Sugar patients: షుగర్ పేషెంట్స్ చపాతీలో ఈ 3 కలిపి తింటే చాలు.. సూపర్ రిజల్ట్స్!

Synopsis
ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. వయసుతో సంబంధం లేకుండా అందరూ షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. షుగర్ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం తేడా అయినా షుగర్ కంట్రోల్లో ఉండదు. చపాతీ పిండిలో ఈ 3 పదార్థాలు కలిపి తీసుకోవడం ద్వారా షుగర్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అవెంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం షుగర్ వ్యాధి చాలా సాధారణం అయిపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. గజిబిజి లైఫ్ స్టైల్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఫ్యామిలీ హిస్టరీ కారణంగా షుగర్ వ్యాధి వస్తుంటుంది. షుగర్ ను ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల శరీరంలో ఒక్కో భాగంపై ప్రభావం పడుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ తీసుకునే పుడ్ విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కనీస వ్యాయామాలు చేయాలి. చక్కెర లేని పదార్థాలు తీసుకోవాలి. సాధారణంగా షుగర్ పేషెంట్లు అన్నం కంటే కూడా చపాతీలను ఎక్కువగా తింటారు. అయితే చపాతీ పిండిలో ఈ 3 పదార్థాలు కలపడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు అవెంటో ఇక్కడ చూద్దాం.
చపాతీ పిండిలో కలపాల్సిన పదార్థాలు
చపాతీ చేసే ముందు పిండిలో 3 పదార్థాలు కలపాలి. ఇవి షుగర్ కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి.
మెంతులు
మెంతులు మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. వీటిలో కరిగే ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. కాబట్టి మెంతుల పొడిని గోధుమ పిండిలో కలిపి చపాతీలు చేసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.
వాము
చపాతీ చేయడానికి ముందుగా పిండిలో వాము కూడా కలపవచ్చు. వాములో ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. తిన్న ఆహారం మంచిగా జీర్ణం కూడా అవుతుంది.
అవిసె గింజలు
చపాతి పిండి కలిపేటప్పుడు అవిసె గింజలు కూడా కలపవచ్చు. ఇది డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నాన్స్ లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, చర్మానికి మేలు చేస్తాయి.
ఇవి గుర్తుంచుకోండి
ప్రతి రోజూ చపాతీ తినాలనుకునే వారు.. రోజూ పిండి కలిపేటప్పుడు ఈ 3 పదార్థాలను కలిపే బదులు.. పిండి విసిరేటప్పుడే ఈ మూడు రకాల గింజలను కలపడం మంచిది. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.