Asianet News TeluguAsianet News Telugu

మన కాఫీకీ ప్రపంచమే ఫిదా.. వరల్డ్ బెస్ట్ కాఫీ లీస్ట్ లో ఇండియన్ ఫిల్టర్ కాఫీ..

వేడి వేడి నురగలు, పొగలొచ్చే కాఫీని తాగుతుంటే వచ్చే ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది కదా.. అందుకే ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కాఫీ ప్రియులు ఉన్నారు. ఇక ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల కాఫీలు కూడా ఉన్నాయి. కానీ అందులో మన  దేశ ఫిల్టర్ కాఫీ మాత్రం సెకండ్ ప్లేస్ దక్కించుకుంది తెలుసా? 
 

india s filter coffee ranks second place among top 38 best coffees in the world rsl
Author
First Published Mar 8, 2024, 2:59 PM IST

కాఫీ వాసన ఎంత బాగుంటుందో.. దాని టేస్ట్ అంతకంటే బాగుంటుంది. అందుకే ఈ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది టీ కంటే కాఫీనే ఎక్కువగా తాగుతారు. కాఫీలో కూడా చాలా వెరైటీలు ఉంటాయి. ఎన్ని వెరైటీ కాఫీలున్నా కానీ మన దేశంలో తయారుచేసే ఫిల్టర్ కాఫీ మాత్రం ఈ ప్రపంచ జనాలను కట్టిపడేస్తుంది. జనాలను ఫిదా చేసేసింది. అవును ఫుడ్స్, ట్రావెల్ గైడ్లను అందించే టేస్ట్ అట్లాస్ అనే వెబ్సైట్ తాజాగా 'ప్రపంచంలోని టాప్ 38 కాఫీల' జాబితాను ప్రచురించింది. దీనిలో మన ఇండియన్ ఫిల్టర్ కాఫీ రెండో స్థానంలో నిలిచింది. ఇక ఫస్ట్ ప్లేస్ 'క్యూబన్ ఎస్ప్రెస్సో' ఉంది. 

'క్యూబన్ ఎస్ప్రెస్సో' తియ్యగా ఉంటుంది. దీన్ని చక్కెర, డార్క్ రోస్ట్ కాఫీతో తయారుచేస్తారు. దీన్ని ఎలక్ట్రిక్ ఎస్ప్రెస్సో కాఫీ మేకర్ ను ఉపయోగించి తయారుచేస్తారు. ఈ కాఫీ పైన మంచి రంగులో నురగ కూడా ఉంటుంది. 

ఇకపోతే 'సౌత్ ఇండియన్ కాఫీ'ని స్పెషట్ ఫిల్టర్ మెషిన్ ను ఉపయోగించి తయారు చేస్తారు. ముందు కాఫీని తయారుచేసి అందులో గోరువెచ్చని పాలు, పంచదారను వేసి కలుపుతారు. దీనిని స్టీల్ లేదా ఇత్తడి గ్లాసులో వేసి సర్వ్ చేస్తారు. 

నిజానికి ఈ కాఫీల స్పెషల్ టేస్ట్ వల్లే ఇవి అన్ని రకాల కాఫీలను దాటేసి ఒకటి, రెండు స్థానాలను దక్కించుకున్నాయి. ఏదేమైనా మన ఫిల్టర్ కాఫీకి ప్రపంచమే ఫిదా కావడం ఆనందం కలిగించే విషయం.ఇక ఈ విషయంపై ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ లు కూడా పెడుతున్నారు. వాటిలో ఈస్ట్ ఆర్ వెస్ట్ ఇండియన్ కాఫీ ఈస్ ది బెస్ట్ అంటూ ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios