Asianet News TeluguAsianet News Telugu

కార్న్ ఫ్లోర్ తింటే ఏమౌతుందో తెలుసా?

క్రంచ్ నెస్ కోసం కార్న్ ఫ్లోర్ బాగా ఉపయోగిస్తారు. ఇది మన ఆరోగ్యానికి మేలే చేస్తుంది. కానీ అతిగా తింటే మీరు ఎన్నో సమస్యల బారిన పడక తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మొక్క జొన్న పిండిని ఎక్కువ తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

What happens if you eat corn flour every day? rsl
Author
First Published Jul 4, 2024, 10:30 AM IST

మొక్కజొన్న పిండిని ఎన్నో రకాల వంటకాలకు ఉపయోగిస్తారు. ఇది ఫుడ్ కు క్రంచ్ నెస్ ను తీసుకొస్తుంది. అందుకే చికెన్, ఫిష్, కాలీఫ్లవర్, బంగాళాదుంప వంటి చాలా ఆహారాలకు మొక్కజొన్న పిండిని ఉపయోగిస్తుంటారు. కానీ దీన్ని మోతాదుకు మించి తింటే మాత్రం మీరు ఎన్నో సమస్యల బారిన పడతారని నిపుణులు అంటున్నారు. మొక్కజొన్న పిండి మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం పదండి.

ఎక్కువ కేలరీలు, ప్రోటీన్లు తక్కువగా: ఒక కప్పు మొక్కజొన్న పిండిలో దాదాపుగా 490 కేలరీలు, 120 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఈ మొక్కజొన్న పిండిలో ప్రోటీన్లు, విటమిన్లు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యంగా ఉంచడం కంటే , ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే ఎక్కువగా ఉంటుంది. 

బరువు పెరగడం: బరువు మాత్రం పెరగకూడదనుకునేవారు చాలా మందే ఉన్నారు. కానీ మొక్క జొన్న పిండిని ఎక్కువగా తింటే మాత్రం మీరు ఖచ్చితంగా బరువు పెరిగిపోతారు. ఎందుకంటే ఈ పిండిలో కార్బోహైడ్రేట్లు,  కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే దీన్ని ఎక్కువగా తింటే మీరు బరువు విపరీతంగా పెరుగుతారు. 

డయాబెటీస్ : డయాబెటీస్ పేషెంట్లకు మొక్కజొన్న పిండి అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ పండిలో  కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ బరువును పెంచడంతో పాటుగా మీకు డయాబెటీస్ వచ్చేలా చేస్తుంది. ఈ పిండిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. 

గుండె జబ్బులు:  మొక్కజొన్న పిండి ప్రాసెస్ చేయబడుతుంది. కాబట్టి ఈ పండిలో ఫైబర్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉండవు. అందుకే ఈ పిండిని రోజూ తింటే గుండెకు సంబంధించిన  సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

జీర్ణ సమస్యలు:  మొక్కజొన్న పిండిని రోజూ, ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గ్యాస్, విరేచనాలు లేదా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు ఈ పిండి వల్ల వచ్చే అవకాశం ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios