కూరలో కరివేపాకును తీసి పారేస్తున్నారా? అయితే మీరు ఈ లాభాలను మిస్ అయినట్టే..!
కూరలో కరివేపాకును ప్రతి ఒక్కరూ వేస్తారు. ఎందుకంటే ఇది కూరకు, కమ్మని వాసన, టేస్ట్ ను అందిస్తుంది కాబట్టి. కానీ చాలా మందికి కూరలో కరివేపాకును పక్కన పెట్టేసే అలవాటు ఉంటుంది. దీన్ని తినేవారు చాలా తక్కువ. కానీ కరివేపాకును తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
కూరల్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకును వేయడం చాలా సాధారణం. ఇవి కూరలను మరింత టేస్టీగా చేస్తాయి. కానీ కూరలో వేసిన ఈ ఆకులను ముఖ్యంగా కరివేపాకును తినకుండా పక్కన పెట్టేస్తుంటారు చాలా మంది. కానీ కరివేపాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కరివేపాకును తింటే బరువును తగ్గడం నుంచి జీర్ణ సమస్యల వరకు ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి.
కరివేపాకులో జీర్ణ ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనం తిన్న ఆహారం తొందరగా జీర్ణం అయ్యేందుకు సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మీరు సులువుగా బరువు తగ్గుతారు. అలాగే కడుపు నొప్పి, గ్యాస్ మొదలైన జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
కరివేపాకు ఆకలిని చాలా వరకు తగ్గిస్తుంది. దీంతో మీరు బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారికి కరివేపాకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. కరివేపాకును తింటే కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. అలాగే కరివేపాకు వాటర్ మన జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుంది. జీవక్రియ రేటు ఎక్కువగా ఉంటే శరీరంలోని కేలరీలను త్వరగా తగ్గుతాయి.
కరివేపాకు డయాబెటీస్ పేషెంట్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కరివేపాకులో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచే గుణాలు ఉంటాయి. కరివేపాకుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సమ్మేళనాలు ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, జీవక్రియను పెంచే బయోయాక్టివ్ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.
కరివేపాకులో కేలరీలు తక్కువగా ఉన్నా.. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఐరన్ లు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి..