Asianet News TeluguAsianet News Telugu

టేస్టీ అండ్ హెల్దీ.. స్వీట్ పొటాటో చిప్స్..!

ఆలూ చిప్స్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. మరి.. మనకు ఆరోగ్యాన్ని అందిస్తూ.. సరదాగా తినే చిప్స్ కావాలంటే మాత్రం స్వీట్ పొటాటో చిప్స్ ని ఎంచుకోవాలి.

How to Make sweet potato Chips
Author
Hyderabad, First Published Oct 21, 2021, 5:05 PM IST

సరదాగా సాయంత్రం పూట లేదంటే.. సినిమా చూస్తూ చిప్స్ తినడం అంటే చాలా మందికి ఇష్టం. అలా అని తరచూ ఆలూ చిప్స్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. మరి.. మనకు ఆరోగ్యాన్ని అందిస్తూ.. సరదాగా తినే చిప్స్ కావాలంటే మాత్రం స్వీట్ పొటాటో చిప్స్ ని ఎంచుకోవాలి.

How to Make sweet potato Chips
 
స్వీట్ పొటాటో (sweet potato) దీనినే మనం చిలగడ దుంప అని కూడా అంటాం. ఈ స్వీట్ పొటాటో అనేది ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. విటమిన్ బి 6 అధికంగా ఉండే చిలగడదుంపలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండే చిలగడదుంపలు ఎముకలు , దంతాల ఆరోగ్యానికి మంచివి. చిలగడదుంప వంటకాలు ఆరోగ్యానికి మంచివి. చిలగడదుంపతో చిలగడదుంప చిప్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

How to Make sweet potato Chips

కావలసిన పదార్థాలు ...

1 కిలోల చిలగడదుంపలు,
తగినంత నీరు, తగినంత
వేయించడానికి నూనె,
2 టీస్పూన్ల ఉప్పు, 2 టీస్పూన్లు
మిరప పొడి

How to Make sweet potato Chips

తయారు చేసే విధానం.

ముందుగా చిలగడ దుంపలను శుభ్రంగా నీటితో కడగాలి. ఆ తర్వాత పైన తొక్కు తొలగించాలి. తర్వాత దానిని సన్నని గుండ్రని ముక్కలుగా తురుముకోవాలి.  తరిగిన ఈ చిలగడ దుంప ముక్కలను అరగంట పాటు నీటిలో నానపెట్టాలి. తరువాత బాగా కడిగి, మొత్తం నీటిని తీసివేయండి. బాణలిలో నూనె వేడి చేసి చిలగడదుంపలను వేయించాలి. దీనిని సాధారణ బంగాళాదుంప చిప్స్ లాగా వేయించవచ్చు. తర్వాత దీనిని ఉప్పు మరియు కారం పొడి చల్లి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయవచ్చు. చిలగడదుంప చిప్స్ మంచి చిరుతిండి గా ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios