి నదిపై కొత్త రైల్వే వంతెన నిర్మాణం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్నారు.
సరుకు రవాణా వేగం.. పర్యావరణానికి కూడా మేలు
కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి రావడంతో ఇనుప ఖనిజం, బొగ్గు, ఉక్కు, సిమెంట్, ఎరువులు, ధాన్యాలు వంటి భారీ సరుకుల రవాణా మరింత వేగంగా సాగనుంది. రైల్వే సామర్థ్యం పెరగడంతో ప్రతి ఏడాది అదనంగా సుమారు 16.22 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసే అవకాశం ఏర్పడుతుందని కేంద్రం తెలిపింది. రోడ్డు మార్గంపై ఆధారపడటం తగ్గడంతో ఇంధన వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ప్రతి ఏడాది కోట్ల లీటర్ల ఇంధనం ఆదా కావడంతో పాటు కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ లక్ష్యాల సాధనకు ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది.
రూ.3,030 కోట్లతో 'భవ్య రసాయన' పథకం
దేశీయ రసాయన పరిశ్రమను ప్రపంచస్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు కేంద్రం రూ.3,030 కోట్లతో 'భవ్య రసాయన' పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆధునిక కెమికల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పార్కు అభివృద్ధికి రూ.1,000 కోట్ల వరకు కేంద్ర సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. దీంతో దేశీయ తయారీ, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రసాయన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
పేపర్ లీక్‌లపై ఉక్కుపాదం.. కఠిన చట్టానికి గ్రీన్ సిగ్నల్
ఇదిలా ఉంటే నీట్ పేపర్ లీక్ ఘటనల నేపథ్యంలో కేంద్రం చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడైంది. కొత్త నిబంధనల ప్రకారం పేపర్ లీక్ లేదా పరీక్షల అక్రమాల్లో పాల్గొనే వ్యక్తులు, సంఘటిత ముఠాలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా చట్టంలో మార్పులు ప్రతిపాదించారు. అలాగే ఇలాంటి కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టులకు చట్టబద్ధ హోదా కల్పించే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.