చలికాలంలో రోజూ ఒక క్యారెట్ ను తింటే ఏమౌతుందో తెలుసా?

క్యారెట్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. నిజానికి ఇది చలికాలంలో మన ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. మీరు గనుక ఈ చలికాలంలో రోజూ ఒక క్యారెట్ ను తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారో తెలుసా?

eat carrots daily in winter lose weight fast blood sugar levels will also be controlled rsl

క్యారెట్లను పచ్చిగా అలాగే తినేయొచ్చు. ఎందుకంటే ఇవి టేస్టీగా ఉంటాయి. అంతేకాదు వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, రకరకాల విటమిన్లు, పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని బలంగా ఉంచి ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. క్యారెట్ ను ప్రతిరోజూ తింటే మన ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఆరోగ్యంగా ఉంటాం. 

బీటా కెరోటిన్, విటమిన్ ఎ, ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ కె వంటి పోషకాలు క్యారెట్లలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అసలు ఈ చలికాలంలో రోజూ ఒక క్యారెట్ ను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చలికాలంలో రోజూ ఒక క్యారెట్ ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

కంటి చూపును మెరుగుపరుస్తుంది

క్యారెట్లలో కంటికి మేలు చేసే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ లు మెండుగా ఉంటాయి. ఈ రెండూ మన కంటి చూపును మెరుగుపర్చడానికి రాత్రిపూట కళ్లు బాగా కనిపించేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కంటిచూపు సరిగ్గా లేనివారు రోజూ ఒక క్యారెట్ ను తింటే చాలా మంచిది. 

రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది

మన రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటేనే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం. అయితే క్యారెట్లలో మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విటమిన్ సి,  వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా దగ్గు, జలుబు వంటి సీజనల్ సమస్యలు రాకుండా కూడా కాపాడుతాయి. 

చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది

క్యారెట్లు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. క్యారెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. అంతేకాదు రోజూ ఒక క్యారెట్ ను తినడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి. అలాగే మీ స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

క్యారెట్లను మీరు బరువు తగ్గడానికి కూడా తినొచ్చు. ఎందుకంటే క్యారెట్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ ఫైబర్ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా క్యారెట్లలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు వీటిని డైట్ లో చేర్చుకుంటే సులువుగా బరువు తగ్గుతారు. 

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

క్యారెట్లు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. క్యారెట్లలో గుండెకు మేలు చేసే ఫైబర్, పొటాషియం లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ మన గుండెకు హాని చేసే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి, అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. అంతేకాదు క్యారెట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. 

క్యాన్సర్ నివారణ

క్యారెట్లు క్యాన్సర్ నివారణగా కూడా పనిచేస్తాయి. వీటిలో కెరోటినాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరం క్యాన్సర్ తో పోరాడటానికి సహాయపడతాయి. అలాగే ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా క్యారెట్లు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

క్యారెట్లు మన జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి. వీటిలో ఫైబర్  కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. మీరు చలికాలంలో రోజూ ఒక క్యారెట్ ను గనుక తిన్నారంటే మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఇది గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు క్యారెట్లు ఎముకలను బలంగా ఉంచడానికి, ఎముకల వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది. దీనిలో ఎముకల్ని బలంగా ఉంచే కాల్షియం, విటమిన్ కెలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల పగుళ్లు రాకుండా కాపాడుతాయి. 

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది

క్యారెట్లు డయాబెటీస్ పేషెంట్లకు కూడా మేలు చేస్తాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. అందుకే క్యారెంట్లు డయాబెటీస్ పేషెంట్లకు చాలా మంచివని చెప్తారు. చలికాలంలో క్యారెట్ల ప్రయోజనాలను పొందడానికి మీరు వీటిని జ్యూస్ లేదా స్నాక్స్, సలాడ్ గా తినొచ్చు. కానీ వీటిని రెగ్యులర్ గా తింటే మాత్రం మీరు  హెల్తీగా, ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios