పాడవకుండా ఉండాలని గుడ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా? ఏమౌతుందో తెలుసా?

పాలు, పండ్లు, అన్నం, కూరలతో పాటుగా గుడ్లను కూడా ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. బయటుంటే తొందరగా పాడవుతాయని ఆలా గుడ్లను ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? 
 

why not keep eggs in fridge rsl

ఈ రోజుల్లో దాదాపుగా ప్రతి ఒక్కరూ ఫ్రిజ్ ను వాడుతున్నారు. సాధారణంగా ఫ్రిజ్ లో పండ్లు, కూరగాయలతో పాటుగా, పిండి, మసాలా దినుసులు, చింతపండు, స్వీట్లు, కూల్ డ్రింక్స్ తో పాటుగా కొన్ని రకాల మందులను కూడా పెడుతుంటారు. కొంతమంది అయితే ఏవి పడితే అవి ఫ్రిజ్ లో పెట్టేసి ఖాళీ లేకుండా చేస్తారు. నిజానికి బయటికంటే ఫ్రిజ్ లోపలే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. బయట వారం రోజుల్లోనే పాడైపోతుంటాయి. అయితే గుడ్లను కూడా చాలా మంది ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. దీనివల్ల గుడ్లు చాలా రోజులు పాడవకుండా ఉంటాయి. కానీ ఇలా చేయడం మంచిదా? కాదా? అని ఎప్పుడైనా ఆలోచించారా? 

చాలా మందికి గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఫ్రిజ్ లో పెట్టడం అలవాటు. కానీ గుడ్డైనా లేక ఏ వస్తువైనా దాని గడువులోగా పాడవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కానీ వీటి గడువు కాలాన్ని పొడిగించి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లను ఫ్రిజ్ లో పెట్టేసి చాలా రోజులు తినడం వల్ల మనకు లేనిపోని వ్యాధులు వస్తాయని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అసలు గుడ్లను ఫ్రిజ్ లో ఎందుకు పెట్టకూడదో తెలిస్తే షాక్ అవుతారు. 

గుడ్లను ఫ్రిజ్ లో ఎందుకు పెట్టకూడదు? 

why not keep eggs in fridge rsl

గుడ్లలో బ్యాక్టీరియా

సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా గురించి వినే ఉంటారు. ఇది ఎక్కువగా జంతువుల పేగుల్లో ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళితే తీవ్రమైన విరేచనాలు అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా కూడా గుడ్లలో ఉంటుంది. అందుకే గుడ్లను పచ్చిగా అస్సలు తినకూడదు. అలాగే గుడ్డును బాగా ఉడికించి మాత్రమే తినాలి. ఈ బ్యాక్టీరియా గనుక మన శరీరంలోకి వెళితే మనం ఎన్నో ప్రాణాంతక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

కోళ్లలో ఉండే సాల్మొనెల్లా అనే సూక్ష్మజీవి మనం తినే ఆహారంలో కలిస్తే వాంతులు, విరేచనాలు అవుతాయి.ఈ బ్యాక్టీరియా కోడి గుడ్ల ఉపరితలం, గుడ్లు లోపలి భాగంలో కూడా ఉంటుంది. అందుకే ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఉండే ఈ బ్యాక్టీరియా ఇతర ఆహారాలకు చేరి మీ కడుపులోకి వెళ్లొచ్చు.

మంచి గుడ్లని ఎలా తెలుసుకోవాలి?

నీళ్లను ఉపయోగించి మీరు గుడ్డు ఫ్రెష్ గా ఉందా? లేదా? అన్న సంగతిని ఈజీగా తెలుసుకోవచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. గుడ్లు మునిగేలా ఒక బౌల్ లో నీళ్లను తీసుకోండి. దీంట్లో గుడ్లను వేయండి. గుడ్లు తాజాగా ఉంటే అవి మునిగిపోతాయి. అదే పాడైపోతే నీళ్లపైకి తేలుతాయి. 

ఫ్రిజ్ లో గుడ్లను ఎలా పెట్టాలి? 

గుడ్లను గది ఉష్ణోగ్రత వద్ద పెడితే అవి తొందరగా పాడైపోతాయి. అందుకే వీటిని శీతలీకరించడం మంచిది. ఇది గుడ్డులోని టాక్సిన్స్  ను నివారిస్తుంది. గుడ్లలో ఉండే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఫ్రిజ్ లో పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి వీటిని ఫ్రిజ్ లో పెట్టడం మంచిదని చెప్తారు. గుడ్లను ఫ్రిజ్లో ఉంచడం వల్ల గుడ్డులోని ఖనిజాలు, ఇతర పోషకాలు కొన్ని రోజుల తర్వాత కూడా మీరు పొందొచ్చు. అయితే ఒక్కోసారి మాత్రం ఫ్రిజ్ లో గుడ్లను పెడితే వాటి రుచి మారుతుంది. ముఖ్యంగా రుచి పుల్లగా మారే అవకాశం ఉంది. కానీ గది ఉష్ణోగ్రత టేస్ట్ ఏ మాత్రం మారదు. 

ఫ్రిజ్ లో ఉంటే  గుడ్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా నుంచి రక్షించబడతాయి. సాధారణంగా శీతలీకరించిన గుడ్లు 28 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. అయితే గది ఉష్ణోగ్రత వద్ద మాత్రం గుడ్లు చాలా త్వరగా కుళ్లిపోతాయి. అలాగే వాతావరణాన్ని బట్టి ఎగ్ టేస్ట్ కూడా మారుతుంది.  అయితే గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న గుడ్డుకున్న సాల్మొనెల్లా మరొక గుడ్డు కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితిలో శీతలీకరణం సూక్ష్మజీవుల వ్యాప్తిని నిరోధిస్తుంది. 

గుడ్లను ఎలా నిల్వ చేయాలి? 

why not keep eggs in fridge rsl

గుడ్లను కొని వాటిని ఎగ్ కార్టన్ లో నిల్వ చేయండి. లేదా గుడ్లను నిల్వచేసే పరికరంలో పెట్టండి. ఇకపోతే గుడ్లను ఎప్పుడూ కూడా ఫ్రిజ్ లో దిగువ భాగంలోనే పెట్టండి.గుడ్లను ఫ్రిజ్ లో పెట్టే ముందు వాటిని కడగడం లాంటివి చేయకండి. ఎప్పుడైనా సరే గుడ్లను 3 నుంచి 5 వారాల్లోనే ఉపయోగించండి. ఇంతకు మించి ఫ్రిజ్ లో పెట్టకండి. 

ఇంట్లో గుడ్లు ఎన్ని రోజుల వరకు పాడవకుండా ఉంటాయి? 

ఇంట్లో ఉంచిన గుడ్లను రెండు రోజుల్లోనే తినేయడం మంచిది. మీరు దుకాణం నుంచి గుడ్లను కొంటే వాటిని కొన్న వెంటనే ఉడికించి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం మంచిది కాదు. మీరు గుడ్లను ఉడకబెట్టాలనుకుంటే వాటిని ఫ్రిజ్ లో పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే ఫ్రిజ్ లో ఉంచిన గుడ్ల కంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన గుడ్డులోని తెల్లసొన టేస్టీగా ఉంటుంది.

గుడ్లను ఫ్రిజ్ లో ఎందుకు ఉంచకూడదు?

ఫ్రిజ్ డోర్ ను ఎప్పుడూ తెరవడం, మూయడం వల్ల ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇది గుడ్లను దెబ్బతీస్తుంది. ఫ్రిజ్ లోని తేమ గుడ్లలో తేమ శాతాన్ని పెంచుతుంది. దీంతో బ్యాక్టీరియా పెరుగుతుంది. అయితే ఫ్రెష్ ఎగ్స్ ను  వెంటనే శీతలీకరించాల్సిన అవసరం లేదు. వీటిని ఆరుబయట ఉంచి కూడా వాడుకోవచ్చు. మీకు తెలుసా? గుడ్లు ఇతర ఆహారాల పదార్థాల నుంచి వాసనలను, రుచులను గ్రహించగలవు. ఇకపోతే ఏ ఆహారాలైనా ముఖ్యంగా గుడ్లను ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో ఉంచకూడదు. ఇది మీ శరీరానికి హాని చేస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios