Asianet News TeluguAsianet News Telugu

రోజూ 2 నానబెట్టిన బాదం పప్పులను తింటే ఏమౌతుందో తెలుసా?

నట్స్ లో ఒకటైన బాదం పప్పులను తింటే మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.కాగా మీరు రోజూ రెండు నానబెట్టిన బాదం పప్పులను గనుక తింటే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు.
 

 what happens if you eat 2 soaked almonds daily? rsl
Author
First Published Jul 7, 2024, 2:36 PM IST | Last Updated Jul 7, 2024, 2:36 PM IST

బాదంలో మనల్ని హెల్తీగా ఉంచే ఆరోగ్యకరమైన కొవ్వులు,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ప్రతిరోజూ రెండు నానబెట్టిన బాదంపప్పులను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పోషకాలు: బాదం పప్పుల్లో మన శరీరానికి అవసరమైన రకరకాల ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ లో  విటమిన్ ఇ, మెగ్నీషియం, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందుంటాయి. 

జీర్ణక్రియ: నానబెట్టిన బాదం పప్పులను రోజూ రెండు తినడం వల్ల మీ ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. దీనివల్ల మలబద్దకం అనే సమస్యే ఉండదు. మలబద్దకంతో బాధపడేవారికి ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 

చర్మ ఆరోగ్యం: బాదంపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది మన చర్మాన్ని మృదువుగా మార్చడానికి బాగా సహాయపడుతుంది. ఇది ముఖంపై ముడతలను, గీతలను తగ్గించడానికి సహాయపడుతుంది. 

మెదడు పనితీరు: బాదం పప్పుల్లో రిబోఫ్లావిన్, ఎల్ కార్నిటైన్ వంటి కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మన మెదడు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిని రోజూ తింటే మెమోరీ పవర్ కూడా తగ్గుతుంది. 

బరువు నియంత్రణ: బాదం పప్పుల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. రోజూ నానబెట్టిన బాదం పప్పులను తింటే మీ ఆకలి అదుపులో ఉంటుంది. దీంతో మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది. 

గుండె ఆరోగ్యం: రోజూ బాదం పప్పులను తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాదంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం శరీరంలో రక్త ప్రసరణను సులభతరం చేస్తాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios