Asianet News TeluguAsianet News Telugu

అప్పుడే చేసిన చపాతీ, మిగిలిపోయిన చపాతీ.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిదో తెలుసా?

మనలో చాలా మంది అప్పుడే చేసి వేడి వేడి చపాతీ, రొట్టెను తింటుంటారు. రాత్రిచేసిన చపాతీని ఉదయం తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఈ రెండింటిలో మన ఆరోగ్యానికి ఏది ఎక్కువ మంచిదో తెలుసా? 
 

stale vs fresh roti which is better for health rsl
Author
First Published Aug 22, 2024, 10:41 AM IST | Last Updated Aug 22, 2024, 10:41 AM IST

మనందరి ఇండ్లలో అన్నంతో పాటుగా జొన్న లేదా గోధుమ రొట్టెలు ఖచ్చితంగా ఉంటాయి. గోధుమ పిండి చపాతీ అయినా, మల్టీగ్రెయిన్ పిండి రోటీ అయినా సరే ఏదో ఒకటి ఖచ్చితంగా తింటాం. అయితే చాలా మంది చపాతీలను వేడివేడిగా తినడానికే ఇష్టపడతారు. కానీ చాలాసార్లు చపాతీలు మిగిలిపోతుంటాయి. ఈ మిగిలిపోయిన చపాతీలో ఎన్నో రకాల వంటకాలు కూడా చేస్తుంటారు. అయితే ఇలా మిగిలిపోయిన చపాతీలను తినొచ్చా? లేదా? అనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. కానీ మిగిలిపోయిన చపాతీనే ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మిగిలిపోయిన చపాతీలో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇది మన గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. మిగిలిపోయిన రొట్టె గట్ బ్యాక్టీరియాను పెంచుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నిజానికి మిగిలిపోయిన ఫుడ్ జీర్ణక్రియకు మంచిది కాదని అంటారు. కానీ పాత రొట్టె మన జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. కానీ రోటీలు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా 1 నుంచి 2 రోజుల రొట్టెలను గనుక తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 

10-12 గంటల ముందు చేసిన చపాతీలను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ చపాతీలో రెసిస్టెన్స్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ రెసిస్టెన్స్ స్టార్చ్ డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.  మిగిలిపోయిన చపాతీలో విటమిన్ -బి 12 కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ -బి12 తక్కువగా ఉన్నవారు ఇలాంటి చపాతీలను తినాలి. మీకు తెలుసా? మిగిలిపోయిన చపాతీలు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. చాలా మంది పాలు, పెరుగు లేదా నెయ్యితో మిగిలిపోయిన చపాతీలను తింటుంటారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios