Asianet News TeluguAsianet News Telugu

మూంగ్ దాల్ వాటర్ తో ఇన్ని ప్రయోజనాలా..? సీజనల్ వ్యాధులకు చెక్..?

మందులతో పని లేకుండా.. కేవలం ఇంట్లోని కొన్ని ఆహారాలతో, మన లైఫ్ స్టైల్ మార్పులతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

Gut Feeling Off This Monsoon? This Humble Moong Water Recipe Is Your Answer ram
Author
First Published Jul 2, 2024, 9:39 AM IST


రుతుపవనాలు అడుగుపెట్టడంతో వాతావరణం చల్లగా మారిపోయింది. అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి. దీంతో.. వేడి తగ్గి.. హాయి అనుభూతి కలుగుతోంది. వర్షాకాలం ఇచ్చే హాయిని అందరూ ఆస్వాదిస్తారు. కానీ.. ఈ సీజన్ వస్తూ వస్తూనే మనకు చాలా రకాల సమస్యలు తెచ్చి పెడుతుంది. జలుబు, దగ్గులాంటి అనారోగ్య సమస్యలతో పాటు.... చాలా రకాల జీర్ణ సమస్యలు కూడా వచ్చేస్తాయి. చాలా మందికి ఈ కాలంలో తీసుకన్న ఆహారం అంత తొందరగా జీర్ణం కాదు. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. వీటిని తగ్గించుకోవడానికి మందులు వాడేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే... మందులతో పని లేకుండా.. కేవలం ఇంట్లోని కొన్ని ఆహారాలతో, మన లైఫ్ స్టైల్ మార్పులతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

మనందరికీ పెసరపప్పు గురించి తెలుసు. ప్రోటీన్ కి మంచి సోర్స్. అయితే... ఈ పెసరపప్పు ఉడకపెట్టిన తర్వాత వచ్చే నీరు.. జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుందని మీకు తెలుసా? తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడం దగ్గర నుంచి... కడుపు ఉబ్బరం సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ మూంగ్ దాల్ వాటర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం....

సాధారణంగా.. వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది.  తీసుకున్న ఆహారం అంత సులభంగా జీర్ణమవ్వదు. అందుకే.. ఈ వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థను సరిగా చూసుకోవడం చాలా అవసరం. ఈ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి మూంగ్ దాల్ వాటర్ చాలా బాగా సహాయపడుతుంది.
 
ఈ మూంగ్ వాటర్ రెసిపీ ఇంట్లోనే మూంగ్ వాటర్ తయారు చేయడం చాలా సులభం. సాధారణంగా అవసరమైన నీటి కంటే కొంచెం ఎక్కువగా మూంగ్ దాల్  ఉడకపెట్టాలి.  చల్లారిన తర్వాత పప్పు నుంచి నీరు వేరు చేయాలి. ఆ నీటిని గ్లాసులోకి మార్చాలి. ఇప్పుడు ఆ నీటిలో  ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టీస్పూన్ పసుపు , ఎండుమిర్చి జోడించండి. అంతే.. రుచికరమైన మూంగ్ దాల్ వాటర్ రెడీ అయిపోయినట్లే.

ఈ మూంగ్ దాల్ వాటర్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం....
మూంగ్ దాల్ .. ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడే పెక్టిన్‌తో నిండి ఉంది. మూంగ్ దాల్  వాటర్ జీర్ణాశయ మంటలను ఆర్పడానికి సహాయపడుతుంది. మీరు మలబద్ధకం, గ్యాస్ లేదా వర్షాకాలంలో ఉబ్బరంతో బాధపడుతుంటే శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, మీ శరీరం జీర్ణవ్యవస్థను కిక్‌స్టార్ట్ చేయడానికి ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో ఈ నీటిని తాగితే సరిపోతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios