Asianet News TeluguAsianet News Telugu

మినపప్పు రోజూ తింటే ఏమౌతుంది..?

  ఎక్కువగా.. మినపప్పు తింటే ఏమౌతుంది..? ఆరోగ్యానికి మంచిదేనా..? లేదా ఏమైనా సమస్యలు వస్తాయా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో  చూద్దాం..
 

What Happens if You eat Urad dal Every day ram
Author
First Published Aug 23, 2024, 1:40 PM IST | Last Updated Aug 23, 2024, 1:40 PM IST

మనలో చాలా మంది రెగ్యులర్ గా మినపప్పు తింటూ ఉంటారు. ఈ పప్పుతో మనం ఇడ్లీ, దోశ, వడ లాంటివి చాలా చేసుకుంటూ తింటూ ఉంటాం. ఇవన్నీ ఆరోగ్యమే. కానీ..  ఎక్కువగా.. మినపప్పు తింటే ఏమౌతుంది..? ఆరోగ్యానికి మంచిదేనా..? లేదా ఏమైనా సమస్యలు వస్తాయా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో  చూద్దాం..

మినపప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అయితే.. ప్రోటీన్ మాత్రమే కాదు.. ఫ్యాట్ , కార్బో హైడ్రేట్స్, విటమిన్ బి, ఐరన, ఫోలిక్ యాసిడ్ , మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే ఎక్కువగా తతినడం వల్ల.. ఒంట్లో ఫ్యాట్ పెరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారు.. కాస్త లిమిట్ గా తినడమే మంచిది.

మరీ ఎక్కువగా మినపప్పు తినడం వల్ల.. ఎముకల నొప్పి వస్తూ ఉంటుంది. ఎవరికైతే ఆర్థరిటీస్ ఉంటే.. వాళ్లు ఎక్కువగా మినపప్పు తినకుండా ఉండకపోవడమే మంచిది.

మీరు నమ్మరు కానీ.. మినపప్పు ఎక్కువగా తీసుకుంటే... శరీరంలో  యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోతుందట. అందుకే.. ఆ సమస్య ఉన్నవారు కూడా ఎక్కువగా తినకపోవడమే మంచిది.

అంతేకాదు.. ఎక్కువగా మినపప్పు తినడం వల్ల చాలా మందికి అజీర్ణ సమస్యలు కూడా వస్తాయట. ఎవరికైతే గ్యాస్, మలబద్దం, అజీర్ణ సమస్యలు ఉంటే.. వారు ఎక్కువ గా మినపప్పు తినకపోవడమే మంచిది.

అంతేకాదు.... మినపప్పు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీల్లో రాళ్ల సమస్యలు కూడా వస్తాయట. మీకుఆల్రెడీ కిడ్నీల్లో  రాళ్ల సమస్య ఉంటే వాళ్లు తినకపోవడమే మంచిది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios