Asianet News TeluguAsianet News Telugu

కూరలో నూనె తేలుతోందా.. ఈ సింపుల్ హ్యాక్ తో ఆ నూనె తీసేయవచ్చు..!

ఓ వ్యక్తి ట్విట్టర్ లో దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేయగా.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోని ఇప్పటి వరకు 110 వేల మంది వీక్షించగా.. 4వేల లైకులు వచ్చాయి.

Want To Remove Oil from curries? here is the crazy hack every one must try
Author
Hyderabad, First Published Aug 20, 2021, 10:31 AM IST

ప్రస్తుత కాలంలో  అందరూ ఆరోగ్యానికే పెద్ద పీట వేస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు సైతం.. నూనె తక్కువగా ఉండే వంటలు తినాలని సూచిస్తున్నారు. ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా  ఒక్కోసారి కూరలో నూనె ఎక్కువగా పడిపోతూ ఉంటుంది. అలా పడిపోయిన తర్వాత కూరలో నుంచి నూనెను తీసేయలేక.. అలానే తినేస్తూ ఉంటాం. అయితే.. మనలాంటి వారికోసమే ఓ అమేజింగ్ హ్యాక్ ఒకటి కనిపెట్టారు.

ఓ చిన్ని చిట్కాతో.. కూరలో మిగిలిపోయిన నూనె మొత్తాన్ని తీసేసి.. హాయిగా.. మనం ఆరోగ్యంగా తినే అవకాశం ఉంది.  ఓ వ్యక్తి ట్విట్టర్ లో దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేయగా.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోని ఇప్పటి వరకు 110 వేల మంది వీక్షించగా.. 4వేల లైకులు వచ్చాయి.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే...  ఓ నాన్ వెజ్ కర్రీ ఉంది. అది గ్రేవీ కర్రీ కాగా.. దాంట్లో నూనే పైకి తేలుతూ కనపడుతోంది.  దాంట్లోని నూనెని.. పెద్ద ఐస్ ముక్కతో సులభంగా తొలగించేశారు.  కూరలో.. పెద్ద ఐస్ ముక్కను ముంచారు. దానికి నూనె గడ్డలాగా అతుక్కోవడం గమనార్హం. అలా నాలుగైదు సార్లు చేయడంతో.. కూరలో నూనె అంతా తొలగిపోవడం గమనార్హం.

ఈ వీడియోని  చూసి నెటిజన్లు తెగ ఇంప్రెస్ అవుతున్నారు. ఈ ఐడియా బలేగా ఉందే అంటూ.. సంబరపడుతున్నారు. ఈ వీడియో నచ్చి.. ఇతరులకు కూడా తెగ షేర్ చేస్తుండటం గమనార్హం. కావాలంటే.. మీరు కూడా ఈ వీడిపై ఓ కన్నేయండి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios