రవ్వతో టేస్టీ టేస్టీ గులాబ్ జామూన్.. ఎలా తయారుచేయాలంటే?

మామూలుగా ప్రతి ఒక్కరూ మార్కెట్ లో దొరికే గులాబ్ జామూన్ పిండితోనే గులాబ్ జామూన్ లను తయారుచేస్తుంటారు. కానీ ఇంట్లో మీరు చాలా ఈజీగా రవ్వతో టేస్టీ టేస్టీగా గులాబ్ జామూన్ లను తయారుచేయొచ్చు. అదెలాగంటే? 

how to make rava gulab jamun recipe rsl

గులాబ్ జామూన్ లను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఇవి అంత టేస్టీగా ఉంటాయి మరి. ఈ గులాబ్ జామూన్ లు నోట్లో వేసుకున్న వెంటనే అలా కరిగిపోతాయి. అందుకే చాలా మంది వీటిని తరచుగా చేసుకుని తింటుంటారు. అయితే ప్రతి ఒక్కరూ గులాబ్ జామూన్ లను .. మార్కెట్ లో దొరికే గులాబ్ జామూన్ పిండితో తయారుచేస్తుంటారు. కానీ రవ్వతో కూడా అదిరిపోయే టేస్టీ టేస్టీ గులాబ్ జామూన్ లను తయారుచేయొచ్చు. అవును వీటితో గులాబ్ జామూన్ లను తయారుచేయడం చాలా ఈజీ. రవ్వతో చేసిన గులాబ్ జామూన్ మెత్తగా, స్పాంజీలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం రవ్వతో గులాబ్ జామూన్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం పదండి. 

కావాల్సిన పదార్థాలు 

రవ్వ - ఒక  కప్పు
పాలు - 1/2 కప్పు
పంచదార - 1 కప్పు
నెయ్యి - 1 టీస్పూన్

ఎలా తయారుచేయాలి?

రవ్వ గులాబ్ జామూన్ ను తయారుచేయడానికి ముందుగా ఒక బాణలీ తీసుకుని దానిలో నెయ్యి వేసి వేడి చేయండి. ఇది వేడి అయ్యాక ఒక కప్పు రవ్వ వేసి వేయించండి. ఇది లేత బంగారు రంగులోకి మారిన తర్వాత దానిలో ఒక కప్పు కాచిన పాలను పోసి బాగా కలపండి. ఆ తర్వాత దీనిలో 1 నుంచి 2 టీస్పూన్ల చక్కెరను వేయండి. తర్వాత ఈ రవ్వ మిశ్రమంలో అరకప్పు పాలు పోసి బాగా కలపండి. ఇది గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత ఇది చల్లారిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని పిండిలాగా బాగా కలపండి. 

ఇప్పుడు ఈ రవ్వ పిండితో చిన్న చిన్న బాల్స్ ను తయారుచేయండి. అంటే గులాబ్ జామూన్ బాల్స్ లా చేయండి. ఇప్పుడు ఈ బాల్స్ ను  బాణలిలో నూనె లేదా నెయ్యి వేడి చేసి అందులో వేయించండి. ఇవి బంగారు రంగులోకి మారగానే నూనెలోంచి బయటకు తీయండి. మరొక పాత్ర తీసుకుని అందులో పంచదార సిరప్ ను తయారుచేయండి. ఈ సిరప్ లో రవ్వ ఉండలను వేసి  1-2 గంటల తర్వాత తింటే టేస్ట్ అదిరిపోతుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios