MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఇక అమరావతికి జెట్ స్పీడ్ తో వెళ్లొచ్చు.. అసలేంటీ సీడ్ యాక్సెస్ రోడ్డు.? దీంతో కలిగే ప్రయోజనాలేంటి.?

ఇక అమరావతికి జెట్ స్పీడ్ తో వెళ్లొచ్చు.. అసలేంటీ సీడ్ యాక్సెస్ రోడ్డు.? దీంతో కలిగే ప్రయోజనాలేంటి.?

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. రాజధాని ప్రాంతానికి వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం దీనిని ప్రారంభించారు.

3 Min read
Author : Narender Vaitla
Published : Aug 13 2026, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అసలేంటి సీడ్ యాక్సెస్ రోడ్డు?
Image Credit : Asianet News

అసలేంటి సీడ్ యాక్సెస్ రోడ్డు?

అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రధాన రహదారుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు (E-3) అత్యంత కీలకమైనది. రాజధాని ప్రాంతాన్ని విజయవాడ, మంగళగిరి వైపు ఉన్న ప్రధాన రహదారులతో అనుసంధానించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ కారిడార్‌ను మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవున, సుమారు రూ.1,519 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేస్తున్న ఈ రహదారిలో ప్రధాన క్యారేజ్‌వేతో పాటు సర్వీస్ రోడ్లు, బీఆర్‌టీఎస్ కారిడార్ వంటి సదుపాయాలకు ప్రణాళిక ఉంది. అమరావతిలోని కీలక ప్రాంతాలకు వేగంగా చేరుకునేలా ఈ రహదారిని రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో రాజధాని నగరం విస్తరించినప్పుడు పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ రహదారి నిర్మాణం చేపట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయవాడ నుంచి అమరావతికి ప్రయాణం సులభం
Image Credit : Gemini AI

విజయవాడ నుంచి అమరావతికి ప్రయాణం సులభం

సీడ్ యాక్సెస్ రోడ్డుకు బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి కీలకమైన లింక్‌గా మారింది. సుమారు రూ.82 కోట్లతో నిర్మించిన ఈ వంతెన 478 మీటర్ల పొడవుతో నాలుగు వరుసలుగా ఉంది. దీని ద్వారా విజయవాడ-మంగళగిరి వైపు నుంచి వచ్చే వాహనాలు E-3 రోడ్డులోకి నేరుగా చేరుకునే అవకాశం ఏర్పడింది. దీంతో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ, వేగవంతమైన మార్గం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటివరకు కరకట్ట రోడ్డుపై ఆధారపడే వాహనాల్లో కొంత ట్రాఫిక్ కొత్త మార్గానికి మళ్లే అవకాశం ఉంది. ఫలితంగా కరకట్టపై ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గవచ్చు.

Related Articles

Related image1
Highway: ఇక‌పై ఆ దేశాల‌కు కారులో వెళ్లిపోవ‌చ్చు.. 1360 కి.మీల భారీ ర‌హ‌దారి నిర్మాణం
Related image2
ఈ అగ్గిపుల్ల‌ను ఎన్నిసార్లు వెలిగించినా వెలుగుతూనే ఉంటుంది.. బెస్ట్ కిచెన్ గ్యాడ్జెట్
35
అమరావతిలోని ఏ ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది?
Image Credit : generated by Google gemini

అమరావతిలోని ఏ ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది?

సీడ్ యాక్సెస్ రోడ్డు కేవలం విజయవాడ నుంచి అమరావతికి చేరుకోవడానికి మాత్రమే ఉపయోగపడే రహదారి కాదు. రాజధాని నగరంలోని కీలక ప్రభుత్వ, పరిపాలనా ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడం దీని మరో ముఖ్య ఉద్దేశం. రాజధానిలోని హైకోర్టు, సచివాలయం, మంత్రుల నివాసాలు, ఎమ్మెల్యేల నివాసాలు, ఉద్యోగుల క్వార్టర్లు, పరేడ్ గ్రౌండ్ వంటి ముఖ్య ప్రాంతాలకు ఈ కారిడార్ ద్వారా సులభంగా చేరుకునేలా రహదారి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. మూడు దశల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విజయవాడ, మంగళగిరి వైపు నుంచి రాజధాని ప్రాంతానికి వచ్చే వాహనాలకు మరింత మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. రహదారి వెంట సైకిల్ ట్రాక్, ఫుట్‌పాత్, గ్రీన్ బెల్ట్ వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

45
బ్రిడ్జిలు ఎందుకు కీలకం?
Image Credit : X

బ్రిడ్జిలు ఎందుకు కీలకం?

సీడ్ యాక్సెస్ రోడ్డు మార్గంలో బకింగ్‌హామ్ కెనాల్, కొండవీటి వాగు వంటి నీటి మార్గాలు ఉండటంతో వాటిపై వంతెనలు నిర్మించాల్సి వచ్చింది. అందులో బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణ కూడా ఒక ప్రధాన సవాలుగా నిలిచింది. కొన్ని ప్రాంతాల్లో రైతులతో చర్చల తర్వాత భూములు సమీకరించగా, మరికొన్ని చోట్ల భూసేకరణకు సంబంధించిన అంశాలు న్యాయస్థానాల వరకు వెళ్లడంతో పనులు ఆలస్యమయ్యాయి. సమస్యలు పరిష్కారం కావడంతో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. పూర్తి కారిడార్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అమరావతి రవాణా వ్యవస్థ మరింత సమగ్రంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రాజధానిలో చేపడుతున్న ఇతర రహదారి ప్రాజెక్టులకు కూడా ఈ మార్గం అనుసంధానంగా పనిచేయనుంది.

ప్రజారాజధాని అమరావతికి రాచబాట తెరుచుకుంది. రాజధాని రవాణా వ్యవస్థకు కీలకమైన ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్ ను, స్టీల్ బ్రిడ్జిలను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించారు.#AmaravatiUnstoppable#SeedAccessRoad#E3Road#SteelBridge#Amaravati#Chandrababunaidu#Andhrapradeshpic.twitter.com/0ytlFp7yl5

— Telugu Desam Party (@JaiTDP) August 13, 2026

55
అమరావతిని ఎవరూ ఆపలేరు: చంద్రబాబు
Image Credit : Asianet News

అమరావతిని ఎవరూ ఆపలేరు: చంద్రబాబు

సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రైతుల భూసమీకరణను ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంలో అనిశ్చితి నెలకొందని, శివరామకృష్ణన్ కమిటీ ప్రక్రియ తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని ఆయన గుర్తుచేశారు. రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వాములను చేయాలనే ఆలోచనతో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుపై స్పందించిన రైతులు కేవలం 58 రోజుల్లోనే పెద్ద సంఖ్యలో భూములు ఇచ్చారని, 29 వేల మంది రైతులు సుమారు 33 వేల ఎకరాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.

అమరావతిని ఇక ఎవరూ ఆపలేరని సీఎం వ్యాఖ్యానించారు. నీటి సమస్యలు లేని రాజధానిగా, విద్యుత్ వైర్లు, స్తంభాలు బయట కనిపించకుండా భూగర్భ మౌలిక వసతులతో ఆధునిక నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గ్యాస్ సహా పలు యుటిలిటీలను భూగర్భంలోనే ఏర్పాటు చేసేలా ప్రణాళికలు ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌లో సైబరాబాద్, హైటెక్ సిటీ అభివృద్ధి సమయంలో ఎదురైన విమర్శలను కూడా చంద్రబాబు గుర్తుచేశారు. అప్పట్లో ఆ ప్రాజెక్టులను కొందరు విమర్శించినా, ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. అదే తరహాలో అమరావతిని కూడా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

అమరావతిలో అన్నీ గ్రాఫిక్సే అని ఎగతాళి చేసిన వాళ్ళు ఆ గ్రాఫిక్సే నిజమై కళ్ళెదురుగా నిలవడం చూస్తున్నారు. 
- ఏపీ సీఎం చంద్రబాబుగారు#AmaravatiUnstoppable#SeedAccessRoad#E3Road#SteelBridge#Amaravati#Chandrababunaidu#Andhrapradeshpic.twitter.com/JOL7TQlRR2

— Telugu Desam Party (@JaiTDP) August 13, 2026

అమరావతిని పర్యావరణహిత నగరంగా, గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం ఉందని సీఎం తెలిపారు. గతంలో అమరావతి నిర్మాణాన్ని ‘గ్రాఫిక్స్’ అంటూ విమర్శించిన వారు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా చూడాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అమరావతి నిర్మాణం తొలి అడుగుగా నిలుస్తుందని, రాజధానితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
నారా చంద్రబాబు నాయుడు
Latest Videos
Recommended Stories
Recommended image1
Pilot Training : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... ఇకపై ఈజీగా మీ పైలట్ కలను నిజం చేసుకోవచ్చు
Recommended image2
Now Playing
బాబుని చూసి ఒక్కసారిగా లేచి దండంపెట్టిన మహిళలు | Asianet News Telugu
Recommended image3
Now Playing
ఆల్ రౌండర్ సీఎం | CM Chandrababu Dance | Asianet News Telugu
Related Stories
Recommended image1
Highway: ఇక‌పై ఆ దేశాల‌కు కారులో వెళ్లిపోవ‌చ్చు.. 1360 కి.మీల భారీ ర‌హ‌దారి నిర్మాణం
Recommended image2
ఈ అగ్గిపుల్ల‌ను ఎన్నిసార్లు వెలిగించినా వెలుగుతూనే ఉంటుంది.. బెస్ట్ కిచెన్ గ్యాడ్జెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved