Asianet News TeluguAsianet News Telugu

సాబుదానా తింటే బరువు తగ్గుతారా?

ప్రస్తుత కాలంలో చాలా మంది ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు. ఈ ఓవర్ వెయిట్ మనల్ని ఎన్నో వ్యాధుల బారిన పడేస్తుంది. అయితే సాబుదానా తిన్నా బరువు కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో తెలుసుకుందాం పదండి. 

how sabudana is helpful in weight loss rsl
Author
First Published Aug 25, 2024, 12:17 PM IST | Last Updated Aug 25, 2024, 12:17 PM IST

నేటి కాలంలో అధిక బరువు ఒక సర్వసాధారణ సమస్యగా మారింది. బరువు ఎక్కువగా ఉన్నవారు తగ్గడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ కొంతమందికి ఎలాంటి ప్రయోజనం దక్కదు. బరువు తగ్గాలంటే మీరు తినే ఆహారంపై కూడా దృష్టి పెట్టాలి. మీరు బరువు తగ్గడానికి ఎన్నో ఫుడ్స్ ను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటిలో సాబుదానా ఒకటి. సాధారణంగా ఉపవాస సమయంలోనే సాబుదానాను ఎక్కువగా తింటుంటారు. కానీ మీరు దీన్ని వేరే సమయాల్లో కూడా తినొచ్చు. మీకు తెలుసా? సాబుదానా కూడా మీరు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. అదెలాగో ఓ లుక్కేద్దాం పదండి.

కేలరీలు తక్కువ

ఎక్కువ నూనె లేదా చక్కెర లేకుండా సాబుదానా వంటను తయారు చేసినప్పుడు దీన్ని కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తో పోలిస్తే దీనిలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది మీకు మరింత ఎనర్జిటిక్ అనుభూతిని కూడా కలిగిస్తుంది. అయితే మీరు బరువు తగ్గాలనుకుంటే సాబుదానాను లిమిట్ లో తినండి. ఇది కేలరీల వినియోగాన్ని సమతుల్యం చేస్తుంది.

ఫైబర్ ఎక్కువ 

సాబుదానాలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. తొందరగా కడుపును నింపుతుంది. ఇది అనారోగ్యకరమైన ఆహారాలు, భోజనాల మధ్య మీ ఫుడ్ కోరికలను తగ్గిస్తుంది. సాబుదానాలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే మలబద్దకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. 

జీవక్రియను పెంచుతుంది

సాబుదానాలో ఉండే సంక్లిష్ట పిండి పదార్థాలు మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇది జీవక్రియను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది సహజ పద్ధతిలో మీరు బరువు తగ్గడానికి మీ  జీవక్రియను పెంచుతుంది. ఈ స్థిరమైన శక్తి విడుదల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

ఫ్యాట్ కంటెంట్ తక్కువ

సాబుదానాలో కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే సాబుదానాను మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇది మీ ఆహారంలో కొవ్వు పదార్థాల్ని తగ్గించి స్థిరమైన శక్తిని అందిస్తుంది. దీంతో మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది. సాబుదానాలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు మీకు స్థిరమైన శక్తిని అందిస్తాయి. ఇది మిమ్మల్ని మరింత చురుకుగా, ఫిట్ గా ఉంచుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios