బరువు తగ్గాలి అనుకున్నవాళ్లు.. ఏ సమయంలో తినాలి..?
మనం ఎంత హెల్దీ ఆహారం తీసుకున్నా కూడా.. దానిని ఏ టైమ్ కి తీసుకోవాలి అనే విషయం తెలుసుకోవాలి. సరైన సమయానికి భోజనం చేసినప్పుడు మాత్రమే.. ఈజీగా బరువు తగ్గలరని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలి అని చాలా మంది ఈ మధ్య చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కఠినమైన వ్యాయామాలు చేయడం దగ్గరి నుంచి , తిండి మానేయడం వరకు చాలా చేస్తూ ఉంటారు. తీసుకునే ఆహారంలో కేలరీలు తగ్గించుకోవడం కోసం చాలా చేస్తారు. అర్థరాత్రి స్నాక్స్ కి దూరంగా ఉంటారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా.. ఇంకా బరువు తగ్గడం లేదు అని వారు ఫీలౌతూ ఉంటారు. దీనికి కారణం ఉంది. మనం ఎంత హెల్దీ ఆహారం తీసుకున్నా కూడా.. దానిని ఏ టైమ్ కి తీసుకోవాలి అనే విషయం తెలుసుకోవాలి. సరైన సమయానికి భోజనం చేసినప్పుడు మాత్రమే.. ఈజీగా బరువు తగ్గలరని నిపుణులు చెబుతున్నారు.
సరైన సమయానికి భోజనం ఎందుకు చేయాలి..?
బరువు తగ్గడానికి క్యాలరీ తక్కువ ఉన్న ఆహారం మాత్రమే అవసరం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. మీరు ఎప్పుడు తింటారు అనేది కచ్చితంగా గమనించాలి. పగటిపూట తీసుకునే ఆహారం చాలా సులభంగా జీర్ణం అవుతుంది. పోషకాలను గ్రహించడానికి కూడా సులభం చేస్తుంది. అందుకే.. మనం ఎలాంటి ఫుడ్ ఏ టైమ్ లో తింటున్నాం అనేది చాలా ముఖ్యం. టైమ్ కి మాత్రమే తినాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. బరువు కూడా తగ్గగలరు.
మీరు బరువు తగ్గాలి అనుకుంటే భోజనం చేయడానికి సరైన సమయం కోసం నోట్స్ తీసుకోండి. నిపుణుల ప్రకారం.. కచ్చితంగా అల్పాహారం తీసుకోవాలి. అది ఎక్కువగా కాకుండా నార్మల్ పరిమాణంలో తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం మాత్రం కాస్త ఎక్కువ మొత్తంలో తీసుకోవాలట.రాత్రి భోజనం మాత్రం చాలా తక్కువగా తీసుకోవాలి. రాత్రిపూట ఎక్కువగా తింటే.. బరువు తగ్గకపోగా.. పెరగడానికి, ఒంట్లో కొవ్వు పేరుకుపోవడానికి కారణం అయ్యింది.
బరువు తగ్గకపోవడానికి ఇవి కూడా కారణాలే..
ఏం చేసినా బరువు తగ్గడం లేదు అంటే మీ అలవాట్లు కూడా కారణం కావచ్చు.ఆహారం, భోజన సమయాలు ముఖ్యమైనవి అయితే, మీరు గుర్తుంచుకోవలసిన మరో రెండు అంశాలు ఉన్నాయి.
1. నిద్ర అవును, నిద్ర మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని చేయవచ్చు. ఎంఎందుకంటే మీ శరీరంలో గ్రెలిన్, లెప్టిన్ అనే రెండు హార్మోన్లు ఉంటాయి. మొదటిది మనకు ఆకలిగా ఉన్నప్పుడు చెబుతుంది. రెండవది మనం నిండినప్పుడు చెబుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు సరిగ్గా నిద్రపోనప్పుడు, ఈ రెండు హార్మోన్లు ప్రభావితమవుతాయి. సమతుల్యత దెబ్బతింటుంది, ఇది అతిగా తినడం, అర్ధరాత్రి కోరికలకు దారితీస్తుంది.
2. హైడ్రేషన్ చాలా సందర్భాలలో, మీకు దాహం, ఆకలి ఉండదు, కాబట్టి మీరు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు అనే దానిపై నిర్ణయం తీసుకునే ముందు ఒక గ్లాసు నీరు త్రాగండి. అంతేకాకుండా, సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య మీ తినే విండోను 8-12 గంటలకు తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.