ఎయిర్ ఫ్రై వాడుతున్నారా..? అందులో ఏ నూనెలో వాడాలో తెలుసా?
నూనె తక్కువగా పట్టడం, చెయ్యడం కూడా సులభంగా ఉండటంతో ప్రతి ఒక్కరూ ఎయిర్ ఫ్రై ని ఈజీగా కొనేసుకుంటున్నారు. కానీ.. ఆ ఎయిర్ ఫ్రై లో ఎలాంటి ఆయిల్ వాడాలో మీకు తెలుసా?
ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అందుకే.. వీలైనంత వరకు తక్కువ ఆయిల్ ఉండే ఫుడ్స్ తినడానికి, వండే ఆహారం లో తక్కువ నూనె ఎలా వాడాలా అని చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మనందరికీ ఎయిర్ ఫ్రయ్యర్లు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి వరకు.. పూరీ చేయాలన్నా, ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించి పెట్టాలన్నా... కలాయి నిండా నూనె పోసి వేయించాల్సిందే. లేదేంటే.. అవి తయారవ్వవు. కానీ.. ఎయిర్ ఫ్రై వచ్చిన తర్వాత వీటి వంట కాస్త సులభం అయ్యిందనే చెప్పొచ్చు.
నూనె తక్కువగా పట్టడం, చెయ్యడం కూడా సులభంగా ఉండటంతో ప్రతి ఒక్కరూ ఎయిర్ ఫ్రై ని ఈజీగా కొనేసుకుంటున్నారు. కానీ.. ఆ ఎయిర్ ఫ్రై లో ఎలాంటి ఆయిల్ వాడాలో మీకు తెలుసా? ఏ నూనె వాడితే అవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయో తెలుసుకుందాం..
ఎయిర్ ఫ్రై లో చికెన్ లేదంటే, ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టే సమయంలో... ఒక స్పూన్ అంతకంటే.. తక్కువ నూనె వాడాలని అనుకుంటాం. మీరు ఎయిర్‌ఫ్రైయర్‌లో వండే ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా చికెన్‌ను కవర్ చేయడానికి మీకు కొంత నూనె అవసరం, నెయ్యిని ఉపయోగించండి, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ స్మోకింగ్ పాయింట్‌ను కలిగి ఉంటుంది. దాని వల్ల.. ఆహారం పాయిజన్ గా మారుతుందనే భయం అవసరం లేదు.
అలా కాకుండా.. తక్కువ స్మోకింగ్ పాయింట్ ఉన్న నూనెను ఎంచుకోవడం వల్ల... ఆ ఫుడ్ నుంచి విషపూరితమైన పొగలు వచ్చే అవకాశం క్లియర్ గా ఉంది. అందుకే...స్మోకింగ్ పాయింట్ తక్కువగా ఉండే నూనెను వాడకూడదు. నూనె తీసుకునే క్వాంటిటీ తక్కువగా ఉండటంతో పాటు.. స్మోకింగ్ పాయింట్ కూడా కచ్చితంగా చూసుకోవాలి.
నిజానికి ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఆలివ్ చెట్ల పండ్ల నుంచి తయారు చేస్తారు. అందుకే ఇది ఆరోగ్యకరమైనదిగా చెబుతారు. ఆలివ్ ఆయిల్ అధిక మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ (MUFA) కంటెంట్ కారణంగా గుండెకు అనుకూలమైనది, ఇది స్ట్రోక్ , గుండె జబ్బులను నివారిస్తుంది.
ఆలివ్ ఆయిల్ కూడా 215 డిగ్రీల సెల్సియస్ అధిక స్మోక్ పాయింట్‌ను కలిగి ఉంటుంది, ఇది విషపూరిత సమ్మేళనాలుగా క్షీణించకుండా అధిక వేడి వంటకు అనుకూలంగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఎల్‌డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను ఆక్సీకరణం నుండి రక్షిస్తాయి, గుండె జబ్బుల పెరుగుదలను నివారిస్తాయి. కాబట్టి... స్మోకింగ్ పాయింట్ ని బట్టి.. కుకింగ్ చేసుకుంటే.. ఎలాంటి భయం ఉండదు.
- Best Cooking Oil For Cholesterol
- Best Cooking Oil Options
- Best Cooking Oils For Health
- Best cooking oil
- Best cooking oil in Ayurveda
- Best cooking oil to choose
- air fryer
- best cooking oil for air fryer
- best cooking oil for diabetes
- best cooking oil for health
- best cooking oil for heart
- best cooking oil for reuse
- best cooking oil for weight loss
- cooking oil
- ghee
- oil