వీళ్లకు పెరుగు విషం లాంటిది.. అస్సలు తినొద్దు

పెరుగులో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉంటాయనేది నిజం. కానీ కొంతమందికి ఈ పెరుగు స్లో పాయిజన్ లా పనిచేస్తుంది. అందుకే వీళ్లు పెరుగును అస్సలు తినకూడదు. 
 

Who Should Not Eat Curd: Exploring the Potential Side Effects of Curd rsl

పెరుగు హెల్తీ ఫుడ్. దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో మంచి బ్యాక్టీరియా కూడా మెండుగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు సహాయపడుతుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. 

పెరుగులో కాల్షియంతో పాటుగా భాస్వరం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంట పెరుగును తింటే ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. అలాగే ఎముకల సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పాలను పులియబెట్టి పెరుగును తయారుచేసే కిణ్వ ప్రక్రియ ప్రక్రియ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రక్రియ పాలను ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు,  ఖనిజాలు ఎక్కువగా ఉండే క్రీమీలా, పెరుగులా మారుస్తుంది. 

నిజానికి పెరుగును తినడం వల్ల ఒకటి కాదు రెండు కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పెరుగును తింటే మన జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటుగా మన ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. అలాగే ఎముకలు బలంగా ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. 

రోజూ భోజనంలో పెరుగును తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి

Who Should Not Eat Curd: Exploring the Potential Side Effects of Curd rsl

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

పెరుగులో ప్రోబయోటిక్స్ మెండుగా ఉంటాయి. ఇవి గట్ మైక్రోబయోమ్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. హెల్తీ గట్ మైక్రోబయోమ్ మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణం కావడానికి, ఆహారంలోని పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణశయాంతర సమస్యలు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

పెరుగులోని ఉండే ప్రోబయోటిక్స్ యాంటీ బాడీస్ ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే  రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపరిచి మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే మీకు అంటువ్యాధులు, ఇతర రోగాలొచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఒకవేళ వచ్చినా వీటితో మీ శరీరం సమర్థవంతంగా పోరాడుతుంది.

ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తుంది

పెరుగులో ఉండే కాల్షియం, భాస్వరం ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే ఎముక సాంద్రతను నిర్వహించడానికి కూడా బాగా సహాయపడుతుంది. పెరుగును తింటే ఎముకల పగుళ్లు వచ్చే రిస్క్ తగ్గుతుంది. 

బరువు తగ్గడానికి 

పెరుగులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ కడుపును తొందరగా నింపుతుంది. అలాగే మీరు కేలరీలు తీసుకోవడాన్ని కూడా తగ్గిస్తుంది. మొత్తంగా ఇది మీ ఆకలిని చాలా వరకు తగ్గించి అతిగా తినకుండా చేస్తుంది.అంటే ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందన్న మాట. 

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

పెరుగులో ఉండే కార్భోహైడ్రేట్లు, ప్రోటీన్ మీ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీంతో మీ రక్తప్రవాహంలోకి చక్కెరను స్లోగా విడుదల అవుతుంది. అంటే అకస్మత్తుగా మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగ అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అంటే పెరుగు డయాబెటీస్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. 

ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ గట్, మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మీ మానసిక స్థితిని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇది మీ ఒత్తిడిని, యాంగ్జైటీని తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. 

శరీరాన్ని హైడ్రేట్ ఉంచుతుంది

పెరుగులో వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంటే దీన్ని తింటే మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. పెరుగును తింటే శారీరక విధులు సక్రమంగా జరుగుతాయి. అలాగే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. డీహైడ్రేషన్ వచ్చే సమస్యే ఉండదు. 

పెరుగును ఎవరు తినకూడదు?

Who Should Not Eat Curd: Exploring the Potential Side Effects of Curd rsl

ఆర్థరైటిస్: ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు ఉన్నవారు పెరుగును తినకూడదంటారు డాక్టర్లు. పెరుగులో ఎముకలను ఆరోగ్యంగా ఉంచే కాల్షియం ఉన్నప్పటికీ.. పెరుగును తింటే కీళ్ల నొప్పులు మరింత పెరుగుతాయి. అందుకే పెరుగుకు బదులుగా మజ్జిగను తాగండి. ఆరోగ్యంగా ఉంటారు. 

ఉబ్బసం: ఉబ్బసం ఉన్నవారు పెరుగును తినకపోవడమే మంచిది. ఎందుకంటే పాల పదార్థాలుఉబ్బసం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే మీరు పెరుగును తినకూడదు. 

ల్యూకోరియా: మీకు ల్యూకోరియా ఉన్నా కూడా పెరుగును అసలే తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ిది మీ సమస్యను మరింత పెంచుతుంది. 

అధిక కొలెస్ట్రాల్: ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కూడా పెరుగును తినకూడదు. ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఉన్న పెరుగును తింటే శరీరంలో కొలెస్ట్రాల్ మరింత పెరుగుతుంది. అందుకే వీళ్లు పెరుగుకు బదులుగా మజ్జిగను తాగొచ్చు. 

మలబద్ధకం: పెరుగు మన గట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయినప్పటికీ.. మీకు మలబద్దకం, గ్యాస్,  ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు ఉంటే పెరుగును అసలే తినకండి. ఎందుకంటే ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios