Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న మలై పాన్.. వీడియో..!

లక్నోలో ఓ వ్యక్తి విభిన్నంగా మలై పాన్ తయారు చేశాడు. దీని తయారు చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనినే మలైకి గిలోరీ లేదా.. బలైకి  గిలోరి అని కూడా పిలుస్తారు. 

The Making Of Lucknow's Special Malai Paan Has Left The Internet Amazed
Author
Hyderabad, First Published Jan 25, 2022, 12:40 PM IST

భారతీయులందరికీ.. స్వీట్లు అంటే.. మక్కువ కాస్త ఎక్కువగా ఉంటుందనేది అక్షర సత్యం. మన దేశంలో రకరకాల స్వీట్లు అందుబాుటలో ఉన్నాయి. ఒక్కో స్వీట్ కి ఒక్కో ప్రత్యేకత ఉంటుందనే విషయం కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనదేశంలో విభిన్న రాష్ట్రాలు ఉన్నట్లే.. ప్రతి రాష్ట్రానికీ.. ఏదో ఒక విభిన్న వంటకం ఉంటుంది. కాగా.. తాజాగా.. ఇంటర్నెట్ లో ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

లక్నోలో ఓ వ్యక్తి విభిన్నంగా మలై పాన్ తయారు చేశాడు. దీని తయారు చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనినే మలైకి గిలోరీ లేదా.. బలైకి  గిలోరి అని కూడా పిలుస్తారు. 

 

ఓ వ్యక్తి.. దీనిని అప్పటికప్పుడు తయారు చేసి.. ఓ వినియోగదారుడికి అందజేస్తున్న వీడియో ని సోషల్ మీడియాలో  షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది. ఈ వీడియో కి ఇప్పటి వరకు 1.9 మిలియన్ల వ్యూస్ రాగా.. 110వేల లైకుల వర్షం కురవడం గమనార్హం. దీనిని.. ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫుడ్ బ్లాగర్  @foodie_incarnate పేజీలో షేర్ చేశారు. 

ఈ మలై పాన్ తయారు చేయడానికి వారు చిక్కని పాలను దాదాపు గంటసేపు ఉడకపెట్టారు. ఆ తర్వాత...బొగ్గులతో నిప్పులు తయారు చేశారు. దానిపై ఓ ప్యాన్ పెట్టి...  దానిపై బాగా మరిగించిన పాలను పోయాలి. ఆ తర్వాత దానిని పాన్  ఆకారంలో.. ముక్కలుగా కత్తిరించి.. దానిలో.. బాదం, పిస్తా, జీడిపప్పు, యాలకులు, రాక్ షుగర్ వేసి.. నింపి.. పాన్ మాదిరి చుట్టారు. ఈ మిథాయ్ పాన్ కేజీ రూ.680 కి విక్రయిస్తున్నారు.   లక్నీలోని చౌక్ బజార్ లోని బారన్ వాలీలో దీనిని విక్రయిస్తున్నారు. దీని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని తయారీ విధానం కూడా ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios