అల్లం ఇలా తీసుకుంటే.. ఈజీగా బరువు తగ్గుతారు..!

బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషించడంలో అల్లం మనకు బాగా సహాయపడుతుంది.

Use ginger in these 3 ways to lose weight ram

అధిక బరువు ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తుున్న సమస్య. మనం సరైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోవడం, బయటి ఆహారాలు తినడం వల్ల.. తెలీకుండానే బరువు పెరిగిపోతాం. అది కాస్త కొందరిలో ఉబకాయానికి దారితీస్తుంది. ఇక.. చివరగా పెరిగిపోయిన బరువును తగ్గించుకోవడానికి తిప్పలు పడుతూ ఉంటారు. ఇక కొందరు అయితే... అధిక బరువు తగ్గించేందుకు సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇది మాత్రం చాలా పెద్ద పొరపాటు. దీని వల్ల బరువు తగ్గడం కాదు.. ఇతర ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నవారు అవుతారు.

నిజానికి, బరువు తగ్గడం కోసం మీరు ఎక్కువ సేపు కడుపు మాడ్చుకొని ఆకలితో ఉండాల్సిన అవసరం లేదుద.. అలా అని ఖరీదైన ప్రోటీన్ ఫుడ్స్, శరీరంలో కొవ్వు కరిగించే సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన ఇంట్లో ముఖ్యంగా కిచెన్ లో ఉన్న కొన్ని పదార్థాలతోనే సులభంగా బరువు తగ్గించవచ్చు. మనకు ఈజీగా తక్కువ ఖర్చుతో లభించే.. ఔషద గుణాలు ఉన్న ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది. అలా.. బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషించడంలో అల్లం మనకు బాగా సహాయపడుతుంది.

Use ginger in these 3 ways to lose weight ram

సీజనల్ గా మనం చాలా రకాల జబ్బుల బారినపడుతూ ఉంటాం. జలుబు, దగ్గు లాంటివి ముందు వరసలో ఉంటాయి. అలాంటి  తగ్గించడం దగ్గర నుంచి.. జీర్ణ సమస్యలు, కడుపులో నొప్పి వంటివి తగ్గించడం తోపాటు.. బరువు తగ్గించడంలోనూ అల్లం మనకు కీలకంగా  పని చేస్తుంది. అయితే.. ఆ అల్లం ఎలా తీసుకోవాలి అనే విషయం మాత్రం మనకు తెలిసి ఉండాల్సిందే. మరి.. అల్లం ఏ రూపంలో తీసుకుంటే.. మనం ఈజీగా బరువు తగ్గుతామో ఈ రోజు తెలుసుకుందాం..

బరువు తగ్గించే అల్లం టీ..

సులభంగా ఇంట్లోనే  మీరు అల్లం టీ తయారు చేసుకొని తాగడం వల్ల బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? ఈ టీ ని  మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే.. అల్లం టీ అంటే.. రెగ్యులర్ గా మనం పాలు, పంచదార వేసుకొని చేసుకునే టీ అయితే కాదు. అవి లేకుండా ఈ అల్లం టీ చేయాలి. అచ్చంగా అల్లం మాత్రమే నీటిలో మరిగించాలి. సుమారు రెండు అంగుళాల అల్లం నీటిలో వేసి మరిగించా.. సగానికి పైగా నీళ్లు తగ్గే వరకు మరిగించాలి. ఇప్పుడు ఆ నీటిని వడకట్టాలి. అంతే.. ఆ నీరు కాస్త చల్లారిన తర్వాత తాగేయడమే, కావాలంటే అందులో మీరు రుచి కోసం తేనే, నిమ్మరసం లాంటివి కలుపుకోవచ్చు. అల్లంలో మన శరీరంలో కొవ్వును కరిగించే గుణాలు చాలా ఉంటాయి.  అందుకే.. ఈ అల్లం టీ తాగడం వల్ల.. మీరు సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

Use ginger in these 3 ways to lose weight ram

పరుగడుపున అల్లం డీటాక్స్ వాటర్...

మీరు బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున అల్లంతో చేసిన డీటాక్స్ వాటర్ తాగినా కూడా ఈజీగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే..అల్లంలో యాంటీ ఒబేసిటీ గుణాలు ఉన్నాయి. ఇది మనకు ఉబకాయం తగ్గించడానికి సహాయం చేస్తుంది.   బరువు తగ్గాలంటే ఉదయాన్నే నీటిలో అల్లం వేసి మరిగించి అందులో నిమ్మరసం కలిపి తాగాలి. దీని వల్ల త్వరగా బరువు తగ్గడంతోపాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఈ పానీయం శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను కూడా తొలగిస్తుంది. బరువు తగ్గడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ వాటర్ తాగిన తర్వాత కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే.. మీకు మంచి ఫలితాలు కనపడతాయి.

అల్లం కషాయంతో బరువు తగ్గడం..

బరువు తగ్గడానికి, మీరు అల్లం, దాల్చినచెక్క , నల్ల మిరియాలు కలపడం ద్వారా కషాయాలను తయారు చేయవచ్చు. దీని కోసం, మీరు 1 దాల్చిన చెక్క ముక్క, 1 అల్లం ముక్క , 5-6 ఎండు మిరియాలు తీసుకోవాలి. ఇవన్నీ నీళ్లలో వేసి మరిగించి సగం మిగిలిపోయాక వడపోసి తాగాలి. ఈ డ్రింక్ తాగడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. పడుకునే ముందు దీన్ని తాగండి. మీరు కొన్ని వారాల్లో ప్రభావాన్ని చూడవచ్చు. వీటన్నింటితో పాటు సరైన ఆహారం కూడా ముఖ్యం. శరీరానికి కనీస వ్యాయామం ఉండటం కూడా అవసరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios