Asianet News TeluguAsianet News Telugu

మ్యాంగో, టమాటా చట్నీ.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా..?

మనం నార్మల్ గా టమాట పచ్చడి ఎలాగైతే చేసుకుంటామో.. అది ప్రాసెస్ లో ఇది కూడా చేస్తాం. కాకపోతే.. అదనంగా మామిడికాయ చేరుస్తాం.

Make mango and tomato chutney easily at home ram
Author
First Published Jul 3, 2024, 2:10 PM IST

ఎండాకాలం వచ్చింది అంటే చాలు.. చట్నీల సీజన్ మొదలైనట్లే. దాదాపు మన దేశంలో అందరూ ఈ ఎండాకాలం పచ్చళ్లు పేట్టేసుకునే ఉంటారు. మామిడి, టమాట, గోంగూర ఇలా చాలా రకాల పచ్చళ్లు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ.. ఎప్పుడైనా మీరు మ్యాంగో, టమాటా రెండూ కలిపి చట్నీ చేశారా..? ఈ కాంబినేషన్ లో పచ్చడి దాదాపు ఎవరూ చేసి ఉండకపోవచ్చు. కానీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి.. ఆ రుచి మీకు కచ్చితంగా నచ్చుతుంది. మళ్లీ , మళ్లీ చేసుకొని తింటారు. మరి.. ఈ మ్యాంగో, టమాట చట్నీ ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం...

ఈ పచ్చడి కోసం మనకు పచ్చి మామిడికాయ, టమాట, పచ్చి మిరపకాయలు ఉంటే సరిపోతుంది. మనం నార్మల్ గా టమాట పచ్చడి ఎలాగైతే చేసుకుంటామో.. అది ప్రాసెస్ లో ఇది కూడా చేస్తాం. కాకపోతే.. అదనంగా మామిడికాయ చేరుస్తాం.

ముందుగా.. మామిడికాయ చెక్కు తీసి.. చిన్న ముక్కలుగా కోసుకోవాలి.  తర్వాత.. టమాట లు తీసుకొని వాటిని కూడా.. ముక్కలుగా కోసుుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి  చేయాలి. నూనె వేడి అయిన తర్వాత.. మామిడి, టమాట ముక్కలు వేయాలి. రెండు ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి.

ఈ ముక్కులు మంచిగా మగ్గాయి అనుకున్న తర్వాత.. అందులో వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిరపకాయలు జత చేయాలి. కావలంటే.. ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. అన్నీ వేగిన తర్వాత.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.  ఇప్పుడు చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత.. మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. రుచికి సరపడా ఉప్పు వేసుకోవడం మర్చిపోవద్దు. కొంచెం ఎర్రటి ఎండుకారం కూడా వేసుకోవచ్చు. 

మొత్తం బాగా కలుపుకున్న తర్వాత.. అందులో చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయచ కొత్తిమీర, నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసి.. తర్వాత.. తినేయడమే. స్నాక్స్, చపాతీ, రైస్.. ఇలా ఎందులోకి తిన్నా చాలా కమ్మగా, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.  ఈ పచ్చడిని మనం నీరు తగలకుండా.. కంటైనర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే.. 15 నుంచి 20 రోజుల వరకు వాడుకోవచ్చు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios