Asianet News TeluguAsianet News Telugu

జీడిపప్పు, బాదం, వాల్ నట్స్ ను కలిపి తింటే ఏమౌతుందో తెలుసా?

నట్స్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. చాలా మంది వీటిని రోజూ తింటుంటారు. అయితే బాదం, వాల్ నట్స్, జీడిపప్పును కలిపి తింటే ఏమౌతుందో తెలుసా? 
 

 what happens if we eating almonds cashews and walnuts daily rsl
Author
First Published Aug 23, 2024, 9:39 AM IST | Last Updated Aug 23, 2024, 9:39 AM IST

జీడిపప్పు, బాదం, వాల్ నట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ నట్స్ ను తింటే మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. ఎన్నో సమస్యలను తగ్గించుకోగలగుతాం. అయితే మనం ఎన్నో రకాల నట్స్ ను కలిపి తింటుంటాం. అయితే జీడిపప్పు, బాదం, వాల్ నట్స్ ను కలిపి రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా? 

మనసు ఆరోగ్యం: జీడిపప్పులో భాస్వరం, మెగ్నీషియం లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మెదడుకు ఎంతో అవసరమైన పోషకాలు. ఇకపోతే వాల్ నట్స్, బాదం పప్పుల్లో విటమిన్ -ఇ,  ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఇవి మన మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వీటిని తింటే మన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మెదడు ఆరోగ్యగా ఉంటుంది. 

గుండె ఆరోగ్యం: జీడిపప్పులో మోనోశాచురేటెడ్ కొవ్వు పుష్కలంగా ఉంటుంది. అదే బాదం పప్పులో ఫైబర్ కంటెంట్, వాల్ నట్స్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మూడూ మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీడిపప్పును తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బాదం పప్పు తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వాల్ నట్స్ ను తింటే రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గుతుంది. 

మెరుగైన జీర్ణక్రియ: జీడిపప్పులో ఉండే ఫైబర్ మన జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. బాదం పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, వాల్ నట్స్ లో ఉండే ఎంజైమ్స్ తిన్న ఫుడ్ సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడతాయి. 

షుగర్ నియంత్రణ : జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే వాల్ నట్స్, బాదంలో ఫైబర్, ఒమేగా -3 మొదలైనవి మెండుగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను పెంచడానికి సహాయపడతాయి.

అతిగా తినడం తగ్గుతుంది: జీడిపప్పు, బాదం, వాల్ నట్స్ లో ప్రోటీన్,  ఫైబర్ లు మెండుగా ఉంటాయి. వీటిని తింటే కడుపు తొందరగా నిండుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. 

బరువు తగ్గుతారు:  బాదం, జీడిపప్పు,వాల్ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీవక్రియను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. వీటిని కలిపి తినడం వల్ల మీ బరువు అదుపులో ఉంటుంది.

ఎలా తినాలి: జీడిపప్ు, బాదం, వాల్ నట్స్ ను తీసుకుని రాత్రి పడుకునే ముందు నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటర్ ను ఒంపేసి పప్పులను పరిగడుపు బాగా నమిలి తినాలి. ఇవి మీకు రెట్టింపు ప్రయోజనాలను కలిగిస్తాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios